నాస్తికుడిని ఆస్తికుడిగా మార్చిన సాయినాధుడు

నేను ఒక గవర్నమెంటు ఉద్యోగం చేస్తాను. నా భార్య లోదీ రోడ్ లో వున్న సాయిబాబా మందిరం కు వెళ్దాం అని చాలా సార్లు అడిగేది.కానీ నాకు విగ్రహ పూజ మీద అస్సలు విశ్వాసం లేదు అందుకే నేను ఎప్పుడు వద్దు అనేవాడిని.

మాటి మాటికి అడిగేది , రండి ఒక్కసారి వెళ్దాం అని సరే అనుకోని 2006 జనవరిలో ఒక గురువారం ఆమెను తీసుకొని లోదీ రోడ్, న్యూఢిల్లీ లో వున్న సాయిబాబా మందిరానికి వెళ్ళాను.

నా భార్య పూలు తీసుకొని లోపలికి వెళ్ళింది. నాకు నమ్మకం లేనందు వలన నేను బయటనే కూర్చొని వున్నాను.

నేను బయట కూర్చొని అర్ధగంట ఆలోచిస్తూ వున్న, ఎందుకు ప్రజలు విగ్రహ పూజ నమ్ముతారు.అంతా waste , ఎలా ఈమెకు అర్దమయ్యేట్లు చెప్పను! దేవుడు లేదు, ఏమి లేదు, అనుకుంటూ కూర్చున్నాను.

దానికి కొన్ని రోజుల తరువాతనే అక్కడవున్న ఒక School Ground లో సాయి సంధ్య Program పెట్టారు.

నా భార్య నన్ను మళ్ళీ అడిగింది, వెళ్దాం రండి, భజన, పాటలు పాడతారు, అక్కడ కూర్చొని విందాము అని అడిగింది. నా మనసులో మళ్ళీ అదే చింత అయినా నా భార్య మాట కాదనా లేక వెళ్ళాను.

రెండు, మూడు గంటలు కూర్చున్నాము. నాకు తెలియకుండానే బాబా భజనలు మనసు పెట్టి విన్నాను.

నాకు మొదటిసారి అనుభూతి కలిగింది, వేరే దేవి, దేవతలు వున్నారో లేదో తెలియదు కానీ సాయిబాబా నిజంగానే వున్నారు.

బాబా, సాయి సంధ్య తరువాత 3 రోజులకు జనవరి 26th 2006 లో ఉద్యోగరీత్యా నేను గురువారం లోదీ రోడ్ కు వెళ్ళాలసి వచ్చింది. అప్పుడు నా భార్యతో అన్నాను, వస్తావా, బాబా మందిరానికి వెళ్దాం అని, ఆమె వెంటనే నాతొ బయలు దేరి వచ్చింది.

ఆ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు బాబా విగ్రహాన్ని అలా చూస్తూ వుండిపోయాను. నా కళ్ళలో నీళ్ళు అలా కారుతూ వున్నాయి. ఆ భగవంతుని మొదటి దర్శనం రోమాంచితాన్ని కలిగించింది. ఆయన పాదాలు పట్టుకొనే సరికి, నాకు ఎన్ని రకాల vibrations వచ్చాయంటే , వర్ణించటం నా తరం కాదు. ఆ రోజు నుంచి నేను నా భార్య ఇంట్లో కూడా బాబాను ప్రతిష్ట చేసుకున్నాం.

పూజ అర్చనా. విధిగా చేస్తాం. ప్రతి గురువారం ఆ మందిరానికి వెళ్తాం, ఇంట్లో కూడా బాబా హారతులు చేస్తాం, దగ్గర దగ్గర ఎనిమిది నెలల తరువాత నా కుటుంబంతో మొదటిసారి శిరిడీలో నా కాలు పెట్టాను.

బాబా దర్శనాలు అన్ని హారతులు చూసేవాళ్ళం. అదీకాక నేను ద్వారకామాయిలో రాత్రి కూర్చొని ధ్యానం చేసుకునే వాడిని. నా స్వయం అనుభూతి ఏమిటంటే ఇక్కడ ద్వారకామాయిలో రాత్రి ధ్యానం చేసుకుంటే సాయినాథుని మీద భక్తి శ్రర్ధలు చాలా అద్భుతంగా అధికమోతాయి.

ఆయన వున్నాడన్న అనుభూతి నిజంగా కలుగుతుంది. శ్రర్ధగా బాబా పాదానమస్కారం చేసుకుంటే ఎటువంటి కష్టమైన అదే సమసిపోతుంది.

నా మీద బాబాకు ఎంత కృప వుందంటే ఒక నాస్తికున్నితన భక్తునిగా చేసుకున్నారు. బాబా మీద భక్తి విశ్వాసాలు పెరిగే కొద్ది, నేను ఆయనకు ఋణపడి పోయాను అన్నివిధాలుగా.

అయినా నాకు ఒక దుఃఖం ఏమిటంటే ఏ దేవుని దర్బారు కు వెళ్ళి నా అజ్ఞాన కారణంగా దర్శనం చేసుకునే వాడిని కాదో, అదే దైవం నన్ను తన శ్రీ చరణాలకు రప్పించాడు.

ధ్యానం, సమాధిస్థితి వచ్చే వరకు తీసుకెళ్ళాడు. నా ప్రతి ఉచ్వాస, నిశ్వాసంలో బాబా స్మరణ జరుగుతువుంటుంది.

ఆయన నిరాకారా, సాకార రూపంలో ఎన్నోసార్లు దర్శనం ఇచ్చారు. నా కష్టాలను నా వరకు కూడా రాకుండా తానే తీర్చేసారు.

ప్రతి రోజు హారతి, భజనలు చేస్తాం కుటుంబసభ్యులందరం కలసి గురువారం కోసం ఎదురు చూస్తూవుంటాం.

నేను సంవత్సరానికి ఒక సారి చాలా కుటుంబాలను శిరిడీ బాబా దర్శనానికి తీసుకెళ్తాను. ఆయన భక్తి మార్గంలో నడిచేటట్లు చేస్తాను. వాళ్ళ అందరికి ఏదైనా కష్టాలు, సమస్యలు వుంటే ఇట్టే తీరిపోతాయి.

ముఖ్యంగా మాటి మాటికీ నేను చెప్పేదేమంటే నాలాంటి నాస్తికుడి పైన ఆయన కృపా దృష్టి పూర్తిగా వుంటే , ఇంక మీ లాగా భక్తి శ్రర్ధలతో నమ్మే వాళ్ళను వెన్నంటి కాపాడుతారు.

అది సత్యం, సత్యం, పునః సత్యం.

సదా సాయిసేవలో నా జీవితం గడపాలని నా అంతిమ కోరిక.

సర్వం సాయి నాధార్పణమస్తు.

సురేష్ చంద్ర, 
లోదీ కాలనీ, న్యూఢిల్లీ.

 

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్ 

 

Latest Miracles:

14 thoughts on “నాస్తికుడిని ఆస్తికుడిగా మార్చిన సాయినాధుడు

  1. ఒకప్పుడు నాకు కూడా...భగవంతుడు ఎవరో తెలియదు....కానీ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ..నా ఫ్రెండ్ సాయి చాంద్ రోజు సాయి బాబా టెంపుల్ ముందు వెళుతుంటే ...అతను ఆ టెంపుల్ లో కి వెళ్లి బాబా పాదాలను మొక్కేవాడు...పాదాలను ముద్దు కూడా పెట్టుకొనేవాడు......నేను ఎప్పుడూ లోపలి కూడా వేళ్ళ లేదు... సారి అడిగాను కూడా...అంత మహిమ అని...అప్పడు నా ఫ్రెండ్ ఏమి చెప్పా లేదు...
    అటువంటి నేను...ఇప్పుడు ప్రతి నిమిషము బాబా పాదాలని ముద్దు పెట్టు కోవలిసిందే...అంతా అయన లీలే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *