పవిత్ర నగరి శిరిడీ చేరగానే భక్తురాలి జబ్బు నయం అగుట

సాయి భక్తి మాకు మా నాన్న గారి ద్వారా ఆశీర్వాదరూపంలో ప్రాప్తించింది. దానికి మేము ఎంతోఅదృష్టవంతులం అనుకుంటాము.

మాకు బాబా అనేకమైన, అద్వితీయమైన అనుభవాలను కలిగిస్తున్నారు.దానిలో ఒకటి మచ్చుకు నేను రాస్తున్నాను.

ఫిబ్రవరి 2010 లో జరిగిన సంఘటన ఇది మేము అందరం కలిసి దహను అనే స్థలానికి picnic కు వెళ్ళాము.

అక్కడ సముద్రంలో చాలా సేపు స్నానాలు చేశాము, ఆడాము, చాలా enjoy చేశాం:

ఇంకేముంది ఇంటికి వచ్చేసరికి దగ్గు పడిసం, జ్వరం...అన్ని మేము నీతో వున్నాము అన్నట్లు పట్టేశాయి.

ఎన్ని మందులు తీసుకున్న పోలేదు. Antibiotics తీసుకున్నా పోలేదు. అందువల్ల, ఇంక సాయి సచ్చరిత్ర నే మార్గం అనుకోని సాయి పోతీ(పారాయణ) చదవడం మొదలు పెట్టాను.

అతి కష్టం మీద రెండు రోజులు చదివాను. మూడో రోజు నాకు ఒక సంకేతం వచ్చింది, బాబా ఇలాగే జబ్బుతో వున్నా మనిషిని శిరిడికి రమ్మన్నారు. అక్కడనే ఆయనకు ఆరోగ్యం బాగైంది.

ఇది చదివాక, నేను అనుకున్నా బాబా నన్ను శిరిడికి రమ్మంటున్నారు, అని అంతకముందు ఎన్ని సార్లు వెళ్దాం అనుకున్న వెళ్లలేక పోయేదాన్ని .

ఇంక ticket చేసుకొని పవిత్ర నగరి శిరిడీ చేరుకున్నాను. అక్కడ అడుగు పెట్టానో, లేదో , నా దగ్గు మాయం అయినట్లు అయింది.

నిజానికి నేను మందులు కూడా తీసుకొని పోలేదు . అక్కడికి వెళ్ళినాక నాకు సాయిబాబా నవగురువారవ్రతం గురించి తెలిసింది. నేను ఈ వ్రతం చేయాలి అని అనుకున్నాను.

అప్పుడు నా రక్తంలో hemoglobin చాలా తగ్గిపోయింది. E .S .R . ఎక్కువ అయింది. మా వూరికి తిరిగివచ్చాక నేను నవగురువారవ్రతం మొదలు పెట్టాను.

నేను ఏ మందులు వేసుకోలేదు, వ్రతం చక్కగా, భక్తిపూర్వకంగా చేశాను. అంతే 9 గురువారాలు బాబాను భక్తితో కొలిచాను, అంటే మళ్ళీ రక్త పరిక్ష చేస్తే నాకు హిమోగ్లోబిన్ శాతం పెరిగింది. ESR తగ్గింది.

అసలు నన్ను ఎందుకు సముద్రం దగ్గరికి పంపారు! ఎందుకు జబ్బు పడినాను? ఎందుకు వ్రతం చేశాను? ఎందుకు బాబా బాగు చేశారు? అన్ని గమనిస్తే (పూర్వ జన్మ పాపం వ్యాధి రూపేణ పీడితం) అంటారు. అలా చేసి నా పూర్వజన్మ పాపాన్నిచిన్న జబ్బుతో బాబా దులిపేశారు.

అందుకే 108 అష్టోత్తరంలో " ఓం కర్మ ద్వంసినే నమః" అంటాము. ఇప్పుడు చెప్పండి, అవునా ...కాదా....

సర్వం సాయినాధార్పణమస్తు

మనీషా రావరాణే, 
దహినార్ ముంబయి.

 ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:

11 thoughts on “పవిత్ర నగరి శిరిడీ చేరగానే భక్తురాలి జబ్బు నయం అగుట

  1. chalaamandhi jabbutho baba daggariki vachinavaallu vunnaru.without any medicine baaga ayyaru..sai naamame devya oushadham..bhakthi....shradhalu...pradhanam..thank u murthygaru..doing gud job.

  2. when my both eyes r operated..i m only remember sai..sai..sai..only..Madhu u know it..YES..babas name only medicine which cure all deceases..sairam

  3. Sarvam sainadha Arpanamasthu. Naa anni samasyalu Baba charanala daggare unchanu. Annintiki ayane pariskaram chuputharu.OM Sairam Jai ashram.

  4. నా ఫ్రెండ్ పాపా కి కూడా బాగా జ్వరము వస్తే ..బాబా ఉది నుదిటిమీద పెట్టమని ..చెప్పాను..10 నిమిషాలలోనే తగ్గిపోయింది...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *