సాయిబాబా ఆశీర్వాద ఫలంగా సంతాన ప్రాప్తి.

శ్రద్ద - సబూరి అనే సందేశాలను ఇచ్చే సాయిబాబా,  ప్రతి ఒక్కరి ఆత్మలో నివసించే ఆ సాయి, మహాసంత్ పురుషుడు, జీవించి వున్నప్పుడు మరియు సమాధి తరువాత కూడా తన భక్తులకు ఆశీర్వాదం, ఇస్తూ అందరి కోరికలు తీరుస్తున్నారు.

అది 1978 మొదటసారి నేను శిరిడీ యాత్రకు వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పటినుంచి ఆ సచ్చిదానంద సాయి భక్తుడిగా మారిపోయాను.

బాబా కృప వలన నాకు 1982 లో నాకు ఉద్యోగం వచ్చింది. 1985 లో నాకు పెళ్ళి అయింది. నేను నా భార్యతో శిరిడీ వెళ్ళాలనుకున్నాను. కానీ వెళ్ళలేకపోయాను.

1990 వరకు నాకు సంతానం కలుగలేదు. నాకు సంతాన ప్రాప్తి లేదేమో అని అందరం చాలా విచారంగా వుండేవాళ్ళము.

బాబా ఆశీర్వాదం వలన నాకు1990 లో ఒక కుమారుడు కలిగాడు. అందుకే శిరిడీకి భార్య, పుత్రునితో వెళ్దాం అని అనుకున్నాం.

నాతొ ఆఫీసులో పనిచేసే నా సహఉద్యోగి శ్రీ రతన్ సింగ్ తోసర్. అతను నాకన్న వయసులో పెద్దవాడు, ఆయన నాకు మంచి మిత్రుడు. అతనికి పెళ్ళి అయి 12 సంవత్సరాలు అయింది, కాని పిల్లలు కలగలేదు.

అన్నీ సుఖ సంపత్తులు వున్నా విచారంగా వుండేవాడు. ఎప్పుడు అతని భార్య చేయని వ్రతాలు లేవు, దర్శించని దేవి దేవుళ్ళు లేరు. అన్ని కోరికలు తీరే పవిత్ర భూమి శిరిడీలో తన కోరిక తీరుతుందేమో అని ఆశతో ఆ దంపతులు మాతో శిరిడీ వచ్చారు.

మేము శిరిడీ చేరి పొద్దున్నే స్నానసంధ్యాదులు పూర్తి చేసుకొని, ప్రసాదం, పూలమాలతో బాబా దర్శనానికని సమాధిమందిర్ వైపు వెళ్ళాము. బాబా చరణద్వయంలకు నమస్కరించు కున్నాం. సమాధి పైనా తలపెట్టి నమస్కరించుకున్నాం.

అప్పుడు ఒక అసామాన్య ఘటన జరిగింది.ఆ సంఘటన వలననే రాబోయే రోజుల్లో జరిగే పరిణామం స్పష్టంగా అర్ధం అయింది.

మేము బాబా విగ్రహం ముందు నిలబడి ప్రసాదం, పుస్పాలు అర్పించి సాయిబాబా అలోకిక మూర్తినిచూస్తూ, స్తుతి చేసుకుంటూ అపరిమితమైన ఆత్మశాంతి అనుభవిస్తున్నాము. ఇంతలో ఎవరో తెలియదు, ఒకావిడ తన 3 సంవత్సరాల బిడ్డను నా స్నేహితుని భార్య చేతికి ఇచ్చి కొంచెం పట్టుకోండి వీడిని, నేను ఇప్పుడే వస్తాను, అని చెప్పి ఎక్కడికో వెళ్ళింది.

ఆవిడ అంత చిన్న బిడ్డను, ముక్కు మొహం తెలియని వారికి ఇస్తారా, ఏ తల్లి అయినా? Mrs తోసర్ ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది. 

బాబా సమక్షంలో అలోకికమైన ఆనందం, తన సొంత బిడ్డలాగా ఆమె ఆనందానికి అంతులేదు. పిల్లల కోసం పరితపించింది. Mrs తోసర్. అలా 10 నిముషాలు గడిచాయి.

మేము ఆ బిడ్డ తల్లి కోసం వేచివున్నాము. అంత జనములో ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఎలా వచ్చింది. బాబాకే తెలుసు.

ఆవిడ వచ్చి తన బిడ్డను తీసుకుంది. నీకు ఇలాంటి బిడ్డనే కలుగుతుందిలే, వేచివుండు కొంచెం, అని చెప్పి వెళ్ళిపోయింది.

నాకు అప్పుడు అనిపించింది, బాబానే Mrs తోసర్ కు తప్పకుండ సంతానాన్ని కలిగిస్తానని ఆశీర్వాదం ఇచ్చారు.

ఈ సంఘటన తరువాత ఆమెకు బాబాపై అతి భక్తి ప్రపత్తులు కలిగాయి. తనకు తప్పకుండ బాబా సంతానాన్ని కలిగిస్తాడని నమ్మకం కలిగింది. మేము ఇంక రెండు రోజులు వుంది భోపాల్ వెనక్కు వచ్చాము.

తరువాత 3 నెలలకు MR & MRS తోమర్ మా ఇంటికి వచ్చారు. అక్కడ నెహ్రు నగర్ లో ఒక సాయిబాబా మందిరం కట్టారు, మీరు రండి వెళ్దాం అని అడిగేదానికి వచ్చారు.

సంధ్య హారతి తరువాత అక్కడ పూజారి Mr తోసర్ కు 'సంతాన ప్రాప్తిరస్తు' అని ఆశీర్వాదం ఇచ్చారు. ఆయనకు ఎలా తెలుసు వీళ్లకు సంతానం లేదని , అంతా బాబా లీల కాకపోతే.

సాయిబాబా తన భక్తుల కోర్కెలు తీర్చడానికి ఎవరినో ఒకరిని మద్యంగా చేస్తాడు. 12 సంవత్సరాలు సంతానం లేని తోసర్ దంపతులకు 1995 లో ఒక పుత్రరత్నానికి జన్మనిచ్చింది .

అపారమైన ఆనందం కలిగే ఈ సందర్భంలో మాకు శిరిడిలో జరిగిన సంఘటన గుర్తు వచ్చింది. అప్పటినుంచి Mr & Mrs తోసర్ లకు సాయిబాబా మీద అపారమైన భక్తి శ్రద్దలు కలిగాయి.

సాయిబాబా ఎన్ని రకాల కోరికలు తీరుస్తున్నాడు చూడండి. ఆయనకు అపారమైన , అంతుచిక్కని, చెప్పలేనంత ప్రేమ తన భక్తుల మీద, సంతానప్రాప్తి, ధనప్రాప్తి అన్నీ, ఏది కావాలంటే అది , ఆయన అనుగ్రహిస్తారు.

సర్వం సాయినాథార్పణమస్తు

దేవేంద్ర ప్రకాష్ తివారి,
భోపాల్

 

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:

9 thoughts on “సాయిబాబా ఆశీర్వాద ఫలంగా సంతాన ప్రాప్తి.

  1. బాబా వారు అనుకుంటే చాలు ...డాక్టర్స్ కి సాధ్యం కానీ సమస్యలని కూడా పరిష్కరిస్తారు...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *