బాబా స్మరణ మాత్రం చేతనే భయానకమైన Train Accident నుంచి రక్షించబడిన సాయి భక్తులు

మన అందరికి, సాయిని నమ్మిన వాళ్ళకు, ముఖ్యంగా తెలిసిన విషయం, ఆయన తన పిల్లలను ఎప్పుడు తల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటారు.

అందరి పిల్లలను, తల్లి ఎలా తన బిడ్డల కోసం పాటు పడుతుందో, ఆలా పాటు పడతారు. అలాంటి సాయినాథునికి కోటి, కోటి ప్రణామములు.

నా లాంటి మహాపాపిని, బుద్ధిహీనుడిని, తన చల్లని పాదాల చెంత చేరే దానికి ఆజ్ఞ ఇచ్చారు.

నా కుటుంబం అంబాలా లో వుంటుంది. మా ఇంట్లో సాయి కృప వలన ఒక చిన్న సాయిబాబా మందిరం వుంది. అక్కడ బాబా అదృశ్యరూపంలో సదా, సర్వదా వుంటారని కూడ చాలా మందికి అనుభవం అయింది.

నేను పంజాబ్ and సింద్ Bank లో అధికారిగా వున్నాను. అది పదంపూర్ జిల్లా, గంగానగర్,రాజస్థాన్ లో వుంది.

నా పిల్లల కోసం నేను రాజస్థాన్ నుంచి అంబాలకు మధ్య మధ్యలో వెళ్ళవలసి వుంటుంది. ఈ ప్రయాణంలో జరిగిన ఒక ఘటన నేను మీకు చెప్పబోతున్నాను.

అది 24 december 1995 లో జరిగింది. నేను నా స్నేహితుడు, నాతొ పాటె Bank లో పని చేస్తాడు, సర్దార్ స్వరసింగ్ జోధేపూర్ కాలకా నుంచి అంబాలా వెళ్తున్నాం.

Train లో మా భోగి అన్నిటికన్న చివరిది. ఎందుకంటే ఇది గంగానగర్ నుంచి భటిండా వెళ్ళి, అక్కడ నుంచి వేరు అయి జోధేపూర్ కాలకా mail లో కలుస్తుంది(Linked Train).

గంగానగర్ నుంచి Train రాత్రి 9 :30 కి బయలు దేరుతుంది. నా friend ది  lower Berth , నాది middle berth.  నాకు ఎందుకో ఆరోజు అసలు నిద్ర పట్టలేదు .నా మీద బాబా కు అశేష కృప వుంది, అని నేను అనుకుంటాను.

ఎందుకంటే నేను ఎప్పుడు ఖాళీగా వున్నా నా మనసులో సాయి నామ జపం జరుగుతూ వుంటుంది. ఆ రోజు కూడా నిద్ర రాని కారణాన నేను మనసులో "ఓం శ్రీ సాయినాథాయనమః" అని నిరంతరం జపం చేసుకుంటున్నాను.

ఎప్పుడైతే Train భటిండా station నుంచి బయలు దేరి, కొంచెం దూరం వెళ్ళగానే రాత్రి 9 40 కి Train చాలా పెద్దగా కుదిమేసినట్లు అనిపించింది, చూస్తే మా భోగి దాని పట్టాలు తప్పి road మీద పరుగులు పెడుతూవుంది. పైన వున్న జనాలు, సామాన్లు అన్ని క్రింద పడిపోతున్నాయి.

అలాంటప్పుడు ఎలా వుంటుందో మీరే ఊహించండి!. మనం అందరం జీవితంలో ఒక్కసారన్నా Train ప్రయాణం చేసివుంటాం.

మీరు నన్ను నమ్మండి, నాకు అస్సలు గాబరా వేయలేదు. ఎందుకంటే బాబా నా తోనే వున్నారని, సాయినాథుని అనంతమైన కృప నా మీద వుండగా, దోమ, చీమ కూడా నన్ను కుట్టలేవు. ఎలా నాకు దుర్ఘటన  జరుగుతుంది.(సాయి బంధువులారా చెప్పండి అలాంటి సమయంలో మనలో ఎంతమందికి బాబా గుర్తువస్తారు!).

ఇంతలో ఎవరో train లో వున్న chain ను లాగారు. చాలా దూరం అలా road మీద వెళ్ళాక train ఆగిపోయింది.

ఇంకా మా భోగి అయితే చక్రాలు పైన,  పైన భాగం క్రింద వున్నాయి. అలా train చాలా చిత్రమైన పరిస్థితిలో వుండినది. train చక్రాలు విరిగి ముక్కలైనాయి. Fans అన్ని వూడి జనాల మీద పడినాయి.

మా భోగి ముక్కలు ముక్కలు అయింది.మాతో పాటు వున్న next భోగి కూడా అలాగే అయింది.

ఆ సాయినాథుని అశేష కృప వలన నాకు ఏమి కాలేదు. నాకే కాదు నా చుట్టుపక్కల వున్న వాళ్ళకు ఎవ్వరికి ఏమి కాలేదు.

అందరిలో ఒకటే ఆనందం, ఆ సాయినాథుని కృప వలన మనం సురక్షితంగా వున్నామని. ఎందుకంటే నాకు నిద్రరాని కారణంగా అందరం బాబా గురించి చర్చించుకుంటూ వుంటిమి.

ఈ విధంగా స్మరణ మాత్రం చేత, అతి భయంకరమైన accident నుంచి బాబా మమల్ని సురక్షితంగా ఒడ్డున పడేశారు.

అందుకే అంటాను మీరు కూడా అనండి " ఓ సాయి నువ్వే తల్లి, నువ్వే తండ్రి , నువ్వే త్రాహి, త్రాహి, నువ్వే అన్ని కష్టాలను ఇస్తావు, నువ్వే కష్టాల నుంచి ఒడ్డుకు చేరుస్తావు. నువ్వే విశ్వానికంతా విధాత.

సర్వం సాయినాథార్పణమస్తు

అశోక్ చావ్లా ,
అంబాల, హర్యానా 

 

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:

15 thoughts on “బాబా స్మరణ మాత్రం చేతనే భయానకమైన Train Accident నుంచి రక్షించబడిన సాయి భక్తులు

  1. సాయి బాబా సాయి బాబా సాయి బాబా...అని నామం చేసిన...బాబా వారికీ సంబంధించి ఈ లీలలు అయినా మననము చేసిన ...అక్కడ చెడు జరగటానికి అవకాశమే లేదు....ఈ లీల ఎంతో బాగుంది మామ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *