సాయి అంకిత భక్తులైన తండ్రి కొడుకులకు బాబా వారు చేసిన సాయం

 

నేను నా కుటుంబం లోని వారందరు సాయిబాబాకు పరమ భక్తులం, మాకు కలిగే అన్ని కష్టాలు బాబా మీద మా కున్న భక్తి, శ్రద్దల వలన  వాటిఅంతటా అవె నివారణ అవుతాయి.

మేము వార్దా పట్టణ వాసులం. మా ఇంట్లో అమ్మ , నాన్న, మా చెల్లి , తమ్ముడు (కవలపిల్లలు) వుంటాము.

మేము చిన్నప్పటి నుంచి మంచి మంచి బాబా  అనుభూతులు చవి చూశాము.

ఆయన లీలలు వర్ణన టీతాలు. నేను 10 th, 1st class లో pass అయ్యాను. తరువాత Polytechnic మూడు సంవత్సరాలు చదివి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుణ్ణి అయ్యాను.

తరువాత degree చేద్దామని రెండో సంవత్సరం(Lateral entry ) ఒక college లో చేరాను. కాని admission late అయినందువలన ఆ semester preparation సరిగా అవ్వలేక పోయాను.

ఆ semester లో Maths లో 4 chapters అయిపోయినాక నాకు admission అయింది. అందువలన నేను వెనక పడిపోయాను. అందు వలన అందరూ అనే వారు నీవు fail అవుతావు అని.

నాకు మంచి tuition కూడా దొరకనందు వలన చాలా భయం వుండేది. నేను 3rd semester exam రాశాను. maths లో fail కూడా అయ్యాను.

మళ్ళీ backlogs రాసేదానికి apply చేసుకున్నాను. మా college వాళ్ళు నా అసమర్థత గ్రహించి నాకు exam రాసేదానికి ఒప్పుకున్నారు.

బాబాను సదా స్మరిస్తూ బాబా! నిజంగా నీ ఆశీర్వాదం వుంటే నన్ను pass అయ్యేట్లు చేయి స్వామి, అని మనసులో ఎప్పుడు అనుకునే వాడిని.

బాబా కృప అపారమైనది. ఏమి ఆశ్చర్యం నేను 10 కి 9 మార్కులతో పాస్ అయ్యాను. ఆ సాయినాథుడు నాకు సంవత్సరం వృధా కాకుండా చేశారు.

ఇక రెండోది మా నాన్న గారికి కలిగింది. వినండి 2009 సంవత్సరం మా నాన్న గారికి వీపు మీద నరాల సమస్య వలన ఆయనకు పాపం, toilet వచ్చేది కాదు. doctor దగ్గరికి వెళ్తే NRI చేయమన్నారు , చేశాము. ఎదో సమస్య వుంది  ఒక చిన్న operation చేయాలి అన్నారు.

మా అమ్మకు చాలా భయం వేసింది. బాబా విభూతి పెట్టి వీపున కూడా కొంచెం పూసింది, నీళ్ళలో కూడా కొంచెం కలిపి తాగించింది.

మా నాన్న operation Theater లోకి వెళ్ళాడు. ఇంతలో నాన్న గారి ఫోన్ మోగింది.  చిత్రముగా నాన్న గారి phone లో బాబా photo కనపడింది.

నాన్న పెట్టుకోలేదు Photo. photo ఎలా వచ్చిందో ఇప్పటికి మాకు ఆశ్చర్యమే. అది మంచి శకునం అనుకుంది అమ్మ.

నిజంగానే నాన్న గారు operation Theater నుంచి వెనక్కి వచ్చారు. ఏమి అని అడిగితె, operation ఆఖరలేదు, మందులతో తగ్గుతుంది అన్నారు. మందులు వేసుకున్నాక అయన బాగున్నారు.

ఇది సాయినాథుని కృప కాకుంటే మరి ఏమిటి? మాకు వచ్చే అన్ని చిన్న - పెద్ద కష్టాలను ఆయనే తీరుస్తాడు.మాకు జరిగిన అన్ని అనుభూతులు రాయాలంటే అదో పుస్తకం అవుతుంది.

సర్వం సాయినాధార్పణమస్తు

బుతుజా కృష్ణారావ్ దేవడే,
వర్దా , మహారాష్ట్ర.

 

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:

15 thoughts on “సాయి అంకిత భక్తులైన తండ్రి కొడుకులకు బాబా వారు చేసిన సాయం

  1. నేనుండగా నా భక్తులకి ఎప్పుడు పెద్ద ఆపదలు రావు...సాయి బాబా...సాయి బాబా

  2. Sai Baba...Sai Baba.chaalaa adbhuthamaina Baba vaari leelalu,Thank u Madhavi mam and Sreenivas murthy gaaru.Sai Baba...Sai Baba.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *