ఉధితో ఐదింతలైన ఆహారం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఉధితో ఐదింతలైన ఆహారం

భక్తురాలు: సునంద ఏ

నివాసం:  చెన్నై

  1. Miracle_Sunanda_by Lakshmi Prasanna 3:05

Audio Prepared by Lakshmi  Prasanna

ఈ బాబా లీల 1990 సంవత్సరం నాటిది.

నేను సచ్చరిత్ర పారాయణం చేసి, ఏడవ రోజు (పూర్తైన రోజు), కొంత మంది బీద వాళ్ళకి భోజనం పెట్టించాలని సంకల్పం చెప్పుకున్నాను.

ఆ సమయంలో నా ఇంటి ఎదురుగా ఒక ఫ్లాట్ నిర్మాణం జరుగుతుంది.

నేను భోజనం కోసం అక్కడ పనిచేస్తున్న కొంత మంది పని వారిని పిలవడానికి నిర్ణయించుకున్నాను.

నా అంచనా ప్రకారం నలుగురు, ఐదుగురిని భోజనానికి ఆహ్యానించాలని అనుకున్నాను.

నేను వెళ్లి అక్కడి సూపర్వైజరుని కలుసుకుని, భోజనం సమయంలో నా ఇంటికి 4 నుంచి 5  వ్యక్తులని భోజనం కోసం పంపాలని విజ్ఞప్తి చేశాను.

అతను సరే అన్నాడు. భోజనం సమయంలో బయట గేట్ తీసినట్టు చప్పుడు వినిపించింది.

నేను వారు వచ్చారని భోజనానికి అరటి ఆకులు, నీరు, ఇతర వస్తువులు అన్ని సిద్ధం చేసుకుని వారిని ఆహ్వానించడానికి తలుపు తెరిచాను.

ఎదురుగా ఏడుగురు ఉన్నారు. నేను ఆలోచించాను. నేను వండిన ఆహారం ఏడుగురికి సరిపోతుంది అని నాకు నమ్మకం లేదు.

బాబాని మీరే ఎలాగైనా వీరికి ఆహారం సరిపోయేంత చేసి వీరు సంతృప్తిగా భోజనం చేసేలా చేయాలనీ  బాబాని ప్రార్ధించాను.

వారు భోజనం చేస్తూ మేము వెళ్లిన తరువాత ఇంకొక బ్యాచ్ భోజనం కోసం వస్తారని చెప్పారు.

నేను ఆహారం తయారు చేసుకోవడానికి సమయం లేదు. నేను ముందుగా బియ్యం తయారు చేశాను.  లేదంటే నేను కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది అనుకున్నాను.

రెండవ బ్యాచ్ లో 11  మంది ఉన్నారు. వారు చివరి బ్యాచ్ ఉంది అని చెప్పారు. అది వినగానే నాకు నోట మాటరాక భయపడి పోయాను.

సచ్చరిత్రలో వ్యాఖ్యాత, దేవ్ ఇంట్లో వేడుక జరిగినప్పుడు వచ్చిన వారందరికీ ఆహారం సరిపోదేమో అని భయపడుతుంటే దేవ్ తల్లి ఆ వండిన వంట పాత్రలలో బాబాని తలుచుకొని ఊదీని వేసి ఆ పాత్రలపై మూత పెట్టి, పాత్ర చివరి నుండి తీస్తూ వడ్డించమని చెపుతుంది.

బాబా దయ వల్ల ఆహారం అందరికి సరిపోయింది అని  చెపుతారు.

ఈ రోజు నా ఇంట్లో కూడా అలాంటి అద్భుతం జరగాలని నేను బాబాని వేడుకున్నాను.

బాబా ఆ పని చేసారు.

నేను తయారు చేసిన ఆహారం చివరి బ్యాచ్ లో ఉన్న అయిదుగురురికి కూడా సంతృప్తిగా సరిపోయింది. నేను ఈ అద్భుత బాబా లీలకి చాలా కృతజ్ఞత తెలిపాను.

నేను మొదట ఐదుగురికి భోజనం పెట్టాలని భావించగా ఇరవైమూడు మంది వచ్చి భోజనం చేయగలిగారు.

రోజు రోజుకి (నా దగ్గరకు వచ్చి) నాకు తనపై నమ్మకం బలోపేతం చేస్తున్నందుకు బాబాకు నేను ఎప్పుడు ఋణపడి ఉంటాను.

*** సాయి సూక్తి:

ఊది  సర్వ వ్యాధి  నివారిణి”.

భక్తురాలు: సునంద ఏ

నివాసం:  చెన్నై

Miracle Collected by : Madhavi TV

Miracle Translated and typed by : Prathibha

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “ఉధితో ఐదింతలైన ఆహారం–Audio

murali

బాలాజీ పాటిల్ నెవాస్కర్ mother కదా ఊదీ వేయమని చెపింది దేవ్ గారి Mother అని వా౯శారు చూడండి

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles