ఆరతి

ఆరతి అనగా భక్తి వ్యక్తీకరణ దీపాలు వెలిగించడం. ఆ వెలుగును మూర్తిపై ప్రసరింపచేయడం ఆచారము. వెలుగు పరిపూర్ణతకు చిహ్నం. వెలుగులేనిదే మన నేత్రాలకు ఏమి కనిపించదు. అందుచే ప్రతికార్యమునకు ముందుగా జ్యోతిని ప్రజ్వలనం చేస్తారు అది శుభసూచకం. ఆరతిని కళ్లకు అద్దుకొనుటయే కాకుండా దేవుని తదేక దృష్టితో వీక్షించడం పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. మరియు కర్పూర ఆరతి వెలుగులో దివ్యమంగళ మూర్తి యొక్క బ్రహ్మవర్చస్సును సంతృప్తిగా తిలకిస్తూ, పరమేశ్వరా నాలోని రాగ,ద్వేష, అహంకారములను, కర్పూరములా సమ్మూలంగా దహించివెయ్యి. దహింబడి ఆవిరియై అనంత విశ్వములో కలిసినట్లు నన్ను నీలోచేర్చుకో అని కోరడమే. ఇదే ఆరతి పరమార్ధం.

సాయిబాబాపై మొదటగా వ్రాసిన ఆరతిపాట "ఆరతి సాయిబాబా"

సాయిని ఆరాధించే విధానములో హారతులకు ప్రత్యేకస్థానమున్నదని అందరికి తెలిసిన విషయమే. యిప్పుడు జరిగే హారతులలో మధ్యాహ్నము, సాయం సంధ్యహారతులలో అందరు పాడేపాట "ఆరతి సాయిబాబా - సౌఖ్యదతారజీవ "అనే గేయాన్ని రచించాడు మాధవ అడ్కర్. యితను 1904లో ఈగేయాన్ని వ్రాసి సాయిబాబాకిచ్చారు. సాయిబాబా ఊదితో పాటు ఈ పాటను రాంగిర్వావు ద్వారా జామ్నెరులోని నానాసాహేబ్ చాందోర్కరుకు పంపారు. నానాకుమార్తెయైన మైనతాయికి ఊది తీర్ధమిచ్చి, ఈ ఆరతి పాటను పాడగానే ఆమే సుఖప్రసవమైనది. ఈ ఆరతి పాటకూడ బాబా అనుగ్రహము పొంది యుండుటచే ఆమె ప్రసవమునకు ఊదితో పాటు ఈ పాట శక్తి కూడ చేరియున్నది. అప్పటి నుండి ఈ పాటను పాడుతూ ఉండతం జరిగేది. తరువాత ఆరతులు ప్రారంభమైనప్పటినుండి దీనిని ఆరతులలో చేర్చినారు.అప్పటి నుండి ఇప్పుడు కూడ ఈపాట పాడుకుంటే కష్టాలు తొలుగునని భక్తులు విశ్వసించుచున్నారు.

బాబా ఆశీస్సులతో 9 ఆరతి పాటలు వ్రాయుట

జోగేశ్వర భీష్మ నాగపూర్ జిల్లా బోరిగ్రామ నివాసి.ఒకసరి ఇతను సాయిబాబా వద్ద కుర్చొని యుండగా బాబా "ఐదు లడ్డులు ఇవ్వు" అని అడిగారు. ఇతనికి దాని అర్దం గోచరించలేదు. సాయి చిలుము గొట్టము యిస్తే యితను పీల్చాడు. అలా పీల్చడం వలన యితనిలో ఆలోచనా శక్తి పెరిగింది. మరుసటి ఉదయం ఇతనిలో కవితావేశం కలిగింది. బాబాపై ఐదు పాటలు వ్రాశాడు. తరువాత ఒక్క చరణంకూడ వ్రాయలేకపోయాడు. భీష్మ మసీదుకు వచ్చి తాను వ్రాసిన ఆ ఐదు పాటలు బాబా ముందుంచాడు. బాబా మరలా ఆ పాటలను భీష్మచేతికే యిచ్చి పాడించారు. తరువాత బాబా అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించగానే అతనికి స్పూర్తి కలిగి పాటలు ధారగా వ్రాసి బాబాకు వినిపించాడు. అలా ఇతను 9 పాటలు వ్రాశాడు.

ఆరతులు ప్రారంభం 10-12-1910 చావడిలో

ఈ హారతులు ఎప్పటి నుండి ప్రారంభించనిది. ఏ విధముగా యిచ్చేది సరైన తేదీ, సమాచారము తెలియడంలేదు.సాయి సచ్చరిత్రననుసరించి 10-12-1909 నుండి రోజు విడిచి రోజు బాబా చావడిలో నిద్రించుట మొదలు పెట్టినట్లు తెలియుచున్నది. అలానే 10-12-1910లో చావడిలో హారతులు ప్రారంభమైనవని తెలుపబడినది. ఒకప్పుడు వర్షములు కురిసి నీళ్ళు వచ్చినప్పుడు మసీదుపాడై వాసయొగ్యముగా లేనందున బాబాను అక్కడకు దగ్గరలోనే యున్న చావడికి వెళ్ళి ఆరాత్రి అక్కడ వుండమని భక్తులు బాబాను కోరినారు.బాబా అంగీకరించపోయేసరికి నారాయణ తేలి అనే భక్తుడు బాబాను ఎత్తుకుని చావడికి తీసుకొని వెళ్ళాడు. బాబా ఆరాత్రి అక్కడ నిద్రించి మరురోజు ఉదయం మసీదుకు తిరిగి వచ్చాడు. అప్పటి నుండి బాబా రోజు మార్చిరోజు చావడిలో నిద్రించడం ప్రారంభమైనట్లు చెప్పబడుచున్నది.

బాబా సముఖములో ఆరతులు యిచ్చినవారు

1.తాత్యా సాహెబ్ నూల్కర్ :నూల్కర్ 1909లో శిరిడి వచ్చాడు.1911లో మరణించాడు. అగ్బాబా సముఖములో మొట్టమొదటగా ఆరతి యిచ్చినది నూల్కరే.యితనికి ముందు ఎవరు బాబాకి ఆరతియివ్వలేదు.

2.మేఘశ్యాముడు:నూల్కర్ మరణానంతరము యితను బాబా సముఖములో ఆరతి యిచ్చాడు. ఇతను 19-3-1911 నుండి అతను దేహత్యాగము చేసిన 1912 జనవరి 19కి మూడు రోజుల ముందు వరకు యిచ్చాడు.ఇతను ఆరతి యిచ్చే సమయమున ఒంటికాలుపై నుంచుని, తలకదలించక ఇచ్చేవాడు.

17-1-1912న కాకడ ఆరతి బాపుసహెబ్ జోగ్ యిచ్చాడు.

18-1-191న మధ్యహ్నా ఆరతి - సీతారమ్‌యిచ్చాడు

అదే రోజు శేజారతి - సీతారమ్‌యిచ్చాడు

19-1-1912న కాకడ ఆరతి బాపుసహెబ్ జోగ్ యిచ్చాడు.

19-1-1912న తెల్లవారుఝామున గం 4.00లకు మేఘుడు చనిపోయాడు. మేఘుడు మరణించుటకు మూడు రోజులముందు మేఘుడు ఆరతి యిస్తుంటే ఇదే మేఘుని చివరి ఆరతి అని బాబా చెప్పారు.

3.19-1-1912 నుండి సఖారాంహరి ఉరఫ్ బాపుసహెబ్ జోగు ఆరతి యిచ్చుట ప్రారంభించినాడు.

ఆరతులు ఎవరువ్రాసిరి - ఏఏ ఆరతులు వ్రాసిరి

షిరిడి హారతి పాటలు మొత్తం 30 యున్నవి. ఇందులో సాయిబాబా గురించి వ్రాయబడిన పాటలు 16. మిగిలన 14 పాటలు మహారాష్ట్రలో ఆచారంగా పాడినపాటలు.

యిందులో బాబాను గురించి వ్రాయబడిన 16 పాటలను ఈ క్రింది వారు వ్రాసినారు.

1.శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ వ్రాసినది 10 పాటలు

కాకడ అరతి || ఉఠా ఉఠా శ్రీసాయినాధ గురు చరణ కమలదావా.

V ఘెఉని పంచారతీ కరూ బాబాంచి ఆరతి

VI కాకడా ఆరతీ కరీతో సాయినాధ దేవా.

IX ప్రభాతసమయీ నభా శుభరవి ప్రభా ఫాకలీ.

XIII శ్రీసద్గురుబాబాసాయి

మధ్యాహ్నా ఆరతి. III జయదేవ జయదేవ దత్త అవధూత

శేజహారతి - IV జై జై సాయినాధ ఆతపహూడావేమందిదీ హూ

V అతాస్వామీ సుఖేనిద్రా కరా అవధూతా - బాబా కరా సాయినాధా.

VIII సాయినాధ్‌మహరాజ్ అతనా కృపాకరోగురు రాజా

  1. దాసగణుమహారాజు వ్రాసినవి 3 పాటలు

కాకడ ఆరతి - X సాయి రహమ్ నజర్ కరనా

XI రహమ్ నజర్ కరో అబ్‌మోరే సాయీ

మధ్యాహ్నా ఆరతి IV శిరిడి మాఘే పండరపుర - సాయిబాబా రమావర

  1. ఉపాసనిమహరాజ్ వ్రాసినది ఒకటి

మధ్యాహ్నా ఆరతి IX సదాసత్స్వరూపం

ఇది 1911లో వ్రాయబడి ఆరతులో చేర్చబడినది.

  1. మాధవ్ అడ్కర్ (మాధవ రావు వామనరావు అడ్కర్) ఒక పాట

మధ్యాహ్నా ఆరతి II ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార జీవా.

5.మోహన్ రాజు వ్రాసినది ఒక పాట

మధ్యాహ్నా ఆరతి VIII అనంతా తులాతేకసేరేస్తవావే.

  1. బి.వి.దేవ్ వ్రాసినది ఒక పాట

సాయం సంధ్యాహారతి:- రుసోమమప్రియాంబికా, మజవరీపితాహీరుసో.

పై మొత్తం పాటలు పదహారు

హారతులోని యితరులు వ్రాసిన యితర పాటలు - 14

1.తుకారాం వ్రాసినవి V పాటలు

కాకడ ఆరతి :- I జోడూనియా కర చరణి - ఠేవిలామాధా

VII భక్తీచియా పోటీ బోధ్ కాకడ జ్యోతీ

శేజారతి. I ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధ - మాఝా సాయినాధా

VI పాహే ప్రసాదా చీవాట

VII పావలా ప్రసాద ఆతా విఠోని జావే.

2.నామదేవ్ వ్రాసినవి II పాటలు

కాకడ ఆరతి :- IV ఉఠా పాండురంగా ఆతా దర్శనద్యాసకళా

VIII ఉఠా ఉఠా సాధు సంత సదా అపులలేహిత

  1. జానాబాయి వ్రాసినవి II పాటలు

కాకడ ఆరతి :- II ఉఠాపాండురంగా ప్రభాత సమయోపాతలా

XII తుజకయ దేఉ సావళ్యామి ఖాయా తరియో

  1. రామజనార్దన ఒక పాట

శేజారతి: II ఆరతి జ్ఞాన రాజా - మహా కైవల్య తేజా.

  1. రామేశ్వేఅ భట్ వ్రాసినది ఒక పాట

శేజారతి:III ఆరతి తుకారామా స్వామీ సద్గురుధామా

  1. వేదసంబంధమైనవి

మధ్యాహ్నా ఆరతి, సంధ్యా ఆరతి -IX మంత్రపుష్పం.

  1. సంప్రదాయ ఆరతి పాటలు - II మఱియు భజన మొదలగు యితర పాటలు