లక్ష్మీబాయి షింపే ఇల్లు

లక్ష్మీబాయి షింపే ఇల్లు

చావడికి ఎదురుగానున్న చిన్న వీధిలో కొంచం దూరం వెళ్తే సాయి భక్తురాలైన లక్ష్మీబాయి షిండే ఇల్లు వస్తుంది. మహసమాధి సమయములో బాబా దగ్గరున్న అరడజను మంది భాగ్యశాలురలో ఈమె ఒకరు. ఈమె రాత్రింబవళ్ళు బాబా సేవచేసెడిది. రాత్రి సమయములో మహాల్సాపతి,తాత్యా బాబా వద్ద వుండేవారు. స్త్రీలలో లక్ష్మీబాయి షింపే కూడ మసీదులోకి రాత్రులందు వెళ్ళేది.

ఈమె ప్రతిరోజు బాబాకి భోజనము వండి పెట్టేది. బాబా లక్ష్మీబాయికి ప్రతిరోజు రూ 4|-లు ఇచ్చేవారు అంతెకాకుండా బాబా ఆమె నిర్మలమైన భక్తికి ప్రతిఫలంగా, నవవిధ భక్తికి సంకేతంగా మహా సమాధిసమయములో ఈమెకు తొమ్మిది రూపాయి నాణాలు ప్రసాదించారు. 1963 జేష్ట శుద్ధ ఏకాదశి సోమవారము రోజున తన 115వ ఏట దేహమును చాలించి సాయిబాబాలో ఐక్యమైనది. ఆమె సమాధి అమె ఇంటి ముందే యున్నది. షిరిడి దర్శించు భక్తులు యిప్పుడు కూడ లక్ష్మీబాయి ఇంటికి వెళ్ళి బాబా ఆమెకు యిచ్చిన ఆ తొమ్మిది రూపాయి నాణేములను దర్శించి, అమె సమాధిని కూడ దర్శించుచుందురు. ద్వారకామాయికి ఎదురుగా యున్న వీధిలో కొలది దూరమున లక్ష్మీబాయి షింపే గృహము యున్నది.