కాకడ ఆరతి

(ఉదయం గం|| 5-15 ని||లకు దీపము,అగరవత్తులు వెలిగించి వెన్న నివేదన చేసి 5 వత్తులతో హారతి ఇవ్వాలి.)

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కీ జై

1.జోడూ నియాకరచరణి ఠేవిలామాధా

పరిసావీ వినంతీ మాఝీ పండరినాధా

అసోనసో భావాఅలో-తూఝియాఠాయా

కృపాదృష్టిపాహే మజకడే- సద్గురూరాయా

అఖండిత అసావేఐసే - వాటతేపాయీ

సాండునీ సంకోచఠావ్ -   ధోడాసాదేయీ

తుకాహ్మణే దేవామాఝీ వేడీవాకుడీ

నామే భవపాశ్ హాతి – ఆపుల్యాతోడీ

తాత్పర్యము:1.చేతులు జోడించి నీ పాపపద్మములపై నా శిరముంచాను.ఓ మహాప్రభూ! నా ఆనతి వినుము.2.నేను భక్తుడను కానేమో!నీ వద్దకు చేరాను.సద్గురు మహరాజా!నీ కరుణా దృష్టితో చూడు.3.నీ మృదు పాదసేవనే కోరినాడను సందియమందక నీ మనసు నాకు శాశ్వత స్థానమును కల్పింపుము.4.తుకారాము కోరిన విధముగ నీ నామస్మరణను గావింపలేని నా లోటును సహించి పాపపాశము నుండి విడిపింపుము.

2.ఉఠా పాండురంగా ఆతా ప్రభాత సమయో పాతలా|

వైష్ణవాంచా మేళా గరుడ- పారీ దాటలా||

గరూడాపారా పాసునీ మహా ద్వారా పర్యంతా|

సురవరాంచీ మాందీ ఉభీ జోడూని హాత్

శుకసనకాదిక నారదతుంబర భక్తాంచ్యకోటీ

త్రిశూలఢమరూ ఘేఉని   ఉభా గిరిజేచాపతీ

కలియుగీచా భక్తానామా ఉభాకీర్తనీ

పాఠిమాగే ఉభీడోలా లావునియాజనీ

తాత్పర్యము:1.పాండురంగా!నిద్దుర లే! తెల్లవారు సమయమయ్యెను.శ్రీ విష్ణు భక్తులు గరుడ ద్వజము వద్ధ నిలిచి యున్నారు.2.దేవతా పెద్దలు గరుడ ద్వజము వద్ద నిలిచి యున్నారు. 2.దేవతా పెద్దలు గరుడ ద్వజము నుండి మహద్వారము వరకు హస్తములు ముకుళించి నీ సందర్శనము కొరకు నిలిచి యున్నారు.సకసనందనాది నారదతుంబుర భక్తబృందం త్రిశూల ఢమరములు ధరించి, గిరిజేశుడు వేచియున్నారు. 4.కలియుగ మహాభక్తుడు శ్రీ నామదేవుడు నిన్ను స్తుతించుచున్నాడు.నీ పాదసేవకు బాజిబాయి నీ సందర్శనాభిలాషతో వేచియేయున్నది.

3.ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా

ఆదివ్యాది భవతాప వారునీ తారా జడజీవా

గేలీతుహ్మా సోడు నియాభవ తమర రజనీవిలయా

పరిహీ అజ్ఞానాసీ తమచీ భులవియోగమాయా

శక్తిన అహ్మయత్కించిత్ హీ తిజలాసారాయా

తుహ్మిచ్ తీతేసారుని దావా ముఖజనతారాయా

భో సాయినాధ్ మహారాజ్ భవ తిమిరనాశకరవీ

అజ్ఞానీ అహ్మీకితి తవ వర్ణావీతధోరవీ

తీవర్ణితాభా గలే బహూవదనిశేష విధికవీ

సకృపహోఉని మహిమాతుమచా తుహ్మీచవదవావా

ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా

ఉఠా ఉఠా శ్రీసాయినాథ గురుచరణకమలదావా

ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా

భక్తమనీసద్బావ ధరునిజే తుహ్మ అనుసరలే

ద్యాయాస్తవతే దర్శనతుమచే ద్వారి ఉబేఠేలే

ద్యానస్థా తుహ్మాస పాహునీ మన అముచేఘాలే

పరితద్వచనామృత ప్రాశాయా ఆతుర తేఝాలే

ఉఘడునీనేత్రకమలా దీనబంధూరమాకాంతా

పాహిబాకృపాదృష్టీ బాలకాజసీ మాతా

రంజవీమధురవాణీ హరితాప్ సాయినాధా

అహ్మీచ్ అపులేకరియాస్తవతుజకష్టవితోదేవా

సహనకరిశిలె ఐకువిద్యావీ భేట్ కృష్ణదావా

ఉఠా ఉఠా శ్రీసాయినాధ్ గురుచరణకమలదావా

ఆదివ్యాధి భవతాపవారుని తారాజడజీవా

తాత్పర్యము : 1.లెమ్ము!లెమ్ము శ్రీ సాయిబాబా సద్గురు నీ పాదపద్మ,సందర్శన మమ్ము మందమతులమగు ఆధివ్యాధి దారిద్ర్య భాధితుల రక్షింపుము. 2.పుట్టువులను గాఢాంధకారాము నిన్ను చేరదు.జ్ఞానహీనులమగు మేము మాయలో పడియున్నాము. 3.దానిని మేము అనుభవింపలేము పరమ పావనమగు నీ ముఖసందర్శన భాగ్యము గలిగించి మమ్మెల్ల రక్షింపుము.కోటిసూర్య తేజోమూర్తివగు నీవు అజ్ఞానాంధకారాన్ని తొలగించి నీ పాదభక్తి మాకు ప్రసాదించుము. 5.వేయి ముఖములు గలిగిన ఆదిశేషుడే నిన్ను వర్ణించలేడు.నీ మహామహిమ మేమెట్లు నుతించగలము? 6.నీ మహా భక్తబృందము నీ దర్శనము కొరకు ద్వారము వద్ద వేచియున్నారు. 7.ద్యానయోగములో నున్న మిమ్ము గని మా హృదయములు ఆనందమందుచున్నవి.తమ వాక్యామృతమును గ్రోల ఆత్రత పడుచున్నది. 8.దీనబంధూ! రమానాధా! నీ నేత్ర పద్మములు తెరచి మాతృప్రేమతో మమ్ముగనుము. 9.మధురవాణితో సంతాన తాపము పొగొట్టుము.నిన్ను మేము కష్టపరుచుచున్నాము.10.సహనభావమున ఈ క్రిష్ణుని దీనాలాపములు విని నీ దర్శనభాగ్య మొనరింపుము.

4.ఉఠా పాండురంగా ఆతా - దర్శనద్యాసకళా

ఝాలా అరుణోదయాసరలీ – నిద్రేచెవేళా

సంతసాధూమునీ అవఘే ఝాలేతీగోళా

సోడాశేజే సుఖ్ ఆతా బహుజాముఖకమలా

రంగమండపే మహాద్వారీ ఝలీసేధాటీ

మనౌఉ తావీళరూప పహావయాదృష్టీ

రాయీరఘుమాబాయి తుహ్మాయేఊద్యాదయా

శేజే హాలవునీ జాగే కరాదేవరాయా

గరూడ హనుమంత ఊభే పాహతీవాట్

స్వర్గీచే సురవరఘే ఊని ఆలేభోభాట్

ఝాలే ముక్త ద్వారా లాభ్ ఝాలారోకడా

విష్ణుదాస్ నాం ఊభా ఘే ఊనికాకడా

తాత్పర్యము : ఓ పాండురంగా!నీ నిద్దుర విడిచి,నీ దివ్యమంగళ విగ్రహదర్శన మొసంగుము.సూర్యోదయమైనది. 2.సాధు సంతుమునులు నీ కొరకు వేచియున్నారు.నీ సుఖనిద్ర వీడి తమ దివ్యసందర్శనమిమ్ము. 3.ద్వారరంగమడపమున ఉన్న మా హృదయాలు తమ దర్శనమునకు పరితపించుచున్నది.4.ఓ రాణి రఖుమాబాయి దయతో నీవైన రంగని మేల్కొలుపు. నిద్రవిడిచి లేవయ్యా! శ్రీదేవా! గరుడడు, హనుమ నీ దర్శనానికి చూచుచుండె. 5.సురలోకములోని సురలు హారతి తెచ్చినారు.విష్ణుదాసు నామాకాడగ హారతి పెట్టి నిలిచిరి.

5.ఘేఉనియా పంచారతీ కరూబాబాసీ ఆరతీ

ఉఠాఉఠాహో బాంధవ ఓవాళూ హరమాధవ

కరూనియా స్థిరామన పాహుగంభీరాహేధ్యాన

కృష్ణనాధా దత్తసాయీ జడోచిత్త తుఝేపాయీ

కాకడ ఆరతీ కరీతో! సాయినాధ దేవా

చిన్మయరూప దాఖవీ ఘే ఉని! బాలకలఘు దేవా ||కా||

తాత్పర్యము : 1.సాయిబాబా! నీ పంచారతి సమర్పింతును. 2.బంధువులారా!వేగము లేచిరండి! సాయీఈ లక్ష్మీ సతికి హారతినిద్దాం. 3.తిరమగు హృదయమున ధ్యానింతము. 4.సాయికృష్ణా! సాయిదత్తేశా! నీ పాదపద్మములు మా మనస్సులలో ఎల్లవేళలా నిలుచుగాక.

6.కామక్రోధమదమత్సర ఆటుని కాకడాకేలా

వైరాగ్యాచే తూవ్ కాఢునీ మీతో బిజవీలా

సాయినాధగురు భక్తి జ్వలినే తోమీపేటవిలా

తద్వృత్తీ జాళునీ గురునే ప్రకాశపాడిలా

ద్వైతతమానాసునీమిళవీ తత్స్యరూపి జీవా

చిన్మయరూపదాఖవీ ఘేఉనిబాలకలఘు సేవా

కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా

చిన్మయారూపదాఖవీ ఘే ఉని బాలకలఘుసేవా

భూ ఖేచర వ్యాపూనీ అవఘే హృత్కమలీరాహసీ

తోచీ దత్తదేవ శిరిడీ రాహుని పావసీ

రాహునియేధే అన్యస్ద్రహి తూ భక్తాస్తవధావసీ

నిరసుని యా సంకటాదాసా అనుభవ దావీసీ

నకలేత్వల్లీ లాహీకోణ్యా దేవావా మానవా

చిన్మయరూదాఖవీ ఘే ఉని బాలకలఘుసేవా

కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా

త్వదృశ్యదుందుభినేసారే అంబర్ హే కోందలే

సగుణమూర్తీ పాహణ్యా ఆతుర జనశిరిడీఆలే

ప్రాశుని తద్వచనామృత అముచేదేహబాన్ హరఫలే

సోడునియాదురభిమాన మానస త్వచ్చరణి వాహిలే

కృపాకరునీ సాయిమావులే దానపదరిఘ్యావా

చిన్మయరూదాఖవీ ఘే ఉని బాలకలఘుసేవా

కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా

చిన్మయరూదాఖవీ ఘే ఉని బాలకలఘుసేవా

తాత్పర్యము : శ్రీ సాయినాధా! కాగడా ఆరతి పట్టేమా. 2.పిల్లవాని సేవని పొంది చిన్నయరూపా దర్శనమిమ్మా! 3.కామక్రోధాదులు గల మనస్సు తమ హరతికి వత్తిగ చేసి, విరిగనేతితో తడిపి శ్రీ ఆసయీశ్వరుభక్తి జ్యోతిని వెలిగించి ఆ రూపములో వెలుగే గురువై యెప్పెను. 4.ద్వైతభావ చీకటి నశించి జీవుడు దేవుడయ్యెను. 5.భూమిని, గగనాన హృదయపద్మముల నీవూ నిలిచినావు.నీవే దత్తత్రేయుడవు.శిరిడిలో వుండి అందరిని అలరించుచున్నారు. 6. నీ విచ్చటనే వశింప అనేక దేశముల నుండి భక్తజనులు పరుగు పరుగును వచ్చుచుండెను.నీ పాదభక్తుల సమస్త బాధలు తొలగించి అనుభవమున నీవు నీరుపించుచున్నావు. నీవంటి మనిషి దేవతా రూపున వేరొకరు లేనేలేరు. 7.నీ దివ్యస్వరూపము దర్శించుటకు ఎంతో దూరము నుండి భక్తులు శిరిడి వచ్చారు.నీ అమృత వాక్కులు విని, వారి దేహములనే మరచిరి. 9.అభిమానాలు విడిచి,నీ పాదపద్మమ్ములనే ధ్యానిస్తున్నారు. 10.దాసుల, భక్త్తుల, మమ్ముననుగ్రహించి జేకొమ్ము.

భక్తీచియా పోటీబోధ్ కాకడ జ్యోతీ

పంచప్రాణజీవే భావే ఓవాళూ ఆరతీ

ఓవాళూ ఆరతిమాఝ్యా పందరీనాధా మాఝ్యాసాయినాధా

ధోనీ కరజోడునిచరణీ ఠేవిలామాధా

కాయమహిమా వర్ణూ ఆతా సాంగణేకీతీ

కోటిబ్రహ్మ హత్యముఖ పాహతా జాతీ

రాయీరఖుమాబాయీ ఉభ్యా దోఘీదోబాహీ

మయూరపించ చామరేడాళితి సాయీంచ ఠాయి

తుకాహ్మాణే దేపఘే ఉని ఉన్మనీతశోభా

విఠేవరీ ఉబాదిసే లావణ్యా గాభా

తాత్పర్యము : పండిన నిండిన భక్తితో గల మానసము నీ హరతిని తిలకించుచున్నాము. 2.పంచప్రాణములు గల మా జీవభావనయే ఆరతిగా నీకు అర్పించుచున్నాము. 3.శ్రీ పండరినాధా! నీకు అరతీ!శ్రీ సాయీశ్వరా! నీకు హారతి, 4.నా హస్తములు ముకుళించి నా శిరము నీ పాదపద్మముల వద్ద వుంచుచున్నాను. 5. నీ దివ్య మహమహిమను నేనేమని వర్ణింపగలను? 6.నీ మహాతేజోముఖ సందర్శన భాగ్యము వలన శతకోటి బ్రహ్మహత్యా పాపములు నశించును. 7. రాణి రుక్మాబాయీ మయూర ఫించము,వింజామరులతో రెండు వైపులా నిలిచి వీచోపులిచ్చుచునారు.

ఉఠా సాదుసంతసాదా ఆపులాలే హితా

జాఈల్‌జాఈల్ హానరదేహా మగకైచా భగవంత

ఉఠోనియా పహాటేబాబా ఉభా అసేవీటే

చరణయాంచేగోమటీ అమృత దృష్టీ అవలోకా

ఉఠాఉఠాహోవేగేసీచలా జఊరాఉళాసీ

జలతిలపాతకాన్‌చ్యారాశీ కాకడ ఆరతిదేఖిలియా

జాగేకరారుక్మిణివరా దేవ అహేనిజసురాన్‌త

వేగిలంబలోణ్‌కరా - దృష్టి హో ఈల్ తయాసీ

దారీబాజంత్రీ వాజతీ ఢోలు ఢమమే గర్జతీ

హోతసేకాకడారతి మఝ్యా సద్గురు రాయచీ

సింహనాధ శంఖ బేరి ఆనందహోతోమహద్వరీ

కేశవరాజ విఠేవరి నామాచరణ వందితో

తాత్పర్యము : సజ్జన సాధువులారా! లేవండి?హితవుకొనండి. 2.ఈ దేహము అతి తొందరుగ నశించును హేభగవాన్ తరువాత తరుణోపాయము ఎలాగ? 3. ప్రాతః కాలమున లేచి విఠలుని చరణములు పట్టండి. అతని అమృతదృష్టిని గాంచండి.4. లేవండి!లేవండి! తోందరుగ శ్రీ సాయినాధుని దివ్యాలయానికి పోవుదుము. 5.ఆ కాగడా హరతి పట్టిన సర్వపాపాలు పోవును. 6. ఓ రుక్మిణీపతీ నిద్దురవీడు,నీవే సమస్త దేవతలకు దేవుడవు. తొందరుగ దిష్టితీయించుకొమ్ము. లేకున్న నీకు ద్రుష్టి దోషము కలుగును. 8.అదిగో మహాద్వారమున భాజా భజంత్రీలు మ్రొగుచున్నవి. 9.మా గురుదేవుని కదిగో హరతి పట్టుచున్నారు. 10.శంఖములు నీ మహద్వారమము దరి పూరింపబడి మహానందము నిచ్చుచుండెను. 11.కేశవరూప విఠలుని పాదపద్మములకు నాముడు వందన లర్పించుచుండెను.

సాయినాధ గురుమాఝే ఆయీ

మజలా ఠావా ద్యావాపాయీ

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినధ మహరజ్ కీ జై

దత్తరాజ గురుమాఝే ఆయీ

మజలా ఠావా ద్యావాపాయీ

సాయినాథ గురుమాఝే ఆయీ

మజలా ఠావా ద్యావాపాయీ

(2 సార్లు ప్రదక్షిణ చేయవలెను)

తాత్పర్యము:నా మతృదేవివైన శ్రీ సాయిగురూ! తమ పాదముల ధరినాకాశ్రయము కల్పింపుము. నా మాతవగు శ్రీ దత్తాత్రేయా! నాకు నీ పాదకమలముల ధరి ఆశ్రయమిప్పింపుము.

ప్రభాత సమయీనభా శుభ రవీ ప్రభాపాకలీ

స్మరే గురు సదా అశాసమయీత్యాఛళే నాకలీ

హ్మణోనికరజోడునీకరు అతాగురూ ప్రార్ధనా

సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా

తమా నిరసి భానుహగురుహి నాసి అజ్ఞానతా

పరంతుగురు చీకరి నరవిహీకదీ సామ్యతా

పుణ్హతిమిర జన్మఘే గురుకృపేని అజ్ఞాననా

సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా

రవి ప్రగతహో ఉని త్వరితఘాల వీ ఆలసా

తాసాగురుహిసోడవీ సకల దుష్కృతీ లాలసా

హరోనీ అభిమానహీ జడవి తత్పదీభావనా

సమర్ద గురుసాయినాధ పురవీ మనోవాసనా

గురూసి ఉపమాదిసేవిధి హరీ హరాఁచీఉణీ

కుఠోని మగ్ ఏఇతీ కవని యా ఉగీపాహూణి.

తుఝీచ ఉపమాతులాబరవిశోభతే సజ్జనా

సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా

సమాధి ఉతరోనియా గురుచలామశీదీకడే

త్వదీయ వచనోక్తితీ మధుర వారితీసాకడే

అజాతరిపు సద్గురో అఖిల పాతకా భంజనా

సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా

అహాసుసమయాసియా గురు ఉఠోనియా భైసలే

విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే

ఆసాసుహిత కారియా జగతికోణిహి అన్యనా

సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా

అసేబహుతశాహణా పరినజ్యాగురూఁచీకృపా

నతత్వృహిత త్యాకళేకరితసే రికామ్యా గపా

జరీగురుపదాధరనీసుదృడ భక్తినేతోమనా

సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా

గురోవినతి మీకరీ హృదయ మందిరి యాబసా

సమస్త జగ్‌హే గురుస్వరూపచి ఠసో మానసా

గడోసతత సత్కృతీయతిహిదే జగత్పావనా

సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా

తాత్పర్యము : ప్రాతఃకాలమున గగనాన శుభమగు సూర్యతేజము వెలుగుచున్నది.ఈ సమయమున సద్గురు నామస్మరణ మొనరించినవారిని రక్కసుడు బాధింపడు.అందుచేత కరములు మోడ్చి గురువును తలుస్తాను. సమర్దుడా! సాయిశ్వరా! నా హృదయ కోరికలు తీర్చుము. 2. రవి అంధకారమును అణుచునట్ల్లు గురుదేవుడు అజ్ఞాన చీకటిని పారద్రోలును ఐన గురువును రవితో పోల్చరాదు. సూర్యుడు పొగొట్టిన అంధకారము మరల వచ్చును. గురుకటాక్షం వలన పొయిన అజ్ఞానాంధకారము మాత్రము తిరిగిరాదు. 3.ఉదయ భాస్కరుడు చీకటిని పోగొట్టును.అలాగే దుర్మార్గ ప్రవృత్తిని గురుదేవుడు పారద్రోలును. దురభిమానము నశింపజేసి మన మనస్సులను అతని పాదపద్మముల దరినే ఉంచుతాము. 4.గురువుతో హరిహర బ్రహ్మల పొల్చుట తగదు.మరి పొల్చదగినవారు ఎవ్వరు కలరు? శ్రీ సాయినాధా! నీకు నీవేసాటి.గొప్పవారు నిన్ను స్తుతించెదరు . 5. గురుదేవా!నీకు సమాధి నుండి మసీదులో దర్శనమిచ్చి నీ అమృత వాక్కులతో మా సర్వ బాధలూ నివారించు అజాతశాత్రవ!మా పాపములన్నీ పారద్రోలును. 6. అదిగో! సద్గురువు లేచి కూర్చుండెను. ఆహాహా! ఎంత మధురమైన సమయు?వారుతన పాదయుగమును పట్టినవారి సర్వాపదలూ పారద్రోలుదురు.ఇలా చేసినవారీ జగమున నున్నారు. 7. ఎంతగొప్పవాడైనా గురుకృప నందక యుండిన వాని జీవితము వృధా! గురుకృపా పరతంత్రుడు కానివాడు స్వయముగ తానేధి పొందలేడు.నా గుండెలో గుడికట్టితిని.తమరు అందులో నివసించండి.సర్వజగమూ గురువే అను భావము నా బుధ్ధితో నిలపండి.నేనెప్పుడూ పరమపావన సత్కార్యము లొనర్పగల బుధ్ధి నాకివ్వండి.

11.ప్రమేయా అష్టకాశీఫడుని గురువరా ప్రార్ధితీజేప్రభాతి

త్యాఁచేచిత్తసిదేతో అఖిలహరునియా భ్రాంతిమీనిత్యశాంతి

ఐసే హేసాయినధేకధునీ సుచవిలే జేవియాబాలకాశీ

తేవిత్యాకృష్ణపాయీ నముని సవినయే అర్పితో అష్టకాశీ

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినధ మహరజ్ కీ జై

తాత్పర్యము:ఈ బాలకృష్ణుడు యీ అష్టక రచన చేసి భక్తితో వారి పాదపద్మములకు సమర్పించినపుడు దీని నెవరు ప్రాతఃకాలమున భక్తితో కీర్తించి ప్రార్దించెదరో అట్టివారి మనోభ్రాంతులన్నియు తొలగించి నిత్యనిత్య శాంతిని ప్రసాదిస్తానని అభయమిచ్చిరి.

12.సాయిరహమ్ నజర్‌కరనా బచ్చోంకాపాలన్ కరనా

సాయిరహమ్ నజర్‌కరనా బచ్చోంకాపాలన్ కరనా

జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్‌జమానా

జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్‌జమానా

సాయిరహమ్ నజర్‌కరనా బచ్చోంకాపాలన్ కరనా

సాయిరహమ్ నజర్‌కరనా బచ్చోంకాపాలన్ కరనా

మై అంధాహూబందా ఆప్కాముఝుసే ఫ్రభుదిఖలానా

మై అంధాహూబందా ఆప్కాముఝుసే ఫ్రభుదిఖలానా

సాయిరహమ్ నజర్‌కరనా బచ్చోంకాపాలన్ కరనా

సాయిరహమ్ నజర్‌కరనా బచ్చోంకాపాలన్ కరనా

దాసగణూకహే అబ్‌క్యాబోలూ ధక్‌గయీమేరీరసనా

దాసగణూకహే అబ్‌క్యాబోలూ ధక్‌గయీమేరీరసనా

సాయిరహమ్ నజర్‌కరనా బచ్చోంకాపాలన్ కరనా

సాయిరహమ్ నజర్‌కరనా బచ్చోంకాపాలన్ కరనా

తాత్పర్యము:ప్రభూ తమరు మా మీద కరుణ కటాక్షములుంచవలెను.మీ సంతానమగు మమ్ము పరిపాలించాలి. ఓ సర్వాంతర్యామీ! ఈ జగమంత సత్యము తమకు తెలియును.(2 సార్లు) మరేమి మాట్లాడగలను? నావాక్కు మూగపడింది. అనుచుండె నీ దాసుడు(2 సార్లు)

రామ్ నజర్‌కరో, అబ్‌మోరేసాయీ

తుమబీన నహిముఝే మాబాప్‌భాయీ - రామ్ నజర్‌కరో

మై అందాహూ బందా తుహ్మారా - మై అందాహూ బందా తుహ్మారా

మైనాజానూ, మైనాజానూ - మైనాజానూ - అల్ల్ఇలాహి

రామ్‌నజర్ కరో రామ్ నజర్ కరో అబ్‌మేరా సాయీ

తుమబీన నహిముఝే మాబాప్‌భాయీ - రామ్ నజర్‌కరో

రామ్ నజర్‌కరో రామ్ నజర్‌కరో

ఖాలీ జమానా మైనే గమాయా మైనే గమాయా

సాధీఆఖిర్‌కా సాధీఆఖిర్ఆ-సాధీఆఖిర్ కా కియానకోయీ

రామ్‌నజర్ కరో రామ్ నజర్ కరో అబ్‌మేరా సాయీ

తుమబిన నహి ముఝే మాబాప్ భాయీ

రామ్ నజర్‌కరో రామ్ నజర్‌కరో

అప్‌నేమస్‌జిద్‌కా జాడూగనూహై

అప్‌నేమస్‌జిద్‌కా జాడూగనూహై

మాలిక్ హమారే మాలిక్ హమారే

మాలిక్ హమారే- తుమ్ బాబాసాయీ

రామ్‌నజర్ కరో రామ్ నజర్ కరో అబ్‌మేరా సాయీ

తుమబీన నహిముఝే మాబాప్‌భాయీ

రాహమ్‌నజర్ కరో రాహమ్‌నజర్ కరో

తాత్పర్యము:నా ఈ సాయిశ్వరా! వెంటనే నీ కరుణాదృష్టిని నాపై బరపుము. తండ్రి, సొదరులూ, నాకు నీవే(2 సార్లు) నేను అజ్ఞానిని నీదాసుడును.అల్లాహ్=దేవుడు, ఇలాహి=సత్యము, నాకివేమి తెలియవు.నా జీవితమంతయూ వ్యర్ధము చేసుకున్నాను. నీవు తప్ప నాకు తోడు చివరివరకు యెవరూ లేరు.ఈ దాసభక్తుడు మీ మసీదును తుడిచిన చీపురుకట్ట మాత్రమే శ్రీ సాయిగురూ! నీవే నా ప్రభువువు.

14.తుజకాయదేఉ సావళ్య మీభాయాతరియో

తుజకాయదేఉ సావళ్య మీభాయాతరియో

మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ

మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ

ఉచ్చిష్ఠ తులాదేణేహి గోష్ట నాబరి యో

ఉచ్చిష్ఠ తులాదేణేహి గోష్ట నాబరి యో

తూ జగన్నాధ్ తుజచే కశిరేభాకరి

తూ జగన్నాధ్ తుజచే కశిరేభాకరి

నకో అంతమదీయా పాహూ సఖ్యాభగవంతా శ్రీకాంతా

మద్యాహ్నారాత్రి ఉలటోనిగే లిహి ఆతా అణచిత్తా

జహో ఈల్ తుఝారేకాకడా కిరా ఉళతరియో

జహో ఈల్ తుఝారేకాకడా కిరా ఉళతరి

అణతీల్ భక్త నైవేద్యహి నానాపరి - అణతీల్ భక్త నైవేద్యహి నానాపరి

తుజకాయదేఉ మీభాయా తరియో

తుజకాయదేఉ సద్గురు మీభాయా తరీ

మీదుబళి బటిక నామ్యాచి జాణ శ్రీహరీ

తాత్పర్యము:ఓ కృష్ణా! నీకు తినుటకు నేనేమి యీయగలను? శ్రీ నారాయణా! నేను యేశక్తిలేని దాసుడనని తెలుసును నీకు.ఎంగిలి చేసిన ఓగిరము నీకు తగునా?నీవో గజదేకమూర్తివి. నీకీ రొట్టెనేనెలా సమర్పణ చేయుట? హే ఈశ్వర! లక్ష్మినారాయణా! హరతిపట్టే సమయ మాసన్నమైనది. నింక నీ భక్తులు నీకు మదురపదార్దము లెన్నో సమర్పింపగలరు

శ్రీసద్గురు బాబాసాయీ హో - శ్రీసద్గురు బాబాసాయీ

తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ - మీ తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ

మీ పాపిపతితధీమంతా - మీ పాపిపతితధీమంతా

తారణేమలా గురునాధా ఝుడకరీ - తారణేమలా సాయినాధా ఝుడకరీ

తూశాంతిక్షమేచామేరూ - తూశాంతిక్షమేచామేరూ

తుమి భవార్ణ వీచేతారూ గురువరా

తుమి భవార్ణ వీచేతారు గురువరా

గురువరామజసి పామరా అతా ఉద్దరా

త్వరితలవలాహీ త్వరిత లవలాహీ

మీబుడుతో భవభయడోహీ ఉద్దరా

మీబుడుతో భవభయడోహీ ఉద్దరా

శ్రీ సద్గురు బాబాసాయీ హో - శ్రీ సద్గురు బాబాసాయీ

తుజవాచుని ఆశ్రయ నాహీ భూతలీ

తుజవాచుని ఆశ్రయ నాహీ భూతలీ

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కీ

రాజాధిరాజయోగిరాజ పరబ్రహ్మ సాయినాధ్ మహరాజ్

(పుష్పములు చల్లవలెను)

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కీ

తాత్పర్యము:శ్రీ సద్గురు బాబా! నాకీ ధరణిలో వేరెవ్వరూ నీవుగాక లేనేలేరు.నేను పాపాత్ముడను.మూఢుడను. అట్టి నన్ను రక్షించుటకు ఎంతమాత్రము ఆలస్యము చేయకుము. మీరు శాంతి క్షమాగుణ సంపన్నులు, నన్నీ విపత్సముద్రం నుండి దాటింపుము. ఓ గురుదేవా! నా గురుసాయీ! ఏమీ తెలియని నన్ను ఈ క్షణముననే రక్షింపుము. భవమను నూతిలో మునుగు నాకు రక్షణ కల్పింపుము.