దీక్షిత్ వాడ

బొంబాయికి చెందిన ప్రసిద్ద న్యాయవాది. సాయి అంకిత భక్తులలో సత్ శిష్యుడిగా బాబా యితనిని ప్రకటించిరి. బాబా ఇతనిని కాకా దీక్షిత్ అని, కాకాయని పిలిచెడివారు. యితను షిరిడిలో యిల్లు కట్టుకుని అచట ఉండిపోవాలని తలచి తనకు,షిరిడి దర్శించు యితర భక్తులు ఉండుటకు వీలుగా ఒక భవనమును నిర్మించుటకు 10-12-1910న శంకుస్థాపన చేయబడినది. భవనము నిర్మాణమును పూర్తిచేసి 1911లో శ్రీరామనవమి రోజున గృహప్రవేశము చేసినారు.

భక్తులకొరకు షిరిడిలో మొదట సాఠెవాడ నిర్మించబడినది. దీక్షిత్ వాడ రెండవది.యిది గురుస్థానము దగ్గర రోడ్డుకు రెండవ ప్రక్కన ఉండేది. ఈ మధ్య మార్పులలో దీనినికూడ మార్పుచేసినారు. ఈ భవనములో పైన ఒక గదిలో దీక్షిత్ వుంటూ మిగిలనది బాబాను దర్శించు భక్తులకు ఉపయొగించుటకు ఇచ్చాడు.

1912నాటికి న్యాయవాదవృత్తిని పూర్తిగా వదిలి షిరిడిలోనే ఉండిపొయినాడు. "కాకా! నీవు ఆందోళన చెందవద్దు. నీ భాద్యతలన్ని నావే "అని యితనికి బాబా ధైర్యము చెప్పారు. ఇతనిని షిరిడిలో తన గదిలోనే ఉండమని బాబా ఆదేశించాడు. బాబా ఆజ్ఞతోనే క్రిందకి వచ్చేవాడు. బాబా దేహత్యాగము తరువాత ఇతను సాయిసంస్థానమునకు కార్యదర్శిగా సంస్థానమును బాగా నిర్వహించిరి. 1922లో చట్ట ప్రకారము, కోర్టు నుండి అనుమతి పొంది ఒక కమిటీని ఏర్పరిచి కార్యాలమును ప్రారంభించిరి. 'సాయిలీల ' మాసపత్రికకు సంపాదకుడిగా భక్తుల అనుభవములను ప్రచారము చేసియున్నాడు.,

1926 జులై 5వ తేదిన బొంబాయిలో డా||దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడు రామకృష్ణను చూడటానికి దాబోల్కర్‌తో కలిసి విల్లిపార్లే నుండి దీక్షిత్ బయలుదేరాడు. రైలులో సాయిబాబా లీలలను గురించి మాట్లాడుచూ ప్రయాణము చేయుచూ, సాయిబాబాయందు మనస్సును లగ్నము చేసిరి. ఉన్నట్లుండి దీక్షిత్ తన శిరమును హేమడ్‌పంతు భుజముపై వాలి యే బాధయులేక అతడు ప్రాణములను వదలెను. " అంత్య కాలములో నిన్ను విమానములో తీసుకొనిపొయెదనని" బాబా ఏనాడో ఇచ్చిన వాగ్దానమును బాబా ఈ విధముగా అనుగ్రహించిరి.

   దీక్షిత్ వాడాను సంస్థానమునకు ఇచ్చివేసినారు. 1990 వరకు అందులో క్యాంటీన్ ఉండేది. తరువాత అందులో ఒక భాగము చదువుకునే గదిగా ఉంచబడినది. ఈ మద్యకాలములో వాడాను బాబా వస్తువులను ప్రదర్శించే గదిగా "మ్యూజియం హాలు"గా మార్చినారు.