సాఠె వాడ

హరివినాయక సాఠె డిప్యూటి కలెక్టర్. 1900 సం||లో అతని భార్య మరణించింది. ఇంకొక వివాహము చేసుకుంటే తనకు పుత్రసంతానము కులుగుతుందా! అని బాబాని అడిగినాడు. బాబా అనుమతితో వేరొక వివాహము చేసుకున్నాక అతనికి ఇద్దరు కూతురులు మరియు ఒక మగబిడ్డ కలిగినాడు.

బాబా 1908లో ఒక రోజు సాఠెతో "ప్రహరిగోడ కలుపుతూ వసతి గృహము కట్టించుము" అని అతనిని ఆదేశించిరి. ఇతను ఆ వేపచెట్టు దాని ప్రక్క స్థలము కొన్నాడు.ఆ వేపచెట్టు తన గురుస్థానమని చెప్పారు కనుక పాతరాళ్ళతో ఆ చెట్టు చుట్టూ సాఠె అరుగు కట్టించాడు.ఆ ప్రక్కన అరుగు నిర్మాణం ప్రారంభమైనది. వాడ కట్టుబడి జరుగుతుంటే ఆ వేపచెట్టు కొమ్మలు అడ్డువచ్చినవి. అడ్డువచ్చిన కొమ్మలను నరికివేయమన్నారు. ఆ కొమ్మ నరికేందుకు ఎవరూ ముందుకురాలేదు. బాబాయే స్వయముగా ఆ కొమ్మలు నరికారు. భవననిర్మాణం పూర్తి అయింది. ఇంతకు ముందు భక్తులు వుండటానికి వసతిలేదు. ఇదే మొదటగా భక్తుల కొరకు నిర్మించిన భవనము. బాబా చెప్పి నిర్మింపచేసినది. దాదాకేల్కర్, సాఠె భార్య యిందులో ఉండేవారు.బాబాను దర్శించడానికి వచ్చే భక్తులు యిందులో ఉండేవారు.

1924 సం||లో ఆర్.ఎస్.నావల్కర్ ఈ సాఠే వాడాను కొన్నాడు. 1939లో అతని తరమువారు సంస్థానమునకు ఇచ్చినారు. 2 సవంత్సరముల తరువాత సంస్థానము ఇంకొక 4 గదులు కట్టినారు. 1998 వరకు వాడాను సంస్థానము కార్యాలయముగా ఉపయోగించారు. ఈ వాడాను పడగొట్టి ఆలయ ప్రాంగణముగా ఏర్పాటు చేసారు.