సాయి సంస్థాన్ వసతి ఏర్పాట్లు

సాయి ఆశ్రమము

Saiasramసాయి ఆశ్రమము ఫేస్-1లో 9000మంది భక్తులు ఉండుటకు వీలుగా 1536 గదులున్నాయి. ఇందులో 1152 అటాచ్డ్ బాత్రుముతో మామూలు రూములున్నాయి మరియు 384 ఏ.సి రూములున్నాయి. భక్తులకు రెస్టారెంట్ సౌకర్యముతో ఇంకొక బ్లాక్ గలదు. సాయి కీర్తనలు, భజనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రామాలు చేసుకోవడనికి వీలుగా 2000 మంది భక్తులు ఉండేటట్టు ఒక పెద్ద హాలు కలదు. పాదయాత్రికులు, సాయిపల్లకీతో వచ్చేవారు ఉండేటట్టుగా ఈ హాలు నిర్మాణం చేయబడినది.

 

 

ద్వారవతి

Dwaravatiఈ భవనము 2008లో నిర్మించబడినది. ఇక్కడికి వెళ్ళడానికి బస్స్టాండ్ నుంచి 2 నిముషముల సమయము పడుతుంది. 334 రూములు, స్నానగదులు, చిన్న గదులు, 6 నుంచి 10 మంది పట్టేవిధముగా గదులు ఉన్నాయి మరియు 80 ఏ.సి రూములున్నాయి. 24 గంటలు నీరు,కరెంట్ సౌకర్యం కలదు. పార్కింగ్ చేయుటకు విశాలమైన స్థలము కలదు.

 

 

భక్తనివాస్ (కొత్తది)

Bhaktanivasసమాధి మందిరము నుంచి ఒక కిలోమీటరు దూరంలో రహతా వైపుగా నగర్ - మన్మాడ్ రోడ్డు మీద వున్నది. చిన్న రూములు,పెద్ద రూములు వాటికి అటాచ్డ్ బాత్రూములు ,వేడినీటి సదుపాయాలతో కూడిన చౌకగా లభించే చక్కటి వసతిగృహం. ఇందులో 525 గదులున్నాయి. రూములు అవసరం లేనివారికి లాకర్లు, హాలులో పరుపులు లభిస్తాయి. ఇక్కడ నుంచి సమాధి మందిరం దగ్గరున్న సాయి ప్రసాద్ వరకు 24 గంటలు సంస్థాన్ వారి ఉచిత బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ నుంచి మందిరము వరకు ఆటోలు కూడ తిరుగుతాయి.

 

 

సాయి ప్రసాద్:
1 & 2 ఇవి సమాధి మందిరం దగ్గర్లో మెయిన్ రోడ్డు, పింపిల్వాడి రోడ్డు కలిసే జంక్షన్లో వున్నాయి. ఇందులో 168 గదులున్నాయి. ఇక్కడి అఫీసులోనే గదులు కేటాయిస్తారు.
సులభ్ శౌచాలయ్:
సాయి ప్రసాదాలయం ప్రక్కగ "సులభ్ శౌచాలయ్ స్నాన్ గృహ్ సంకుల్" అని మూడంతస్తుల భవనం నిర్మించారు. ఇందులో 200కి పైగా స్నానగదులు, లెట్రిన్లు వున్నాయి. సామానులు భద్రపరుచుకునే క్లాక్ రూములు కూడా వున్నాయి. 24 గంటలు తెరిచే వుంటాయి. రద్దీ సమయములో గదులు దొరకని వారికి, ఒంటరిగా వున్నవారికి ఇవి ఎంతో ఉపయోగం.
భోజన, ఫలహార వసతులు:-
సంస్థాన్ వారు నిర్వహించే సాయి ప్రసాదాలయము ఉదయము 10:00 గం||ల నుండి రాత్రి 10:00 గం||ల వరకు ఉంటుంది. ఇక్కడ నామమాత్రపు ధరకే భోజనము లభిస్తుంది. పెద్దవాళ్ళకి ఒక్కొక్కరికి రూ 10/-, చిన్న పిల్లలకి రూ 5/- తీసుకుంటారు. ఇక్కడి కౌంటర్లో సంస్థాన్ వారు ఉదయం టిఫిన్ ప్యాకెట్లు చౌక ధరలకు విక్రయిస్తారు. మందిరం సమీపంలో పింపిల్వాడీ రోడ్డులోను, బస్సుస్టాండు చుట్టుప్రక్కల చాలా రెస్టారెంట్లున్నాయి. ఇవికాక చాలా లాడ్జీలలో ఆంధ్రామీల్సు దొరికే రెస్టారెంట్లున్నాయి.
లెండిబాగ్ని ఆనుకుని వున్న సంస్థాన్ క్యాంటీన్లోనూ, క్యూకాంప్లెక్స్లోనూ 24 గంటలు టీ, కాఫీ, పాలు అతి తక్కువ ధరలకు దొరుకుతాయి. భక్త నివాస్లోని క్యాంటీన్లో కూడ సరసమైన ధరలకు టిఫిన్, భోజనం లభిస్తుంది.
శిరిడిలో రోజు జరిగే కార్యక్రమాలు

సమయం కార్యక్రమాలు
4:00 A.M గుడి తెరుచుట
4:15 A.M

 

భూపాలీ
4:30 A.M – 5.30 A.M

 

కాకాడ ఆరతి(ఉదయము)
5:00 A.M సమాధి మందిరములో భజన చేయుట
5:05 A.M మంగళ స్నానము
5:35 A.M ఆరతి (శిరిడిమాఝే పండరిపురము)
5:40 A.M సమాధి మందిరము దర్శనము మొదలవుతుంది
11:30 A.M ద్వారకామాయిలో అన్నము మరియు నెయ్యితో ధునిపూజ
12:00 A.M – 12:30 P.M మధ్యాహ్న ఆరతి
4:00 P.M సమాధి మందిరములో సచ్చరిత్ర చదవడము
సూర్యాస్తమయ సమయమున (20 నిముషములు) సంధ్యా ఆరతి
8:30 P.M – 10:30 P.M సమాధి మందిరములో భక్తిపాటలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు
9:00 P.M చావడి మరియు గురుస్థానము మూసివేయుట
9:30 P.M ద్వారకామాయిలో బాబాకు నీటిని సమర్పించి, దోమతెర వేసి,….
9:45 P.M ద్వారకామాయి (పై భాగము) మూసివేయుట
10:30 P.M – 10:50 P.M శేజారతి(రాత్రి) ఆరతి, తరువాత, సమాధి మందిరములో బాబాకీ శాలువాను కప్పి, మెడలో రుద్రాక్షమాల వేసి, దోమతెర వేసి, ఒక గ్లాసు నీటిని అక్కడ ఉంచుతారు.
11:15 P.M ఆరతి తరువాత సమాధి మందిరము మూసివేయుట

 

 

అభిషేక పూజ సమయములు
మొదటి బ్యాచ్ 07:00 a.m – 08:00 a.m
రెండవ బ్యాచ్ 09:00 a.m – 10:00 a.m
మూడవ బ్యాచ్ * 11:00 a.m – 12:00 p.m
* ఎక్కువ భక్తులనుభట్టి నిర్వహించబడును

గమనిక: అభిషేకమునకు కట్టవలసిన పైకము రూ 101/-లు మాత్రమే

 

సత్యనారాయణ పూజ సమయములు
మొదటి బ్యాచ్ 07:00 a.m – 08:00 a.m
రెండవ బ్యాచ్ 09:00 a.m – 10:00 a.m
మూడవ బ్యాచ్ 11:00 a.m – 12:00 p.m
నాల్గవ బ్యాచ్ 01:00 p.m – 02:00 p.m
ఐదవ బ్యాచ్ * 03:00 p.m – 04:00 p.m
* ఎక్కువ భక్తులనుభట్టి నిర్వహించబడును

 

పల్లకి ఉత్సవము ప్రతి గురువారము రాత్రి 9:15 నిముషములకు నిర్వహించబడును.

సమాధి దర్శనము ఈ క్రింది చెప్పిన సమయములలో ఆపివేయబడును.

  • మధ్యాహ్నా ఆరతి తరువాత - 11:00 a.m - 01:00 p.m
  • శేజారతి తరువాత - 10: 00 p.m నుంచి
  • సంధ్యా ఆరతి - 30 నిముషముల ఆరతి ముందు

మరి కొన్ని వివరాలకు క్రింది లింక్ క్లిక్ చేయండి :

https://www.shrisaibabasansthan.org/new_eng%20template_shirdi/shirdi/accomodation.html

సాయి సంస్థాన్ రూమ్ బుకింగ్ కొరకు లింక్ క్లిక్ చేయండి :

Online.sai.org.in