శిరిడి గ్రామము

Shirdiమహరాష్ట్రలో చిన్న మారుమూల గ్రామం శిరిడి. సుమారు నూటముప్పై సం||క్రిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలొ ఒకటి. అక్కడ 80 గడపలకు మించి వుండేవి కావు. దాదాపు యిళ్ళన్నీ మట్టికట్టడాలే. ఒకటి రెందు గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్నివైపులా తుమ్మపొదలు, చిట్టడవి, పొలాలూ వుండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుఱ్ఱపు బండివస్తే ఆ గ్రామములోని పిల్లలు,పెద్దలు చోద్యముగా చూచేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె శిరిడి. ఆ గ్రామంలో జరిగే గొప్పవేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారము చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయములోనో, లేక "తాకియా"లోనో బస చేసేవారు. శిరిడిలో సరైన వీధిగాని,వీధి దీపాలిగాని వుండేవిగావు.

సాయినాధుని వలన శిరిడీ వంటి మరుమూల కుగ్రామం కాశీ,తిరుపతి వంటి మహక్షేత్రమైనది. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాలనుండీ వస్తున్నారు. ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెల్గొందుతున్న శిరిడిలో, రాజభవనం వంటి సమాధి మందిరములో, సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాధుని మూర్తి శోభిస్తూ వుంది. దేశం నలుమూలల నుందీ వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోను, క్రొత్త వస్త్రాలతో ప్రతి క్షణమూ సరికొత్త అలంకరణలతో ఆయన్ వెలిగిపోతున్నారు.

శిరిడిలో రోజు జరిగే కార్యక్రమాలు

సమయం కార్యక్రమాలు
4:00 A.M గుడి తెరుచుట
4:15 A.M

 

భూపాలీ
4:30 A.M – 5.30 A.M

 

కాకాడ ఆరతి(ఉదయము)
5:00 A.M సమాధి మందిరములో భజన చేయుట
5:05 A.M మంగళ స్నానము
5:35 A.M ఆరతి (శిరిడిమాఝే పండరిపురము)
5:40 A.M సమాధి మందిరము దర్శనము మొదలవుతుంది
11:30 A.M ద్వారకామాయిలో అన్నము మరియు నెయ్యితో ధునిపూజ
12:00 A.M – 12:30 P.M మధ్యాహ్న ఆరతి
4:00 P.M సమాధి మందిరములో సచ్చరిత్ర చదవడము
సూర్యాస్తమయ సమయమున (20 నిముషములు) సంధ్యా ఆరతి
8:30 P.M – 10:30 P.M సమాధి మందిరములో భక్తిపాటలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు
9:00 P.M చావడి మరియు గురుస్థానము మూసివేయుట
9:30 P.M ద్వారకామాయిలో బాబాకు నీటిని సమర్పించి, దోమతెర వేసి,….
9:45 P.M ద్వారకామాయి (పై భాగము) మూసివేయుట
10:30 P.M – 10:50 P.M శేజారతి(రాత్రి) ఆరతి, తరువాత, సమాధి మందిరములో బాబాకీ శాలువాను కప్పి, మెడలో రుద్రాక్షమాల వేసి, దోమతెర వేసి, ఒక గ్లాసు నీటిని అక్కడ ఉంచుతారు.
11:15 P.M ఆరతి తరువాత సమాధి మందిరము మూసివేయుట

 

 

అభిషేక పూజ సమయములు
మొదటి బ్యాచ్ 07:00 a.m – 08:00 a.m
రెండవ బ్యాచ్ 09:00 a.m – 10:00 a.m
మూడవ బ్యాచ్ * 11:00 a.m – 12:00 p.m
* ఎక్కువ భక్తులనుభట్టి నిర్వహించబడును

గమనిక: అభిషేకమునకు కట్టవలసిన పైకము రూ 101/-లు మాత్రమే

 

సత్యనారాయణ పూజ సమయములు
మొదటి బ్యాచ్ 07:00 a.m – 08:00 a.m
రెండవ బ్యాచ్ 09:00 a.m – 10:00 a.m
మూడవ బ్యాచ్ 11:00 a.m – 12:00 p.m
నాల్గవ బ్యాచ్ 01:00 p.m – 02:00 p.m
ఐదవ బ్యాచ్ * 03:00 p.m – 04:00 p.m
* ఎక్కువ భక్తులనుభట్టి నిర్వహించబడును

 

పల్లకి ఉత్సవము ప్రతి గురువారము రాత్రి 9:15 నిముషములకు నిర్వహించబడును.

సమాధి దర్శనము ఈ క్రింది చెప్పిన సమయములలో ఆపివేయబడును.

  • మధ్యాహ్నా ఆరతి తరువాత - 11:00 a.m - 01:00 p.m
  • శేజారతి తరువాత - 10: 00 p.m నుంచి
  • సంధ్యా ఆరతి - 30 నిముషముల ఆరతి ముందు