లేండితోటలు

లెండీబాగ్‌లో ఒక బావి వుంది.ఇదే షిరిడి ప్రజలకు నీరు అందించింది.1872 ఆ బావి వున్నచోట ఒక ఏరు ప్రవహించేది. దాని ఒడ్డున బాబా ధ్యానం చేస్తూ కూర్చుండేవాడట. ఆ ఏటిలో అప్పుడప్పుడు వెండి నాణెలను బాబా విసురుతుండేవారు. తరువాత ఆ ఏరు ఎండిపోయి ప్రజలు నీటికి ఇబ్బంది పడుచుండగా తన సట్కాతో నేలపై కొట్టి బావిని సృష్టించారట.

రోజు ఉదయం 8:30 ప్రాంతములో సాయి లెండికి వెళ్ళివచ్చేవారు. బాబా లెండి తోటకు వెళ్ళునప్పుడు బాబా వెంట అబ్దుల్లా తప్ప ఎవరు వుండేవారు కాదు. సాయి చెట్టు తోపులో నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. తరువాత వచ్చినదారినే తిరిగొచ్చేవారు గాని, తూర్పుగా దగ్గరదారిన మశీదుకొచ్చేవారుగాదు. జీవుల శరీరంలో శ్వాస, ప్రకృతిలోని మానవతా ధర్మాలలాగా సాయిగూడ తమ పంధాను ఎన్నడూ మార్చేవారు గాదు.

1910-11 లో ప్రధాన్ షిరిడిలో యున్నప్పుడు ఒక గురువారము రోజు బాబా అండాల్(పాత్ర) అన్నం వండుతూ ఉండగా బాబా అందులో చేయిపెట్టి కలియపెట్టుట చూచి ఆశ్చర్యపడిరి. ఆ సమయమున బాబా అందరిని వెళ్ళమని ప్రధాన్‌ను నానాసాహేబ్ చందోర్కరు కుమారులనుంచి "ఏరా! మనం ఏమిపాడాలి?" అని 'శ్రీరాంజయరాంజయజయరాం' అనే అర్దం వచ్చేటట్లు పాడారు.

ఆ రోజు మధ్యాహ్నం ఈ ముగ్గురిని తీసుకొని బాబా లెండికి వెళ్ళారు.(ఆ సమయములో బాబా ఎప్పుడు లెండికి వెళ్ళియుండలేదు) బాబా అక్కడ చిన్న చిన్న గుంటలు త్రవ్వారు. జొన్నవిత్తనాలు ఆ గుంటలలో చల్లి మట్టికప్పి ప్రధాన్‌ను నీరు పోయమన్నారు. ఇది లెండితోటను అతను సంస్థానమునకు ఇచ్చుటకు సంకేతము మఱియు ఈ పని ప్రధాన్‌కు ఒప్పచెప్పుట కావచ్చు. ఆ తరువాత ఈలెండితోటయున్న స్థలమును 1918లో బాబా దేహమును చాలించిన కొద్దికాలానికి రూ 1500/-లకు ప్రధాన్ కొని సాయి సంస్థానమునకు యిచ్చినాడు.