నందదీపం

లెండి వనములో 1890 ప్రాంతములో ఒక గుంటలో నందదీపం బాబా వెలిగించారు. బాబా లెండికి వెళ్ళిన తరువాత ఆ దీపము వెనుక కూర్చునేవారు. అక్కడ రెండు కుండల నిండా నీరు ఉంచబడేది. బాబా ఆ నీటిని చుట్టూ చల్లేవారు. అప్పుడు అబ్దుల్లా తప్ప ఎవరు బాబా వెంబడి ఉండేవారు కాదు. లేండితోటలో బాబా నందదీపం ఒకవైపు వేపచెట్టు, మరొకవైపు రావిచెట్టు నాటారు. రావి మొక్క ఏపుగా పెరగకపోయేసరికి బాబా ప్రతి రోజు ఆ రావి మొక్కను స్వహస్తాలతో వంచేవారు. అది క్రమంగా ఎంతో ఏపుగా పెరిగింది. ఇది దత్తాత్రేయ మందిరము ఎదురుగా వుంది. ఎంతో మంది భక్తులు దర్శించుకుంటున్నారు.

[stray-random]