ఖండోబా మందిరము

మహారాష్ట్ర ప్రజలకు పాండురంగ విఠలుడు, ఖండోబా ముఖ్యమైన ఆరాధ్యదైవాలు. ఖండోబా మందిరం బస్‌స్టాండుకు ఎదురుగా, సాయినాధ్ ఆసుపత్రి ప్రక్కన ఉంది.చాంద్‌పాటీలు భార్య మేనల్లుడి పెళ్ళి బృందంతో బాబా రెండవసారి శిరిడీ వచ్చినప్పుడు ఆయన ఈ మందిర పూజారియైన మహల్సాపతి బాబా బండిలోంచి దిగుతుండగానే ఆయనను అలనాడు శిరిడీ విడిచి వెళ్ళిన బాల తపస్వి అని గుర్తించి, "యా సాయీ! ఆవో సాయీ" (రండి సాయీ!) అన్న పిలుపే బాబాకి నామకరణమైంది. ఈనాడు సాయినామం కోట్లాది ప్రజలకు తారక మంత్రమవడానికి నాంది పలికిన పుణ్యభూమి ఇదే! ఉపాసనీ బాబా, అవతార్ మెహర్ బాబా వంటి సాధు సత్పురుషులు, అవతార పురుషులు దర్శించిన, నివసించిన ఆలయం ఇది. బాబా తరుచు రహతా వెళ్ళ్తూండేవారు. తిరిగి వస్తూ ఈ మందిరంలోకొచ్చి భక్త మహల్సాపతిని పలకరించేవారు. అంధుకే ఇది శిరిడీలో ప్రప్రధముగా దర్శించవలసిన పుణ్యస్థలి.