హనుమాన్ మందిరము

ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళేదారిలో ఎడమచేతివైపున మారుతి ఆలయం వుంది. ఇది సాయి శిరిడీరాక పూర్వం నుంచీ వున్న పురాతన మందిరం. సాయిబాబా వచ్చిన క్రొత్తలో దేవిదాసు, జనకిదాసు మొదలగు సాధువులు ఇక్కడుండేవారు. బాబా అప్పుడప్పుడు ఈ ఆలయములోకి వెళ్ళి వారితో గడిపేవారు. ఈ మందిరంతో బాబాకి ఏదో అవినాభావ సంబంధం వుంది. చావడికి వెళ్ళేటప్పుడు శ్రీ సాయి ఈ ఆలయం ఎదురుగా నిలబడి చేయి వూపుతూ మారుతి వైపు నిలబడి ఏవో సైగలు చేసేవారు.