Category: Mahaneeyulu – 2020


వరుణదేవి, లాలారాములకు తన్వార్ లాలారాం వాస్వాని నవంబర్ 25, 1879న జన్మించాడు. భక్తి ప్రపత్తులున్న కుటుంబం వారిది. బాలకుడు వాస్వానీ ఒకసారి పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చి ఇక నాకు మాంసాహారం పెట్టవద్దని తల్లితో చెప్పాడు. ఆ తల్లికి మాంసాహారం తినకుంటే బలం రాదని, బాలకుడు గుర్తించలేని విధంగా మాంసంతో వంటకం చేసి పెట్టేది. Read more…


లలితానందస్వామి ఎవరో నిర్దారించ లేకపోయారు. కొందరు ములికి నాటి బ్రాహ్మణుడంటారు. సయ్యద్ మరుక్కాయర్ స్వామి తన సోదరుడంటారు, జయపురం లోని క్రైస్తవ వనిత తన భర్త అంటుంది ఆయనను. ఆయనను సుబ్రహ్మణ్యంశుడంటారు. చరమ జీవితం తిరువణ్ణామలైలోని శేషాద్రి ఆదేశం ప్రకారం పశుమలలో గడిపారు. ఈయనను వాడదేవుల లలితానందుడంటారు. ఈయన ఒకసారి యజ్ఞము చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని Read more…


పాణయ్యకు శ్రీరంగంలో కొలువై ఉన్న రంగనాథుడంటే చాలా ఇష్టం. ఆ పరిసరాల్లోనే నిచుళాపురం అనే ఊరు ఉంది. అక్కడే పాణయ్య ఉండేవాడు. కావేరీలో స్నానం చేసి, ఇసుక తెచ్చి, ఆ ఇసుకతో బొమ్మను (మూర్తిని) చేసుకుని దానినే రంగనాధునిగా భావిస్తూ, వీణ భుజాన తగిలించుకుని దానిని మీటుతూ భక్తి కీర్తనలు పాడేవాడు. ఎవరో ఒక భక్తుడు Read more…


అక్కల్ కోటలో స్థిరపడిన స్వామి సమర్థుల వారి శిష్యులలో ప్రఖ్యాతి చెందిన మహనీయుడు బీడ్కర్ మహారాజ్. ఈయన నవంబరు 22, 1839న జన్మించాడు. ఈయన కుల దైవం హనుమంతుడు. ఈయన మహా భక్తుడు. బాల్యంలో పాండురంగని దర్శిద్దామని పండరీపురం వెళ్లాడు. కానీ ఇసుక వేస్తే రాలనంతమంది ఆ దినం రంగని దర్శనానికై ఉన్నారు. ఇక తనకు దర్శనం Read more…


దత్త పరంపరలో తనదంటూ ఒక స్థానం ఏర్పరచుకొనిన రంగావధూత జన్మించినది 1898, నవంబర్ 21 (సోమవారం). ఆయన దత్తునిలో ఐక్యమైన దినం 19 నవంబర్, 1968. వీరు మహారాష్ట్రులైన, గుజరాత్ లోని వాలమేలో జన్మించారు. రంగావధూత బాల్య నామం పాండురంగ. పాండురంగకు 8 ఏండ్ల వయసులో ఉపనయనమైంది. ఆ దినమే వాసుదేవానంద సరస్వతులు వారు ఆ Read more…


పొలాసపూర్ ను పాలించే విజయుని కుమారుకు ఐముత్తుడు. తల్లి శ్రీమతి. అప్పుడు ఐముత్తునకు సుమారు ఆరు ఏండ్లు. ఒకనాడు ఆ రాకుమారుడు వీధిలో భిక్షార్థియై పోతున్న గౌతముని చూచాడు. గౌతముడు 24వ జైన తీర్థంకరుడైన మహావీరుని శిష్యుడు. ఆ రాకుమారుడు గౌతముని చూచి, తమ గృహానికి వస్తే, భిక్షను సమర్పిస్తానని అన్నాడు. ఐముత్తునితో గౌతముడు రాజసౌధంలోనికి Read more…


నింబార్కా చార్యుల వారిని తెలుగు వారంటారు. ఆయన జన్మ దినం కార్తీక పూర్ణిమ. అయితే తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన ప్రదేశాలు వేరు వేరుగా భావిస్తారు పరిశీలకులు. రామానుజాచార్యుని వలె, త్రైలింగస్వామి వలె, వల్లభాచార్లు వలె, నిబార్కాచార్యులు కూడా తెలుగు వారే. ఈయన సాంప్రదాయాన్ని హంస సాంప్రదాయమని, దేవర్షి సాంప్రదాయమని, సనకాది సాంప్రదాయమని అంటారు. నింబార్కుఆచార్యులను నింబాదిత్య Read more…


కొందరి మహనీయుల కీర్తి పతాకాలను కాలం కూడా ఎగురువేస్తుంది. ఆ మహనీయులకు నామం పెట్టిన వారు కూడా చిరస్మరణీయులే. ‘సాయి’ అని ఫకీరుకు నామకరణం చేసింది మహల్సాపతి. మౌనస్వామి అని, బ్రాహ్మణస్వామి అని పిలవబడే మహనీయునికి భగవాన్ శ్రీరమణ మహర్షి అని గణపతి ముని పేరు పెట్టారు. గణపతి ముని అసలు పేరు నవాబు అయ్యలసోమయాజుల Read more…


ఉత్తర హిందూ దేశంలో విద్యావతి పేరు చిరస్మరణీయంగా ఉండిపోయింది. ఈశుని దాసునిగా చేసుకోగలిగినంత గొప్ప భక్తుడు. భక్తుడు మాత్రమే కాదు, మహా రచయిత. ఈయనను అపర జయదేవుడు అంటారు. రాజుల కొలువులో ఉండేవాడు. చివరి రోజులలో పరమేశ్వర సేవకే అంకితమయ్యాడు. శ్రీమద్ భాగవతం మొత్తాన్ని స్వహస్తాలతో నకలు వ్రాసి, సంకలనం కూడా చేశాడు. ఇప్పటికి అది Read more…


స్వామి శివానందులు నవంబరు 16, 1854లో జన్మించారు. రామకృష్ణ పరమహంస నుండి సన్యాస దీక్షను పొందిన మహనీయుడు. ఒకసారి స్వామి శివానందను ఒక గృహస్థుడు భోజనానికి ఆహ్వానించాడు. భోజనం చేసి తిరిగి సందు దాటే ముందు కొంతమంది పేదవారు, ఎవరో వదిలేసిన ఆహారం కోసం పోట్లాడుకోవటం చూచి, ఆ దృశ్యాన్ని భరించ లేకపోయారు. ఆ గృహస్తును Read more…


సూఫీ సాంప్రదాయంలో “అహం బ్రహ్మ” నేనే దైవాన్ని అనే స్థితికి చేరుకున్న సత్పురుషులెందరో ఉన్నారు. వారిలో ఒకరు షామ్స్  తబ్రీజి. షామ్స్ తబ్రీజి సన్నిహితుని కోసం అన్వేషిస్తున్నాడు. ఆయనకు సన్నిహితుడు లభించినది నవంబర్ 15, 1244గా భావిస్తారు కొందరు. ఆ సన్నిహితుడే రూమీ. షామ్స్ తబ్రీజి సాంగత్యం వాలా మౌలానా రూమీ అయ్యాడు. ఆ ఇరువురి Read more…


సాయిబాబా అన్నదానం చేసేవాడు.  14  నవంబర్, 1799న జన్మించిన జలారాం బాపా సదావ్రతమును స్వీకరించాడు. సదావ్రతమంటే నిత్యాన్న దానం. ఆ అన్నదాన కార్యక్రమంలో సాధువులు, జంతువులు, సాధారణ మానవులు, అందరూ పరమేశ్వర స్వరూపాలే. సాయిబాబా గురు భక్తిని ప్రోత్సహించినట్లు జలారాం బాపా తన గురువైన భోజాభగవత్ ను సేవించేవాడు. ఆ గురు భక్తి, ఆ అన్నదాన Read more…


బెంగాలీ బాబా ఆజ్ఞ ప్రకారం భోలే బాబా నర్మదా నాదీ తీరానికి బయలు దేరాడు. వైరాగ్యంతో ఉండాలని, కఠిన సాధన చేసి ఫలాలను సద్వినియోగం చేయలని సూచన ఇచ్చారు. నర్మదా తీరాన్ని చేరే ప్రయత్నంలో ఆయనకు దుర్వాసుని దర్శనం లభించింది. నర్మదా తీరాన, పశ్చిమ భాగాన ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కుటీరానికి అతి సమీపంలో ఉన్న Read more…


నామదేవుని గూర్చి పలుకుతూ, ఒక సమయంలో, ఆయనను సగం కాలిన కుండ లేదా కాలికాలని కుండగా పోల్చటం జరిగింది. సాయి సచ్చరిత్రలో సాయి కాలని కుండలతో మొక్కలకు నీరు పోసాడు. కాశ్మీరు దేశంలోని యోగిని లాల్ దెడ్. ఆమెను లల్లాదేవి అంటారు. ఆ లల్లేశ్వరి తనను కాల్చబడని మట్టి కలశంతో పోల్చుకుంది. కుండ కాలింది. అలా Read more…


మహిమలు అనంతము. క్రీస్తు మంచి నీటిని ద్రాక్ష రసంగా మార్చెను. సాయిబాబా నీటిచే దీపములు వెలిగించెను. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గారిని హైదరాబాదు పాదుషా గారు ఒక కోరిక కోరారు. ఇంత వరకు వీరబ్రహ్మేంద్రస్వామి వారి లీలలెన్నో విని యున్నామనియు, ప్రత్యక్షముగా ఒక లీల చూడవలెనని కోరికను వెల్లడించారు. స్వామి “సరే” అన్నారు. “నీటితో దీపమును తాము Read more…


మార్టిన్ లూథర్ అసలు పేరు మార్టిన్ లూడర్ (Martin  Luder). ఈయన మాతృ భాష జర్మనీ. ఒకసారి మాత్రమే జర్మనీ దేశము నుండి బయటకు వెళ్ళాడు. చదువులో చురుకైన వాడు. న్యాయ శాస్తమును చదువదలచాడు. కానీ దైవము నిర్ణయం వేరుగా ఉంది. ఒకసారి మార్టిన్ లూథర్ భయంకరమైన తుఫానులో చిక్కుకు పోయాడు. తుఫాను నుండి బ్రతికి బయటపడితే Read more…


సెల్వపెరుమాళ్ జాతకాన్ని, తల్లిదండ్రులు జ్యోతిష్యం బాగా తెలిసిన జ్యోతిష్యునికి చూపారు. సాధు జీవితం ఆ జాతకునిది అని తేల్చడా జ్యోతిష్యుడు. దానికి భిన్నంగా ఉండేటట్లు తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించారు. అదేదీ ఫలించలేదు. చివరకు సాధువే అయ్యాడు, తల్లిదండ్రులు అంగీకరించ వలసి వచ్చింది. భగవాన్ రమణుల ఉపదేశసారం చదివాడు. అందులో ఆయన(రమణుల) చిత్రపటం చూచాడు. భగవాన్ కొండపై Read more…


పుట్టుకతోనే కొందరు తమ జీవితాలను భగవదర్పితం చేస్తారు. అటువంటి వారిలో ఒకరు బాబా నందసింగ్ జీ. ఈయన నవంబర్ 8, 1870లో జన్మించారు. బాల్యంలోనే ఆ పిల్లవాడు ఏకాంత ప్రదేశములో ఉన్న ఒక బావిపై కూర్చుండి ధ్యానంలోనికి వెళ్లిపోయేవాడు. ఎన్నోసార్లు అతనిని అక్కడ నుండి తీసుకు వచ్చేవారు. “ఏ మాత్రం కన్ను మూతపడినా, బావిలో పడిపోతావని Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles