సర్వవ్యాపకాన్ని గుర్తించగలగడం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా  …  సాయి బాబా  …  సాయి బాబా  …  సాయి బాబా

Author:Kota Prakasam Garu

జిజ్ఞాసలేనిదే జ్ఞానానికి అంకురార్పణ మొదలుకాదు , మనసనే పగ్గాలను గురుపాదాలకు అప్పగించనిదే మోక్షప్రాప్తికి అవకాశం రాదు
*********

కాలాన్ని ఆపలేము , ప్రారబ్దాలనూ అణచలేము ..

ఎంతటివాళ్ళు కాలానికి తలొగ్గి బ్రతకవలసిందే ..

సముద్రాలు ఆవిరికావొచ్చు , హిమాలయాలు ఎడారికావొచ్చు అయినా కాలం మాత్రం దేనిని పట్టించుకోకుండా ముందుకు నడుస్తూనేవుంటుంది ..

కాలగతిలో పురుడుపోసుకునే ప్రతి ప్రాణి , ప్రతి వస్తువూ నశించిపోతూ , మళ్లీ భీజాలై మొలకెత్తుతూనే ఉంటాయి … శాశ్వతమంటూ ఏదీ కనఁబడదు ..

శరీరానికి ప్రాణం ఎంత ఆధారమో , ఆ ఆదారం నశించేలోపు ముముక్షుత్వాన్ని పొందేందుకు , మనసుకు జిజ్ఞాసా అంత అవసరమే ..

అపారమైనది , అనంతమైనది , అంతటా వ్యాపించి , కాలాతీతమైనది ఈ సృష్టికి ఆదారం అంటుంది వేదం ,, ఆ ఆధారాన్ని తెలుసుకుని , వర్ణించ సాధ్యంకాక అంతటి వేదాలే చేతకాక తలదించుకొంటాయట ..

కాలానికి , త్రిగుణాలకు అతీతుడైనవాడు సద్గురువు , ముముక్షువులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించేవాడు సద్గురువు ..

జిజ్ఞాస మొదలుకానిదే జ్ఞానానికి అంకురార్పణ ప్రారంభంకాదు ..

మోక్షం అంటే అదేదొ వైకుంఠప్రాప్తో లేక కైలాసప్రాప్తో అనేది లొకంలో వొక నానుడి ..

భగవంతుడు అంటేనే అది సర్వవ్యాపకం అని అర్థం , అది ఏ వైకుంఠానికో , కైలాసానికో పరిమితం కానప్పుడు , ముముక్షువు మొక్షాన్ని పొందిన పిదప ఆత్మ దేనికి అనుసంధానమౌతోంది అన్నది జ్ఞానం పరిపూర్ణస్థితి అనుభవానికి వొచ్చినప్పుడు అవగాహనకొస్తుంది అని ఆర్యులంటారు ..

అంతటా నిండినది , అంతటా వ్యాపించినది , నీలో , నాలో ఉన్నది ఒక్కటే అని గుర్తించడం ఒక్క జ్ఞానం వల్లనే సాద్యం..

ఆ ఉనికిని గుర్తించి , ప్రఙ్ఞను కలిగి ఉంటే, మనసు సర్వవ్యాపాకాన్ని గుర్తించగలదు ..

దానిని గుర్తించగలగడమే మోక్ష సాధనకు అదించబడే జ్ఞానమార్గం ..

మనసనే పగ్గాలను సద్గురు చరణాలకు అప్పగించి , నిమిత్తమాత్రులుగా ఉన్నవారికి మోక్షప్రాప్తి అరచేతితో వైకుంఠంలాంటిదే అని పెద్దలమాట ..

శ్రీ సాయి గురుబ్యోనమః
*******

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles