Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
ఆహారం , నీరు ఇవి ప్రాణానికి ఆధారం .. జిజ్ఞాస , ఏకాగ్రత ఇవిఆత్మజ్ఞానానికి ఆధారం ..
*******
ఉదయంలేచింది మొదలూ ఎక్కువగా బయటతిరిగే మగాళ్ళమొదలు , యింటిపట్టున గడిపే ఆడవాళ్లవరకూ నానారకాల వ్యక్తులు పరిచయం అవుతుంటారు ..
కొన్ని పరిచయాలు ఏదో అవసరాలకు పరిమితమౌతుంటాయి , కొన్ని గాడంగా పెనవేసుకుపొయ్యేవిగా ఉంటాయి ..
ఎవరు యెంతగాడంగా అభిమానించిన , భార్యా భర్తలు మద్య మనసులు దిగజారకుండా , వొకరిని ఒకరు చివరివరకూ గౌరవించుకొంటే , వారిని సాక్షాత్తు సీతారాములవారితో పోల్చిచెప్పడం ఒక ఆనవాయితీ ..
గురు శిష్యుల సంబంధం కూడా ఇలాంటిదే అన్నది ఆర్యశబ్ధం .. ఏకాగ్రత , ఏకోపాసన ఇవి రెండూ బండికి రెండు చక్రాలలాంటివి … ఎక్కడ ఎప్పుడు కాస్త మనసు చలించినా , విశ్వామిత్త్రుడు మళ్లీ మళ్లీ తపసుకు కూర్చున్నట్టు , ఆదీనం తప్పిన మనసును స్వాధీనం చేసుకొనేందుకు మళ్లీ నానా అవస్థలు పడితీరాల్సివొస్తుంది ..
మందబుద్ధులు మొదలూ మహనీయులవరకు శరీరావసరానికి ప్రదానంగా కావలసింది ఆహారం , నీరుఆఁకలివేసినా , దాహం వేసిన సంకేతాలను అందించడం శరీరానికున్న దర్మం ..
ఆ ధర్మాన్ని విస్మరించి , అలసత్వంవహిస్తే అది ప్రాణానికే ముప్పువాటిల్లుతుంది ..
ప్రతి ప్రాణిలో ఆత్మ తటస్థంగా ఉందనేది గీతావాక్యం , ఎవరి కర్మలనుబట్టి వారు , అయా యోనులలో జన్మించేందుకు ఆత్మ ఒక వారధిలాంటిది అంటారు ..
“ఒకటికి రెండుసార్లు చెప్పి చూస్తాను,వినకుంటె వారి కర్మకు వారిని ఒదిలి చూస్తుంటాను ” అంటారు బాబా ..
” చెప్పేంతవరకు నా ధర్మం , విని ఆచరించి , తరించడం అది నీ ప్రయత్నమే ” అంటుంది భగవద్గీత ..
జిజ్ఞాస మొదలయితే జ్ఞానబీజం మొలకెత్తుతుంది ,ఏకాగ్రత కుదిరితే అది మహావృక్షమౌతుంది , శరీరానికి ఆకలి,దాహం ఎంత అవసరమో , ఒక జన్మ పరిణతిచెంది , మోక్షాన్ని వరించేందుకు జ్ఞానం , ఆచరణ కూడా అంతె అవసరం .. ఆ జ్ఞానాన్ని ప్రసాదించి , తరింపచేయగలవాడు సద్గురువొక్కడే ,,
జయ్ గురుదేవ సాయి సమర్థ
*******
Latest Miracles:
- బాబా మహిమ – సరస్వతి కటాక్షం
- రమాబాయి
- మందిర నిర్మాణానికి ఫకీరు ఆదేశం–Audio
- సద్గురు సాయినాథుని సాక్షాత్కారం, యోగయ్య, కోట, నెల్లూరు జిల్లా.
- శ్రీ దస్తూర్జీని బాబా అప్రమత్తం చేసి అగ్ని ప్రమాదం నుండి రక్షించారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments