Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
ఆడవాళ్లు గడపదాటితే అదో అపచారం ఆనాడు .. మనసు హద్దులుమీరితే సాధనే సద్దుమణుగుతుంది ఏనాడైనా.
********
“దినగండం, నూరేళ్లాయుష్షు” అని పాత రోజుల్లొ ఓ సామెత వినిపిస్తూండేది.
ఆ రోజుల్లొ స్త్రీ ఏ పేరంటాళ్లకో, పెళ్ళిళ్ళకోతప్ప మిగతారోజుల్లో గడపదాటి బయట తిరిగే అవసరం ఉండేదికాదు, కేవలం ఇంటి పనులు చక్కదిద్దుకొనేందుకే పరిమితమయ్యేది.
సామెతలు కొన్ని వినేందుకు ఘాటుగా ఉన్నా, కొంచెం లోతుగా ఆలొచిస్తే, పెడార్ధాలకు తావుండదు.
“ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరగక చెడతాడు” అనేవాళ్ళ.
మనసు మగాడిలా తిరగడం మొదలుపెడితే అది నానా విశేషాల సెకరణలో పడుతూ,నిలకడను కోల్పోతుంటాడు ఆడవారు నాలుగుగోడలకే పరిమితమయి, మనసు సంసారచట్రంలోనే పరిభ్రమిస్తూ ఆ పరిస్థిలకే అలవాటుపడిపోతుంటారు ఈ సామెత ఆనాటి వ్యవస్థకు, సాంప్రదాలనుబట్టి పుట్టుకొచ్చింది, ఇప్పుటి కాలపరిస్థితిలో ఎవరయినా ఆ సామెతను వాడితే, అన్నవాడిని నడివీధిలోకి లాగిమరీ రచ్చ రచ్చ చేసేస్తారు మహిళాసంఘాలంతా ఏకమై .
మగవాడు ఏదో వృత్తిరీత్యా పగలంతా పనిచేయనిదే సంసారచక్రం ముందుకు సాగదు, అలా బయట తిరగడంలో ఏక్షణం ఏ రూపంలో ఆపద ముంచుకొస్తుందో అని మగవాళ్లకు ప్రతి దినమూ ప్రాణగండమే అని నానుడి పుట్టిఉండవొచ్చు, ఆడవాళ్లు శరీరం, హృదయంకూడా సున్నితమైంది.
ఏపరిస్థితినైనా మగాడు మోటుగా భరించినంత, ఆడవాళ్లు భరించటం కష్టమే, కానీ ఒక బిడ్డకు జన్మనిచ్చే విషయంలొ అది ఆడవారికి ప్రాణాంతకమే, మొగవాడు రొజూ ఎదుర్కొనే సమస్యలు దైనందిక కార్యక్రమంలో అదో అనవాయితీగా అలవాటుపడిపోతాడు, ఒక స్త్రీ పురుటిసమయంలో అంతకన్న భరించరాని వేదనను అనుభవించక ఒక రూపానికి నిండుదనం యివ్వలేదు.
మగవాడు తన వృత్తి థర్మాన్ని సక్రమంగా నిర్వహిoచి, సంసారానికి ఆధారమైనట్టు, ఒక థర్మాన్ని, ఒక సాంప్రదాయాన్ని లోకానికి అందించే క్రమమంలో అవతరించిన దేవుడె రాముడై, మనిషిగా అనేక కష్టాలనుభవించి, సక్రమార్గాన్ని ప్రబోధించాడు, బాబాలాంటి ఏ మహాత్ముల చరిత్రలను గమనించినా ఏ సౌకర్యాలకు నొచుకోక, సాదారణ జీవితాన్ని గడిపి, లోకశ్రేయస్సుకోసం మహోన్నతమైన సిద్ధాంతాలను అందించారు.
ఆడవారు గర్భందాల్చి, క్రమంగా తొమ్మిథి నెలలు మోసి, ప్రసవవేదనను భరించి, వొకవయసులో తనకు అధారంగా నిలిచే రూపానికి జన్మనిస్తుంది.
సద్గ్రంథాలలో సత్పురుషుల బోధలుకూడా క్రమంగా మనసుకు చొప్పించుకొని, ఒక్కొక్క మెట్టు ప్రయాసపడి అధిరోహించకొనగలిగి- నప్పుడు, తత్ఫలితం ప్రసాదించే అనుభవాలఫలితం ఒక జన్మకు సార్ధకతను చేకూర్చగలదని పెద్దలమాట.
మా వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎoదరో పెద్దల దీవెనలు, మిత్రుల అభినందనలు అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
జయ్ జయ్ సాయి సమర్థ
******
Latest Miracles:
- భయభక్తులు…. మహనీయులు – 2020… మార్చి 2
- ‘‘ద్వారకామాయి పక్కనే ఓ వాడా నిర్మించు. దాని మధ్యలో ఓ మందిరాన్ని కూడా నిర్మించు.”
- పూల దండ మీరైనా ఇవ్వొచ్చుగా బాబా
- మరొకరిని బాధ పెట్టనేమో అని 10 రోజులు గా నరకం అనుభవిస్తున్న.
- ” ఓ దత్త సాయి” నా బాబు రాహుల్ ను మీరే రక్షించాలి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments