Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయిరాం ..
బాబా కలలో కనిపించి సాయి లీలాస్ లో రాబోయే క్విజ్ విన్నర్ మా మావయ్య ఏ అని నాకు ముందే నిదర్శనం ఇచ్చారు , ఇప్పుడు ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను..
పోయిన వారం (15/11/2018) క్విజ్ విన్నర్ ని ప్రకటించే 3 రోజుల ముందు తెల్లవారుజామున 5 గంటల సమయం లో బాబా నాకు ఈ కింది దృశ్యాన్ని చూపించారు.
మా మావయ్య మా ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాడంట , నేను మా మావయ్య దగ్గరకి వెళ్ళి యిలా నువ్వు క్విజ్ లో గెలిచావు , క్విజ్ లో నీ పేరు వచ్చింది అని చెప్పాను , అప్పుడు వెంటనే మా మావయ్య అక్కడికి అక్కడే రోడ్ మీద పాద రక్షలు విడిచిపెట్టి యిలా అన్నారు
” బాబా మమ్మల్ని కరుణించి మా ఇంటికి వస్తున్నవా బాబా ” అని ఆనంద భాష్పలు కారుస్తూ బాబాకు నమస్కారం పెట్టారు .
ఆ తరువాత మా మావయ్య గుడి లో కి వెళ్లి ఆంజనేయ స్వామి కి నమస్కరించారు .
అలా ఇక మెలుకువ వచ్చింది . నాకు మెలుకువ రాగానే చాలా సంతోషం అనిపించింది బాబా మా మావయ్య వల్ల ఇంటికి వెళ్తున్నావు అని నాకు ముందుగానే చెప్తున్నవా తండ్రి !! చాలా సంతోషం గా ఉంది బాబా అని మనసులో బాబా ను తలచుకున్నాను.
నేను ఎంతగానో ఎదురు చేస్తున్నానని క్విజ్ విన్నర్ కోసం బాబా చెప్పినది నిజమా లేక నాకు అలా అనిపించిందా అని కానీ నిన్న రాత్రి (21/11/2018) గెలిచిన వారి పేర్లు ప్రకటించినపుడు మా మావయ్య పేరు చూసి నా ఆనందానికి అవధులు లేవు , బాబా కల నిజం అని నాకు నిరూపించారు , ఒక్కసారి బాబా సత్చరిత్ర కి నమస్కారం చేసుకున్నాను .
ఇలా బాబా తాను స్వయం గా చెప్పింది వేరు కాదు తన కల వేరు కాదు అని ఆనాడు మేఘశ్యాముడు కి చెప్పింది నా విషయం లో మళ్ళీ నిరూపించారు ..
ఈ కల ని నేను ఎప్పటికి మర్చిపోను , నీకు శత కోటి వందనాలు బాబా…
Sai Krishna : Active Devotee of Baba
Latest Miracles:
- బాబాగారి 101వ సమాధి చెందిన రోజుకి saileelas.com వెబ్సైటు లో బాబాగారి క్విజ్ లు correct గా 101 క్విజ్ లు
- ఒక నాస్తికుని చేత శివదీక్ష చేయించి మోక్షాన్ని ప్రసాదించిన బాబా వారు!
- వినాయక చవితి నాడు బాబా ఫోటో రూపంలో భక్తురాలి ఇంటికి వచ్చుట…Audio
- మనిషిరూపంలో- శిరిడీ సమాధిమందిరములో వుండే బాబావారి విగ్రహంముఖములా…Audio
- మా ఇంటికి వచ్చిన బాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments