Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Audio Support By: Mrs. Jeevani
సచ్చరిత్రలన్నీ శాంతి రస ప్రధానాలై ఉంటాయి.
ఒకొక్కసారి ఆ శాంత మూర్తికి కోపం వస్తుంది. కోపం రావటం కాదు, ఆయన కోపాన్ని చూపిస్తాడు. అది నిజమైన కోపం కాదు.
ఆ వ్యక్తికి ఎదైనా నష్టం, కష్టం సంభవించే ముందు దానిపై ఆ కోపాన్ని చూపిస్తాడు సాయి.
చూచే వారికి వ్యక్తినే కోపిస్తున్నాడు అనుకుంటారు. అలా అనుకోవటం సహజమే.
ఫిబ్రవరి 22, 1914లో సాయిబాబా బాలకృష్ణ విశ్వనాధ దేవ్ అనే భక్తునిపై కోపగించుకున్నాడు.
అప్పటికే విశ్వనాథ్‌కు బాబా తత్వం తెలిసింది.
విశ్వనాధ దేవ్ బాలక్‌రాం అనే తోటి భక్తుడిని సాయి కృపను పొందిన వైనం అడిగాడు. వెంటనే సాయి దేవ్‌ను పిలిచి కోపగించు కున్నాడు.
ఆ కోపం కొంచెమా? ”నీవు మోసగాడివి. ఇప్పుడు నీవు తప్ప పాత గుడ్డను దొంగిలించానికి ఎవరు వస్తారు? నీవే దొంగవి.
ఇక్కడకు రావటం దొంగతనం చేయటానికా? వెంట్రుకలు తెల్లవై పోయాయి. చెడు అలవాట్లు మాత్రం పోలేదు.
నిన్ను కోస్తాను. గొడ్డలితో నరుకుతాను. చంపేస్తాను. నా చేతుల్లో నుండి ఎక్కడకు పోతావు? ఎక్కడకి పోయినా, అక్కడకు కూడా వచ్చి నిన్ను చంపేస్తాను.
షిరిడీకి రావటం దొంగతనం చేయానికా? ఇవిగో, నీవి తిరిగి తీసుకో, నా పాత గుడ్డ ముక్క తెచ్చి ఇవ్వు” అని సాయి అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు.
దేవ్‌కు భయం రాకపోగా ”ఈ విశ్వరూప సందర్శనం ఎంత గొప్పది, ఎంత అందమైనది” అని తనలో తాను ఆనందించాడు.
కాసేపటికి సాయి కోపం చల్లారింది.
సాయి అభిమానాన్ని, ప్రేమను ఎవరు ఎలా పొందారన్నది కాదు కావలసినది, ఎవరికి వారే స్వయంగా తెలుసు కోవలసిన విషయం.
ఒకరికి, వేరొకరికి గురువు అనుగ్రహ విషయంలో తేడా ఉంటుంది. అందరిది ఒకటే పద్ధతి కాదు.
సాయి కోపం అంతా దేవ్‌ను అడ్డుపడుతున్న విషయాలపైన.
పారాయణ చేయటం ప్రారంభించుదామని, పారాయణ మొదలు పెట్టాడు దేవ్.
సాయి సంకల్పం వల్ల ఆ పారాయణకారుడు పారాయణ గ్రంథాన్ని పరిపూర్ణం చేశాడు.
అంటే పాఠకుడే పారాయణ గ్రంధ రచనాకారుడు అయ్యాడు.
మనం తెలిసి తప్పు చేయకూడదు. మనం తెలిసి చేసిన తప్పుతో సాయి ఎదుట నిలబడి ప్రార్ధించగలమా?
అందుకని తప్పులు చేయనే చేయ కూడదు. సాయి ఆగ్రహానికి గురి కాకూడదు.
దేవ్ వలె మనం తెలియక తప్పు చేసినా సాయి కాసేపటికయినా క్షమించకపోరు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- ఆరతి జ్ఞానరాజా!…..సాయి@366 అక్టోబర్ 25….Audio
- పండగే పండగ ….. సాయి @366 ఫిబ్రవరి 8….Audio
- కాకా పురాణిక్ ….. సాయి@366 ఫిబ్రవరి 26….Audio
- నేనెవరు?…..సాయి@366 అక్టోబర్ 22….Audio
- సాయి మహమ్మదీయుడా? ……సాయి @366 ఫిబ్రవరి 6….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments