Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా మహాసమాధి అనంతరము భక్తులయిన వారిలో శ్రీమణి సాహుకారు ఒకరు.
ఆమె ఒకసారి బి.వి. నరసింహ స్వామిగారిని కలసినది. నరసింహ స్వామి ఆమెకు సాయిబాబాను గురించి తెలిపినారు. ఆమె అప్పటి నుండి సాయి అంకిత భక్తురాలయినది.
1950లో ఆమె గాత్రమునకు తీవ్రమైన అవరోధము ఏర్పడినది. గొంతునుండి వెలువడు ధ్వనిలో మార్ధవము లేదు.
ఎన్ని మందులు వాడినను ఫలితము చేకూరలేదు. చివరకు ఆమె షిరిడీకి వెళ్ళినది. అప్పటి కింకను సాయి విగ్రహము ప్రతిష్టింపబడలేదు.
పటమునందలి ఆ సాయి ఎదుట నిలబడి రోదించినది. సాయికి గాక ఇంకెవరికి మూగ బాధను చెప్పుకొనగలదు?
సమాధి మందిరము నుండి, అక్కడే బస చేయుచున్న ఒక స్నేహితురాలి వద్దకు పోయినది. మనసు కొంచెము నెమ్మదించినది.
రాత్రి ఏడున్నర గంటలకు మణి సాహుకారు తన గదిలోనికి పోయి, ధరించిన వస్త్రములను మార్చుకొనదలచెను.
చీర యందు గర, గర శబ్దము వినబడినది. ఒక చిన్న పొట్లము తెల్లనిది, రెండంగుళములున్నది చీరనుండి జారిపడినది.
ఆమె ఆశ్చర్యపోయింది. పొట్లము విప్పి చూడగ 6, 7 హోమియోపతి టాబ్లేట్లవంటివి కనిపించినవి.
ఆమె వెంటనే తన స్నేహితురాలి వద్దకు పోయి జరిగినది చెప్పినది. ఆమె ”అవి సాయి ప్రసాదము. స్వీకరింపుము” అన్నది.
మణి సాహుకారు వాటిని సాయి ప్రసాదముగా స్వీకరించినది. ఇక తన ఊరు చేరినది.
పూర్వమువలె తన గొంతు మార్ధవముగా నున్నది. ఇది సాయి కరుణయే అని ఆమె నిశ్చిత అభిప్రాయము.
ఆమె గాయకురాలు మాత్రమే కాదు, మంచి వక్త, రచయిత్రి. ఆమె ఆంగ్లములో 1952లో ”సాయిబాబా -ది సెయింట్ ఆఫ్ షిరిడి” అనే గ్రంథమును రచించినది.
ఆ రచనకు ముందు మాటలు బి.వి. నరసింహ స్వామి 1951 మే 12న వ్రాసినారు.
సాయి భక్తిలో ఈ రచన క్రొత్త పుంతలు తొక్కి, ఇటీవల స్వాతంత్య్రము పొందిన భారతీయుల మధ్య సామరస్యమును నెలకొల్పుతుందని కూడ నరసింహ స్వామి తెలిపారు.
అత్యంత సుందరముగా రూపొందించిన ఆ రచనను సాయికే కాదు, సాయి భక్తులకు అంకితమిచ్చిన మణి సాహుకారు గారి జీవితము ధన్యము.
ఆమె సాయిని సశరీరముతో ఉన్నప్పుడు సేవించకున్నను, ఉపాసనీ మహారాజ్, గోదావరి మాతలను దర్శించి వారి సాంగత్యాన్ని పొందిన అదృష్టశాలి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
- గురుభక్తి…..సాయి@366 ఏప్రిల్ 17….Audio
- గూడు చేరిన పక్షి…..సాయి@366 జనవరి 26….Audio
- సాయి సాహిత్యవనంలో పాశ్చాత్య పుష్పం …..సాయి@366 మే 8….Audio
- మరచిపోయేది మానవ హృదయం…..సాయి@366 జూలై 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments