దాహం! దాహం!!…..సాయి@366 మే 24….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


ఒకసారి నానా సాహెబ్‌ చందోర్కర్‌ ఆఫీసు పనిమీద ఒక గ్రామానికి వెళుతూ దారిలో ఉన్న హరిశ్చంద్ర గుట్టను దాటవలసి వచ్చింది.

కార్యాలయ సిబ్బందితో గుట్ట ఎక్కుతున్నాడు నానా. సగం దూరం ఎక్కేసరికి మధ్యాహ్నమైంది. అది మండు వేసవి (కనుక ఈ సంఘటన మే నెలలో జరిగి ఉంటుంది) నడి నెత్తిన సూర్యుడున్నాడు.

నానాకు గొంతుక పిడచకట్టుకుపోయింది. ఆయన అనుచరులంతా దగ్గరలో నీరు ఏమైనా లభ్యమవుతుందేమోనని చూచారు. కానీ, ఫలితం లేదు.

నానా తీవ్ర దాహంతో ఉన్నాడు. ఏమి చేయటానికి దిక్కుతోచలేదు. నానాకు తన ఆరాధ్య దైవమైన సాయి గుర్తుకు వచ్చాడు. వెంటనే సాయిని మనసారా ప్రార్ధించాడు.

భక్తులందరకు తమ ఇష్ట దైవాలు సమయానికి సహాయం చేస్తాయి. ఈ సంగతి నానాకు తెలుసు.

నర్సీ మెహతా హుండీని భగవానుడు గౌరవించాడు. ఏకనాథుని కోసం వంటలవాని రూపాన్ని దాల్చాడు రంగనాథుడు.

దామాజీని కాపాడటం కోసం, విఠూ మహర్‌గా అవతరించాడు పాండు రంగడు.

నానా ”సాయిబాబా ఇక్కడ ఉంటే బాగుండును” అన్నాడు. ఆయన అనుచరులలో కొందరికి రుచించలేదు, ఆ మాట.

అదే సమయానికి షిరిడీలో తన ప్రక్కన కూర్చున్న శ్యామాతో సాయి ”నానా ఆపదలో ఉన్నాడు” అన్నాడు.

సరిగ్గా అదే సమయానికి కట్టెల మోపు నెత్తిన పెట్టుకున్న భిల్లు నానాకు కనిపించగా, ”ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి?” అని అడిగాడు నానా ఆ భిల్లుని.

”నీవు కూర్చున్న బండ క్రింద” అని జవాబిచ్చాడు ఆ భిల్లుడు. ఆ బండను తొలగించగానే స్వచ్ఛమైన నీరు ఎగజిమ్మింది. నీటిని తృప్తిగా త్రాగి నడకసాగించాడు నానా తన పరివారంతో.

కొంత కాలానికి షిరిడీకి వెళ్ళాడు నానా. ”ఫలాన రోజున, ఫలానా సమయంలో ఏదైనా ఆపదలో ఉన్నారా?” అని ప్రశ్నించాడు నానాను శ్యామా. వివరాలు చెప్పాడు నానా.

నీటి జాడ చెప్పిన భిల్లుడు సాయే అని అప్పుడు తెలిసింది నానాకు.

సాయి నానాకు భౌతిక దాహాన్ని తీర్చాడు నీటి జాడను చూపి, ఆధ్యాత్మిక దాహాన్ని కూడా తీర్చాడు గీతార్ధాన్ని తెలిపి.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles