Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-29-బాబా మళ్లీ మళ్ళీ హనుమాన్ చాలీసా పఠించమన్నారు 8:21
న్యాయవాది ఎస్ సుబ్బారావు 1946 జూలై పదిహేడవ తేదీన మరల అస్వస్థతకి గురయ్యారు.
ఉదయం నిద్రనుండి లేవడమే జ్వరంతో లేచాడు. అంతకు ముందురోజు కూడా వంట్లో బాగుండక పోవడం వలన కేవలం ద్రవ ఆహారమే తీసికున్నారు.
ఆ రాత్రి నిద్రపోయేముందు బాబాని ధ్యానించి బాబా కృపనర్దించాడు.
బాబా ఆయన ప్రార్దనని మన్నించి స్వప్న సాక్షాత్కారమిచ్చి హనుమాన్ చాలీసాను మళ్ళీ మళ్ళీ పఠిస్తూ వుండమన్నారు. ఒక్కో హనుమాన్ చాలీసా పఠనం పూర్తవగానే సుబ్బారావు కొద్ది కొద్దిగా నెమ్మళించసాగాడు.
మొత్తము మీద ఆరోజు చివరి సారి హనుమాన్ చాలీసా పఠనం పూర్తయే సరికి సుబ్బారావు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది.
పద్దెమిదవ తేదీ రాత్రి మళ్లీ బాబా స్వప్న దర్శనమిచ్చారు. స్వప్నంలో బాబా మరియూ సుబ్బారావు ఒకచోట జరిగే డిన్నర్ పార్టీకి అహ్వానించబడ్డారు.
బాబా ఒక న్యాయవాది రూపంలొ సుబ్బారావు పక్కనే కూచుని సుబ్బారావు క్షేమాన్నడుగసాగారు. బాబా సుబ్బారావుని హనుమాన్ చాలీసా ను పఠించవలసిందిగా ప్రోత్సహించసాగారు.
బాబా చూపిన ప్రేమాభిమానాలకి సుబ్బారావు చలించిపోయాదు. బాబా తనకి ఎదురైన చిన్నా పెద్దా సమస్యలను తొలగించారని సుబ్బారావు చెప్పుకొచ్చాడు.
బాబా మరియూ హనుమంతుడు వేర్వేరు కాదనీ, ఒక్కరే అనీ పై స్వప్న దర్శనం ద్వారా ఋజువైందని సుబ్బారావన్నాడు.
ఇక్కడొక ఆసక్తికరమైన ఉపాఖ్యానం గుర్తుకు వస్తోంది.
శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లోని నలుబై అయిదవ అధ్యాయంలో ఈ ప్రస్తావన వస్తుంది.
రామనామ ధ్యానం లో లీనమైపోయిన హనుమంతులవారిని శ్రీపాద శ్రీ వల్లభులు కలుస్తారు.
వారిరువురి నడుమ ఈ దిగువ సంభాషన జరిగింది. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతము నుండి యధాతధంగా ఆ సంవాదాన్ని పఠితుల సౌకర్యార్దము ముందుంచుతున్నాను.
’నాయనా! అగ్ని బీజమైన ’రాం’ అనుదానిని ఎన్నికోట్లసార్లు జపించితివో లెక్కకే అందుటలేదు.
ఎంతటి స్వల్ప కాలమైనను కూడా అంత స్వల్పకాలంలో కూడా ’రాం’ భీజమును ఉఛ్ఛరించుచుంటివి. నీ లెక్క వ్రాయుటకు చిత్రగుప్తుల వారే తేల్ల మొగము వేయుచున్నారు.
మహా అనంతమైన మహా శూన్యకాలమున కూడా కోటానుకోట్ల రామ నామమును ఉఛ్ఛరించుచున్నావు. అందుకే నీవు కాలాతీతుడవైనావు. కాలాత్మకుడవైనావు.
నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరములని వ్రాయటకు చిత్రగుప్తునికి తోచుట లేదు. ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారము ధరించవలెను.
ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజేయు సమర్ధుడవగుటచే నీవు సాయీ నామమున విఖ్యాతుడువయ్యెదవు గాక’ అన్నారు శ్రీ పాద శ్రీ వల్లభుల వారు.
అందుకు హనుమ ’ప్రబూ! ’రాం’ బీజము అగ్ని బీజమే, నాకు అగ్ని సిద్ధి అయిన మాటయూ వాస్తవమే! నేను అగ్ని యోజనమున పరిపూర్ణుడనైతైననినదియునూ వాస్తవమే! దేహబుద్దిచేత నేను మీ దాసుడను. జీవబుద్ధి చేత మీ అంశమును.
ఆత్మ బుద్ది చేత మీరే నేనయి వున్నాను. నేను ఏ రూపమున అవరతింపవలయునో తెలియజేయవలసింది’ అని వేడుకున్నాడు. శ్రీ పాదుల వారు మందహాసంతో ఇట్లనిరి ’నీవు శివాంశ సంభవుడైననూ రామభక్తుడవయితివి. భళీ! అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి. అహ్ అనగా శాక్త, శక్తిని ధరించిన వాడు.
అందుచేత అల్లాహ్ అనగా శివ శక్తుల సంయుక్త స్వరూపమని అర్దము.
ఇంతకాలమూ జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేఛ్ఛజనులకు అంగీకారయోగ్యమైన, శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుచూ నన్ను శివశక్తిగా ఆరాధించుము’.
అంతట హనుమ ఇట్లనెను “ప్రభూ! నాకు భరధ్వాజ మహర్షి త్రేతాయుగమున సవితృకాఠక చయనమును పీఠికాపురమున చేసెదననునది తెలియును.
ఆనాడిచ్చిన వరము వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమునూ తెలియును. నేను మీ నుండి ఎట్టి పరిస్థితులలోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు.
మీ గోత్రమే నా గోత్రము కావలెను. నేను మీ బిడ్డను కాదా’ ఆన్నాడు.
అంతట శ్రీ పాదుల ’నాయనా! హనుమా! నీవు ధరించు దేహము భారద్వాజ గోత్రమునందే కలుగును గాక’ అనిరి.
హనుమ మరల ఇట్లనెను ’అల్లామాలిక్! అనగా అల్లాయే యజమాని అని అర్దము’ శ్రీ పాదుల వారు హనుమను కౌగలించుకొనిరి, ’హనుమా! నీవు దేహబుద్దిని వీడుమ, నీవు నా అంశవు’. అనెను.
అంతట హనుమ ’ప్రభూ! నేను మీ అంశనని అంగీకరించుచున్నాను. అయితే అంశావతారాలు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూల తత్త్వములో కలిసి పోవును. అప్పుడు అంశావతారములకు విలువయే లేకుండా పోవును.
అందువలన నేను ధరించెడ అంశావతారము మూల తత్త్వముతో నిరంతరమూ కలిసియుండియూ, ఆది మూలమైన మీ తత్త్వములోని శక్తి సంపద అంతయును ధరించి ఉండవలెను’ అని విన్నవించుకున్నారు.
అంతట శ్రీ పాదుల వారు’ నాయనా! హనుమా! నీవు కడుంగడు బుద్ధిమంతుడవు.
ఏ శక్తి ప్రాభవములు నా యందుకలవో అవన్నియునూ నీ యందు కూడా నెలకొనియుండుగాక.
నేను నృశింహసరస్వతి రూపమున శ్రీశైలము నందలి కదళీ వనములో గుప్తముగా మూడువందల సంవత్సరములు యోగ సమాధిలో వుండెదను.
అంతట ప్రజ్ఞాపురమున స్వామి సమర్ధుడనెడి పేరుతో విఖ్యాతుడునయ్యెదను. నేను శరీరము వదిలెడి సమయము ఆసన్నమైనప్పుడు, సాయి రూపమున వున్న నీలోనికి అవతరించెదను,
సుస్పష్టముగా నా అవతారము నీలొ వున్నదని ప్రకటించెదను. నీవు నాయొక్క సర్వ సమర్ధ సద్గురు అవతారముగా విఖ్యాతి నొందెదవు’ అని ఆశీర్వదించిరి.
’ప్రభూ! దేహబుద్దితో మీ సేవకుడను కావున అల్లా మాలిక్ అని సంచరించెదను. జీవాత్మ బుద్దితో మీ అంశనై గురుస్వరూపమున ప్రవర్తిల్లెదను. కానీ శ్రీ చరణులు దత్త ప్రభువులు కదా!
మీకునూ,నాకునూ అంతరముండుట భావ్యమా? నేను మీరుగా, మీరే నేనుగా మారిన యెడలనే కదా అద్వైతము సిద్ధించును. అందువలన మీరు నాకు దత్త సాయిజ్యమును ప్రసాదింపుడు’ అని హనుమ వేడుకొనెను.
శ్రీ పాద శ్రీ వల్లభుడు కాల పురుషుని తమ వద్దకు హాజరు కావల్సిందని శాసించిరి.
కాల పురుషుడు చేతులు కట్టుకుని నిలబడి యుండేను. అంతట శ్రీ మహా ప్రభువులు ’కాల పురుషా! ఈ హనుమ, కాల పురుషుడవైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు.
ఇతనికి నా సాయిజ్యమును ప్రసాదించదలిచితిని. ఇతనికి నాధ శబ్దమును కూడా ఇచ్చుచున్నాను.
ఇంతటినుండీ ఇతడు సాయినాధుడని పిలువబడు గాక. నేడు దత్తజయంతి గా నేను నిర్ణయించుచున్నాను. హనుమలో చైతన్యమును తదనుగుణముగా మార్చి దత్తస్వరూపము చేయవలసింది’ అని ఆజ్ఞాపించిరి.
సుబ్బారావు అనుభవము సాయిసుధ సంపుటి: 7, భాగం: 4 సెప్టెంబరు 1946 నుండి (శ్రీ పాద, హనుమల సంవాదం శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతము, అధ్యాయం: 45 యధాతధముగా)
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా ఇచ్చిన హనుమాన్ చాలీసా
- మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం నిజమా?
- శ్రీ కాశీనాథ్ లతికి పడిపోయిన మాటను మళ్ళీ బాబా ప్రసాదించిన లీల
- మళ్ళీ మళ్ళీ దర్శించాలనిపించే గురువుగారి సుందరరూపం.
- శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా(షిరిడీవాస సాయిప్రభో)…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments