బాబా వారిని చూడగానే రావూజీకి ఉన్న ఆస్త్మా నెమ్మదించింది–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-34 రావూజీ బాలకృష్ణ ఉపాసని 4:17

రావూజీ బి.ఉపాసని ఎంతో కాలంనుండీ ఆస్త్మా తో బాధపడుతూ ఉన్నాడు. కాకా సాహెబ్ దీక్షీత్ సలహా ప్రకారం 1913 లో బాబాను దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళాడు.

అతనిని చూడగానే బాబా నిన్ను కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది అని అతనిని ఆశీర్వదించి ఊదీనిచ్చారు. అప్పటినుండి రావూజీకి ఉన్న ఆస్త్మా నెమ్మదించింది. ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు.

1913 వ.సంవత్సరం మార్చి నెలలో అతని కుమారుడికి సుస్తీ చేసింది.

వారం రోజులపాటు జ్వరంతో బాఢపడ్డాడు. జ్వరం ఏమాత్రం తగ్గలేదు. వైద్యులు కూడా ఇక ఆశ వదిలేసుకొన్నారు.

అతనికి అంతిమ క్షణాలు దగ్గర పడ్డాయని భావించి ఉపాసనీ, వైద్యుడు ఇద్దరూ పిల్లవాడి మంచం ప్రక్కనే కూర్చొన్నారు.

రావుజీ బాబా ను ప్రార్ధించారు. రాత్రి 2 గంటలకు అలసిపోయి బయటకు వెళ్ళి వరండాలో కూర్చొన్నాడు. అక్కడ అతనికి కాస్త కునుకు పట్టి జోగుతూ ఉన్నాడు. ఆ నిద్రలో అతనికి కల వచ్చింది.

ఆ కలలో బాబా అతని కుమారుడి నుదిటి మీద ఊదీని రాస్తూ కనిపించారు. ఆ తరువాత బాబా ఉపాసనీ ముందు నిలబడి “ఆందోళన చెందకు. రెండు గంటల తరువాత అతనికి చెమట పట్టి జ్వరం తగ్గడం ప్రారంభమవుతుంది.

తెల్లవారేసరికి తగ్గుతుంది. అతను కోలుకొన్న తరువాత షిరిడీ తీసుకొని వచ్చి నా దర్శనం చేయించు” అన్నారు.

ఉపాసనీ కి మెలుకువ వచ్చింది. రెండు గంటల తరువాత కుమారుడికి చెమటలు పట్టి జ్వరం తగ్గసాగింది. అది చూసిన వైద్యుడికి కూడా ఆశ్చర్యం వేసింది.

మూడు రోజుల తరువాత ఉపాసనీకి శ్యామానుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో శ్యామా ” బాబా నుండి ఆదేశం లేనందు వల్ల నీకు ఉత్తరం వ్రాయలేదు.

ఇప్పుడు బాబా చెప్పిన ప్రకారం నీకు ఉత్తరం వ్రాస్తున్నాను. బాబా నీకు ఈ విధంగా వ్రాయమన్నారు.

“నేను ధులియాలో ఉన్న నీ స్నేహితుని ఇంటికి వెళ్ళాను.” అప్పుడు నేను బాబాని అడిగాను నా స్నేహితుడు ఎవరని. అప్పుడు బాబా “ఉపాసనీ బాలకృష్ణ రావూజీ” అన్నారు.

నేను అతని ఇంటికి తరచూ వెడుతూనే ఉంటానని కూడా రాయి” అని చెప్పారు. బాబా చెప్పినమీదటనే నేను నీకీ ఉత్తరరం వ్రాస్తున్నాను.

15 రోజుల తరువాత ఉపాసనీ తన భార్య, కొడుకుతో బాబాని దర్శించుకునేందుకు షిరిడీ వెళ్ళారు. ఉదయాన్నే కోపర్గావ్ లో దిగి గోదావరి నదిలో స్నానాలు కానిచ్చారు.

తొందరగా బాబా ఆరతి సమయానికి షిరిడీ చేరుకొందామనుకున్నారు. కాని టాంగా చాలా ఆలస్యంగా వచ్చింది. ఆరతి సమయానికి షిరిడి చేరుకోగలమా లేదా అని ఉపాసని సందేహించాడు.

ఇక్కడ షిరిడీలో బాబా శ్యామాతో “శ్యామా, ఆరతి ఇవ్వడం కాసేపు ఆపు. నీ స్నేహితుడు రావూజీ వస్తూ ఉన్నాడు. దారిలో ఉన్నాడు. అతను మనసులో ఆరతి చూద్దామనే కోరికతో వస్తూ ఉన్నాడు” అన్నారు.

ఉపాసనీ తన కుటుంబంతో ద్వారకామాయిలోకి అడుగు పెట్టగానే ఆరతి ప్రారంభమయింది.

బాబా ఉపాసనీ కుమారుడిని దగ్గరకు పిలిచి, “నువ్వు జ్వరంతో బాధపడుతున్నపుడు నీకు కలలో దర్శనమిచ్చాను. నన్ను గుర్తించావా?” అని అడిగారు.

రావూజీ, అతని కొడుకు ఇద్దరూ వెంటనే బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేసి సమయానికి వచ్చి సహాయం చేసినందుకు తమ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

ఈ సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.in ద్వార సేకరించడం జరిగింది.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా వారిని చూడగానే రావూజీకి ఉన్న ఆస్త్మా నెమ్మదించింది–Audio

Baba’s love is unconditional……!! Jai Sainath…!!!

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles