బాబా మహిమ – సరస్వతి కటాక్షం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: సారంగ్

నివాసం: నాగపూర్.

నా పేరు సారంగ్. మాది నాగపూర్. నేను మీ అందరితో నా అనుభవం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.

సాయి అనే పేరులోనే మొత్తం ప్రపంచం ఉంది. అయన మాట “సబ్ కా మాలిక్ ఏక్ హై”. అదే మా అందరికి శిరోధార్యం.

నా విద్యా  రికార్డ్ అంత మంచిదేమి కాదు. నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నాను.

దీనికి కారణం నాకు చదువు  పట్ల సరైన ఏకాగ్రత, నిబద్దత లేకపోవడం కావచ్చు. నేను 10th 1st  క్లాస్ లో పాస్ అయ్యాను. 12th 2nd క్లాస్ లో పాస్ అయ్యాను.

B.Sc  లో జాయిన్ అయ్యాను. కానీ ఇక్కడ కూడ నా చదువు సక్రమంగా సాగలేదు, 1st  ఇయర్ 2nd క్లాస్ లో పాస్ అయ్యాను.

ఒకరోజు ఆకస్మాత్తుగా శిరిడి వెళ్లాలనుకున్నాను. మా తండ్రి ఏమి సంకోచించకుండా అంగీకరించారు.

నేను మా తండ్రి 2006లో శిరిడి వెళ్ళాము. నేను బాబాతో బాబా ప్లీజ్ నాకు సహాయం చేయండి. నేను ప్రయత్నిస్తున్నాను  కానీ విజయం సాధించలేకపోతున్నాను అని చెప్పాను.

నా ప్రార్ధనను బాబా అంగీకరించారేమో! అకస్మాత్తుగా  నా జీవితం మారిపోయింది. అప్పటి వరకు అన్నిటిలో చివరలో ఉండే బాలుడు ఇప్పుడు  ప్రపంచానికి తన మేధాశక్తిని చూపిస్తున్నాడు.

ఇప్పుడు నేను రోజు హారతి పాడుతున్నాను. ఆ క్రమంలో నాలో ఏకాగ్రత పెరిగింది.

2006 నాటికీ B.Sc 2nd ఇయర్ లో నేను యూనివర్సిటీ ఐదవ ర్యాంక్ పొందాను. B.Sc 3rd ఇయర్ లో కూడా ఇదే విదంగా కొనసాగింది. అప్పుడు నాకు యూనివర్సిటీ మొదటి ర్యాంక్ వచ్చింది.

తరువాత M.Sc లో IIIT  చేయాలనుకున్నాను కానీ, ఇక్కడ ఒక అడ్డంకి ఎదురువచ్చింది. నాకు విద్య ఋణం పొందడానికి లేదు. బాబాని ప్రార్ధించాను.

నా సమస్య దానికదే పరిష్కారం అయింది. ఇప్పుడు నేను M.Sc 2nd సెమిస్టరులో ఉన్నాను. నేను ఈ సృష్టిలో ప్రతి దానిలో బాబా ఉనికిని అనుభూతి చెందుతాను.

బాబా మనకోసం ఉన్నారు. కేవలం మనం ఇవ్వాల్సింది రెండు. శ్రద్ద అంటే విశ్వాసం, సబూరి, అంటే సహనం.

ఇవి పాటించడం వల్ల వివిధ రకాల బాబా అనుభూతులు పొందాను.

సాయిభక్తుడు ఎవరైనా సరే కనీసం ఒక్క అనుభవంని అయినా పొంది ఉంటారని నా ఖచ్చితమైన నమ్మకం.

నా జీవితంలో సాయిబాబా నుండి వచ్చిన నిజమైన మాటలు. నువ్వు నన్ను ప్రేమిస్తే, నేను నిన్ను ప్రేమిస్తాను. నిన్ను ఎప్పటికి విడవను అని.

~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~

***సాయిసూక్తి:

“నేను అందరి రూపాలలో ఉన్నాను. సహాయం ఏ రూపంలో వచ్చిన తిరస్కరించకండి”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles