శతమానం భవతి…..సాయి@366 జూన్ 16….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిని ఆధ్యాత్మిక పరమైన కోర్కెలే కోరాలా? అక్కర లేదు.

భౌతిక పరమైన కోర్కెలను కోరుకోవచ్చును గదా! అవి ఎటువంటివి అయి ఉండాలి అనేది సాయితో సమస్య కాదు. కోరిక విచిత్రమైనది కావచ్చు.

ఇండోర్‌ రాజ సంస్థాన్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు దామోదర్‌ జోగ్లేకర్‌.

ఈయన సాయిని గూర్చి విన్నాడు. 1916లో షిరిడీ వచ్చి సాయిని దర్శించాడు.

తాను నిండు నూరేళ్ళు జీవిస్తే, వేయి నొక్క రూపాయలను దక్షిణగా ఇస్తానని సాయి బాబాకు మ్రొక్కు కున్నాడు.

సాయి అవుననడు,

కాదనడు.

”అల్లా అచ్ఛా కరేగా” అంటాడు.

ఇది సాయి సాహిత్యంలోనే విచిత్రమైన మ్రొక్కు.

సాయి మహా సమాధి చెందారు.

సాయి అతని కోర్కె తీర్చేనా?

1979 జూన్‌ 16 నాటికి దామోదర్‌ జోగ్లేకర్‌కు నూరేళ్ళు నిండాయి. మరి సాయి మొక్కు ఆయనకు జ్ఞాపకం  ఉన్నదా? ఆయనకు జ్ఞాపకం ఉన్నదో లేదో తెలియదు గాని, కాల స్వరూపుడైన సాయికి మరుపు ఉండదు.

అదే రోజు రాత్రి దమోదర్‌ జోగ్లేకర్‌కు స్వప్నం వచ్చింది. సాయిబాబా ఆ సమయంలో దామోదర్‌కు మొక్కు విషయం గుర్తు చేశాడు.

అంతే కాదు దాదర్‌లోని అక్కల్‌కోట స్వామి మఠంలో ఆ మ్రొక్కును చెల్లించ మన్నారు. కల ముగిసింది.

61 ఏండ్ల క్రితం మహా సమాధి చెందిన సాయి, ఏ నాటి మొక్కునో గుర్తు చేశాడంటే తాను శాశ్వతుడనని, అనుక్షణం భక్తుని గుర్తుంచు కుంటాడని తెలపటమే గాని వేరు కాదు.

ఇంకా తాను అక్కల్‌కోట మహారాజ్‌ వేరు కాదని తెల్పటమే. మొక్కును మొక్కటం కాదు, తీర్చాలనే తహతహ కూడా ఉండాలి.

మనం చేసిన మొక్కులను మనం మర్చి పోయినా గాని సాయి గుర్తు చేసి మనను రుణ గ్రస్తులు కాకుండాను అసత్య దోషం నుండి కాపాడును.

సాయినాథుడు మనందరకు నిండు నూరేండ్ల సుఖ శాంతిమయ జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్ధిద్దాం. సాయి మనకిచ్చిన జీవితాన్ని సాయి సేవకే వినియోగించు కుందాం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles