ఔనా! నిజమేనా?…..సాయి@366 జూన్ 17….AudioSai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai BabaVoice Support By: Mrs. Jeevani


సాయిబాబా ఎందరినో రక్షిస్తూంటారు. ఒకొక్కసారి సాయిబాబా నోటివెంట తానెవరిని రక్షించింది తెలుస్తుంది.

అక్కడున్న వారు కుతూహలంకొద్ది, ఆయా వ్యక్తులను ఆయా అనుభవాలు కలిగాయా లేదా అని అడిగి తెలుసుకోవటం జరిగేది.

ఒకొక్కసారి తాను ఎవరిని కాపాడింది తెలియదు. కాపాడిన సంకేతాలను బట్టి సాయి కాపాడాడు అనుకోవాలి.

ఎవరైతే కాపాడబడ్డారో, వారు వచ్చి సాయికి ధన్యవాదాలు చెప్పుకున్న తరువాత గాని సాయి ఎవరిని కాపాడారో తెలియదు.

ఒకసారి నానా సాహెబ్‌ చందోర్కరు, ముకుంద్‌ శాస్త్రి లేలేలు ఒక గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్నారు.

ఉన్నట్టుండి గుర్రం వెనక కాళ్ళమీద లేచింది. టాంగా దూరంగాపోయి పడ్డది.

అదే సమయాన సాయిబాబా భక్తులతో ద్వారకామాయిలో మాట్లాడుతున్నారు.

సాయిబాబా ”నానా చనిపోబోనున్నాడు. కాని, నేనతన్ని చావనిస్తానా?” అన్నారు.

వినేవారికి ఆ మాటలు అర్థమయ్యింది. అక్కడెక్కడో నానా సాహెబ్‌ చందోర్కర్‌ ఆపదలో చిక్కుకున్నాడని. సాయిబాబా కనుక ఆ క్షణంలో ఆ మాట అనకుంటే, నానా సాహెబ్‌ మరణించి ఉండేవాడు.

అయితే ఆయన వెంట ఉన్న లేలేకు ఏమయ్యేదో తెలియదు. సాయి కృప వలన వారిద్దరు బ్రతికి బట్టకట్టారు.

కొంతకాలం గడిచింది.ఆ ఇద్దరూ ద్వారకామాయికి వెళ్ళారు. సాయికి నమస్కరించారు.

అక్కడే బాపూ సాహెబ్‌ జోగ్‌ ఉన్నాడు. నానాను గూర్చి కొద్ది రోజుల క్రితం సాయి పలికిన మాటలను చెప్పి, ”అది నిజమేనా?” అని అడిగాడు. వాస్తవాలను జోగ్‌కు చెప్పారు వారు.

అలా ప్రశ్నించటం సాయి మీద నమ్మకం లేక కాదు సాయి మహత్తును మరోసారి వారి నోటి నుండి వినాలని.

ఈ సమాచారాన్ని నానా సాహెబ్‌ కాలం చేసిన తరువాత లేలే శాస్త్రి జూన్‌ 17న (1936)లో శ్రీ నరసింహ స్వామికి చెప్పాడు.

ఇంకా లేలే, సాయికి సంస్కృత భాష వచ్చునని, తనచే నారాయణోపనిషత్తులోని తైత్తరీయ భాగాన్ని చదవమని ఆదేశించారని చెప్పాడు.

ఆయన దానిని సాయి సన్నిధిలో చదివాడు పది రోజులపాటు. ఆయనకు దానిపై చక్కని అవగాహన వచ్చింది.

కాకా సాహెబ్‌ దీక్షిత్‌కు కూడా బోధించసాగాడు. సాయిచే పఠింపుమని ఆదేశింపబడ్డవారికి అవగాహన పెరుగుతుంది, ఉదాహరణకు శ్యామా, నిమోన్‌కర్‌ మొదలైన వారు.

సాయి మనలను పఠింపుమనే ఆదేశం కోసం ఎదురుచూద్దాం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles