గృహమే సాయి మందిరం!…..సాయి@366 జూన్ 22….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


శ్రీ ప్రహ్లాద్‌ హుల్యాల్‌కర్‌ గారి తాత గారు, తండ్రి గారు కూడా సాయి భక్తులే. ఒకనాడు వారింటికి షిరిడీ యాత్రచేసి ప్రసాదమును ఇచ్చుటకు ఒక స్నేహితుడు వచ్చినాడు.

ప్రహ్లాద్‌ గారి భార్య అతనితో ”షిరిడీ నుండి సాయిబాబాను మా ఇంటికి ఎందుకు తీసుకురాలేదు?” అని నవ్వుతూ అడిగింది. ఆ స్నేహితుడు కూడా నవ్వుతూ ”మార్గ మధ్యములో ఉన్నారు” అని చెప్పాడు.

ఇది జరిగిన ఒకటి, రెండు రోజులయినది

ఒకనాటి రాత్రి ప్రహ్లాద్‌ గారి భార్యకు స్వప్నంలో ”నీ భర్త సోదరుడు వచ్చుచున్నాడు, నీవు వెంటనే ఒక రొట్టె పెట్టి దృష్టి దోషము తొలగించు” అను స్వరము వినబడినది. ఆమె అట్లే చేసినది.

ఇంకా కాషాయ వస్త్రములు ధరించిన సాయిబాబా వారి గృహములో ప్రవేశించినాడు. స్వప్నము ముగిసినది.

అది జూన్‌ 22వ తారీకు (1977).

మధ్యాహ్నం అందరూ నిద్రిస్తున్నారు. ఇంతలో ఎవరో తలుపు తట్టినట్టయినది. అందరూ నిద్ర లేచినారు. తలుపు తెరవగా ఇంటి ముందు రెండు కార్లు ఆగి ఉన్నాయి. సుమారు 25 మంది వచ్చారు.

వారిలో ఒకరు ”మిమ్ములను చూచుటకు వచ్చాము” అన్నాడు. వారినందరిని గృహములోపలకు ఆహ్వానించి కూర్చుండబెట్టారు.

ఆబాజీ పన్సీకర్‌ అనే వ్యక్తి ప్రహ్లాద్‌తో ”మాస్టర్జీ! ఈ సాయిబాబా విగ్రహమును మందిరములో ప్రతిష్టించవలెనని తెచ్చితిమి.

ఇంకను మందిరములో ఏర్పాట్లు పూర్తి కాలేదు. నేటి నుండి రెండవ రోజున మంచి ముహుర్తమున్నది. కనుక ఈ ఒక్క రాత్రికి ఈ విగ్రహమును మీ ఇంట్లో ఉంచాలనే తలంపుతో తెచ్చినాము” అన్నాడు.

అందుకు ప్రహ్లాద్‌ సంతోషముతో అంగీకరించాడు.

సాయినాథుని విగ్రహాన్ని అక్కడ ఉంచి వెళ్ళిపోయారు వచ్చినవారు. ఆ కుటుంబంలోని పిల్లలు ఆ విగ్రహాన్ని చూస్తూ ”బాబా నీవు మావాడివైతే మా ఇల్లు విడిచి పెట్టి వెళ్ళవు” అన్నారు.

మందిరములో అనేక అడ్డంకులు కలుగుతున్నాయి. ఈలోగా ఎందరో ప్రహ్లాద్‌గారి ఇంటికి వచ్చి సాయిని దర్శించసాగారు.

అందరూ కలసి అబాపాన్సీకర్‌ను కోరగా సాయి విగ్రహమును ప్రహ్లాద గారి ఇంట్లోనే ఉంచుటకు అంగీకరించెను. ప్రహ్లాద్‌ గారి భార్య, పిల్లలు కోరినట్టు సాయిబాబా, ప్రహ్లాద్‌ గారింటికి వచ్చాడు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles