Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
కాకడ ఆరతి మొదలు పెట్టక ముందే సాయినాథునికి ముచ్చటగా మూడు గీతాలు వినిపిస్తారు. ఆ మూడు గీతాలలో చివరది ”ఓం జయ జగదీశ హరే!” అనే గీతం.
ఈ గీతాన్ని భారతదేశంలో వినని వారుండరు అంటే అతిశయోక్తి కానే కాదు.
దేవాలయాలలోనే కాదు, మందిరాలలోనే కాదు, గృహాలలో కూడా ఈ గీతం వినిపిస్తుంది.
అతి కొద్ది మార్పు చేర్పులతో లక్ష్మీ, శివ మొదలైన దైవాలకు అనుగుణంగా వర్తింప చేసేటట్లు మార్చి ఆరతి ఇస్తారు. దైవం ఏ రూపంలోనున్నా ఒకడే గదా!
ఈ గేయ రచయిత మరణశయ్యపై ఉన్నాడు. అప్పుడు ఆయన ‘‘భారత దేశంలో హిందీ రచయితలు ఇద్దరున్నారు. నేటి నుండి ఒక్కరే ఉంటారు” అని తాను ఒక సుప్రసిద్ధ హిందీ రచయితగా మాట్లాడాడు.
అలా ఆయన మాట్లాడటం గర్వం, అహంకారాలతో కూడినది కాదు. అది సత్యమే అంటారు ఎందరో సాహితీ వేత్తలు.
ఆ గేయ రచయిత పేరు శ్రీ శ్రద్ధారాం ఫిలౌరీ ఆయన మరణించినా ఆయన కీర్తి అజరామరమే.
ఆయన 24 జూన్ 1881లో జన్మించారు. జన్మతః హిందువు. సిక్కు మతస్థురాలు ఆయన సతీమణి.
శ్రీ శ్రద్ధారాం హిందీ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పరచు కున్నాడు. హిందీ భాషలోని మొదట నవల ‘భాగ్యవతి’ని రచించాడాయన.
అసలు విషయం అదే కాదు. ఈ నవలను పెండ్లి అయిన తర్వాత కూతురుకు సారెగా ఇచ్చి పంపేవారు పుట్టింటి వారు. అంతటి గొప్ప నవల అది.
శ్రీ శ్రద్ధారాం సంస్కారవంతుడు. ఆడ శిశువు పుట్టటం నేరం కాదని, ఆడ మగ శిశువులకు తేడా ఏమీ ఉండదని ఆయన అందరికి ఉద్బోధ చేసేవాడు.
పాఠకులను ఉత్తమ సంస్కారవంతులుగా చేసే సంస్కారం ఈ శ్రద్ధారాంది.
ఇంకా, ఈయన రచించిన ”పంజాబీ బాత్ చిత్” అలనాటి బ్రిటిష్ హయాంలోని ఐ.సి.ఎస్. అధికారులకు అది పరీక్షా గ్రంథం.
శ్రీ శ్రద్ధారాం ఫిలౌరీ గీతం ”ఓం జయ జగదీశ హరే …” అనేక చలన చిత్రాలలో కూడా చోటు దక్కించుకుంది.
జగదీశుని మనసారా కీర్తించే ఆ గీతాన్ని విని, మనం ఆ రచయిత శ్రీ శ్రద్ధారాం ఫిలౌరీని మనసారా స్మరిద్దాం.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఇంటింటికి సాయి పత్రిక…..సాయి@366 జూన్ 1….Audio
- సచ్చరిత్ర పారాయణ ఫలం …..సాయి@366 జూన్ 18…Audio
- ఓం జయ జగదీశ హరే…. మహనీయులు – 2020… సెప్టెంబరు 30
- శ్రద్ధా భక్తులు …..సాయి@366 అక్టోబర్ 20…Audio
- ఒదుగుతూ ఎదగాలి …..సాయి@366 జనవరి 24….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments