సాయి స్తవన మంజరి…..సాయి@366 సెప్టెంబర్ 9….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


ఇరువది దినములలో ఉమా సహస్రమును స్తవనరూపమున లిఖింతునని, అటుల పూర్తి చేయకున్న గ్రంథమును చించివేయుదునని కావ్యకంఠ గణపతి ముని ప్రతిజ్ఞ చేశారు.

గంటము పట్టు వ్రేలిపై గోరుచుట్టు ఏర్పడి వ్రాయుట మందగించెను. ఇక చివరి దినమున 250 శ్లోకములను పూర్తి చేయవలయును.

అయిదుగురు లేఖకులను ఏర్పరచుకొని, ఒకొక్కరికి 50 శ్లోకములు చెప్పి పూర్తి చేసినాడు గణపతి.

అప్పటివరకు గణపతి వెనుక ఉండిన రమణ మహర్షి సమాధి నుండి లేచి ”నాచే చెప్పబడినదంతయు వ్రాసి కొంటిరా” అని ప్రశ్నించారు.

 గణపతి ”చిత్తము. అట్లే గ్రహించి గ్రంథమును ముగించితిని” అన్నారు మహదానందంతో.

స్ఫురింపచేయున దెవరు? వ్రాసుకొను వారెవరు? ఈ సత్య అవగాహనతో వెలువడిన ఏ స్తవనమైనను మహా మహిమాన్వితమే అగును. అట్టిదే దాసగణు కృత శ్రీ సాయినాథ స్తవనమంజరి.

దాసగణు ”ఈ స్తోత్రంలోని ప్రతీ పదాన్ని శ్రీ సాయినాథులు నా మనసులో ప్రవేశించి పలికించారు” అని వ్రాస్తారు.

ఇక ఆ స్తవనము పఠించువారల ఐహిక కోర్కెలను గురుదేవులు వెంటనే తీర్చి, చివరగా ఉత్తమ గతిని ప్రసాదిస్తారు అంటారు దాసగణు. ఎవరు మాత్రం కాదనగలరు?

గణపతి రావు దత్తాత్రేయ సహస్రబుద్దే కేవలం నానా సాహెబ్‌ చందోర్కరు అనే అధికారిని సంతోషపరచేందుకే  షిరిడీలో సాయిని దర్శించాడు.

మట్టిని మణిగా మార్చాడు సాయి. వీధి బడిలో చదివి, లల్లాయి పాటలు పాడి, లల్లాయి పదాలు వ్రాసే దాసగణులో నిలువెత్తు మార్పు తెచ్చాడు సాయి.

దాసగణుకు పుత్ర సంతానం లేదు. సాయిని మగ సంతానం ప్రసాదింపుమని కోరలేదు. భార్యకు పిచ్చి. భార్య పిచ్చి కుదర్చమని సాయిని కోరలేదు.

తన గురువు ద్వారా సంక్రమించే ఆస్తినే ఆయన వదులుకున్నారు. చివరకు హరి కథలు చెప్పేటప్పుడు ఆరతి పళ్లెంలో కాసులు వేయవద్దనే వాడు.

షిరిడీ వెళ్ళి ప్రత్యక్ష దైవం సాయిని దర్శించి అనుభూతి చెందమనే వారు హరికథలో.

సాయి దాసగణుకు హరి కథకునిగా మాత్రమే ప్రజ్ఞ నివ్వలేదు. అనేక రచనలను దాసగణు చేశాడు.

వాటిలో కొన్ని విశ్వవిద్యాలయాలకు పాఠ్య  గ్రంథమయ్యాయి. దాసగణు ఈ సాయినాథ స్తవనమంజరిని నర్మదా నదీ తీరాన, మహేశ్వర క్షేత్రంలో 1918 వినాయక చవితినాడు పూర్తిచేసి సాయి సన్నిధిలో వినిపించాడు.

సాయి తన్మయత్వంతో ఆలకించాడు. ఈనాడు 9 సెప్టెంబరు. 1918న ఇదే రోజు ఆ మహా రచనను దాసగణు పూర్తిచేశారు. అందరం స్తవనమంజరి పారాయణ చేద్దాం సాయికి దగ్గరవుదాం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By:  Mr:  Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles