Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sri Ram
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 22
పవిత్రమైన సాయి సచ్చరిత్రను భక్తి శ్రధ్ధలతో పారాయణ చేసినందువల్ల కలిగే ఫలితాన్ని గురించి ఫల శృతిగా సాయి సచ్చరిత్ర 51 వ అధ్యాయములో వివరంపబడింది.
సాయి మీద ప్రేమతో, నమ్మకంతో పారాయణ చేసిన వారి కష్టాలన్ని తొలగిపోతాయని చెప్పబడింది.
వారము రోజులలో పారాయణ పూర్తిచేసిన తరువాతనించీ ఆయననే పూజిస్తూ ఉంటే కనక మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి, ప్రాపంచిక కోరికలన్ని కూడా తీరతాయని చెప్పబడింది.
ప్రతీరోజు సాయి సచ్చర్తిత్రలోని ఒక అధ్యాయాన్ని చదవడం నా దినచర్యలో ఒక భాగం. 51 అధ్యాయాలను పూర్తిచేసిన ప్రతీసారి నాకెంతో మనశ్శాంతి లభించి ఆనందం కలుగుతూ ఉండేది.
నా నమ్మకం ఇంకా పెంపొందడానికి ఏదొ ఒక సంఘటన జరుగుతూ ఉండేది. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది ఒక విచిత్రమైన మరచిపోలేని అనుభూతి. సాయితో సాయి బా ని స అనుభవాలలో ఇది ఆఖరిది.
దక్షిణ కొరియాలో నాకు జరిగిన అనుభవాలలో ఒకదానిని నేను మీకిప్పుడు వివరిస్తాను. 15.05.1991 న నేను చాంగ్వాన్ పట్టణంలో ఉన్నప్పుడు, శ్రీ సాయి సచ్చరిత్రలోని 51 వ అధ్యాయం చదవడం పూర్తి చేశాను.
ఆ రోజు రాత్రికి మిస్టర్ లీ అనేఆయన నన్ను నా స్నేహితుడిని భోజనానికి పిలవడంతో ఆయన యింటికి వెళ్ళాము. వారింట భోజనమయిన తరువాత మిస్టర్ లీ గారు మమ్మలని తన కారులో మా హోటలు వద్ద దింపారు.
భోజనానంతరము కారులో నాకు కలిగిన ఆలోచనలు మీకు తెలియపరుస్తాను.
ఈ రోజున శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ పూర్తి చేశానె, మరి నాకు ఏవిధమయిన అనుభూతిని బాబా ప్రసాదించలేదే అని బాధడినాను.
మేము హోటలు ముందు కారు దిగిన వెంటనే మిస్టర్ లీ గారు ఒక కొత్త ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన విన్న వెంటనే నేను ఆశ్చర్య పోయినాను.
ఆ ప్రతిపాదన ఏమిటంటే అక్కడకి దగ్గరలో ఉన్న కొండమీద బౌధ్ధ దేవాలయము ఉంది. మేము అనుమతించినచో మమ్ములను ఆ దేవాలయమునకు తీసుకుని వెళ్ళాలని ఉందని తెలియచేయడము.
ఆ దేవాలయము రాత్రి 10 గంటలకు మూసివేసెదరు. అందుచేత వెంటనే తిరిగి కారు యెక్కినచో తను మమ్ములను ఆ దేవాలయమునకు తీసుకుని వెడతానని చెప్పినారు.
నేను నా మితృడు శ్రీనివాసరావు తిరిగి ఆ కారులో కూర్చున్నాము. మిస్టర్ లీ గారు కారును గంటకు వంద కిలోమీటర్ల వేగముతో నడుపుతూ రాత్రి 10 గంటల ప్రాంతానికి ఆ దేవాలయము వద్దకి తీసుకుని వెళ్ళినారు.
ఆ దేవాలయములో తెల్లని వస్త్రాలను ధరించిన బౌధ్ధ లామాగారు, మాకు స్వాగతము పలకడానికి ముఖద్వారము వద్ద వేచి ఉన్నట్లు భావన కలిగింది.
ఆ బౌధ్ధ దేవాలయము నా కంటికి ద్వారకామాయిలా కనిపించినది. ఆ బౌధ్ధ లామాగారిలో నేను బాబాగారిని చూడగలిగాను. బౌధ్ధలామాగారి పాదాలకు నేను నమస్కరించాను.
ఆయన ప్రేమతో నన్ను లేవనెత్తి కౌగలించుకున్నారు. మమ్ములను మందిరములోనికి తీసుకునివెళ్ళి మాకు గ్రీన్ టీ (తేనీరు) ఇచ్చినారు.
మమ్ములను భారతీయులుగా గుర్తించి తనకు బుధ్ధదేవునితో ఉన్న అనుభవాలను తెలియచేసినారు. బుధ్ధ దేవుని ఆశీర్వచనాలతో మాకు వెండి డాలరులను బహూకరించినారు.
యిదంతా శ్రీ సాయినాధులవారు నేను శ్రీ సాయి సచ్చరిత్ర 51 అధ్యాయాలు పారాయణ చేసిన ఫలముగా భావించినాను.
ఆనాటినుండి నేటి వరకు ఆ వెండి డాలరు నా మెడలో ధరించాను. అది ఈనాటివరకు నా మెడలోనే ఉన్నది.
ఆ వెండి డాలరుని చేతితో తాకినపుడెల్లా శ్రీ షిరిడీ సాయినాధుల వారు దక్షిణ కొరియా దేశములో నాకిచ్చిన బహుమానముగా భావిస్తూ ఆనందము పొందుతున్నాను.
రేపు తరువాయి భాగం…..
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- నాగుండెలో మూడు ఆర్టరీలలో బ్లాక్స్ ఉన్నట్లుగా తేలింది–Sree Gopal Rao–19–Audio
- శ్రీ సాయి నన్ను బాధ్యతలను నిర్వర్తించే సన్యాసీ అని పిలిచినారు-Sree Gopal Rao–21–Audio
- ఒక పట్టు ధోవతీని బహూకరించమని ఆదేశించారు–Gopal Rao–14–Audio
- నా తరఫున మీరు శ్యామాను మీతో తీసుకుని వెళ్ళండి– Sree Gopal Rao — 9–Audio
- భక్తుల కోరికలను యెల్లప్పుడూ తీర్చడానికి సిధ్ధంగా ఉంటారు.-Sree Gopal Rao–20–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments