Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మెహర్ బాబా తెలిపిన పంచ సత్పురుషులలో ఒకరు బాబా జాన్. వేరొకరు సాయిబాబా.
బాబా జాన్ అసలు పేరు గుల్ రుఖి – అంటే అందమైన చెక్కిళ్లు కలది అని అర్ధము. సాయి కూడా మోహన రూపుడే.
బాబా జాన్ కు వివాహం చేసుకోవటం ఏ మాత్రం ఇష్టం లేదు. వివాహ దినం దగ్గర పడగానే, ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది.
ఆమె హృదయం ఆధ్యాత్మిక చింతనలోనే ఉండేది. ఆమె ఒక హైందవ గురువు ఆదేశం ప్రకారం మక్కా, మదీనాలను దర్శించింది.
ఆమె యాత్ర చేసే సందర్భంలో తుఫాన్ తాకిడికి ఒక ఓడ సర్వనాశనమయ్యేది. బాబా జాన్ చేసిన ప్రార్థనల వల్ల అందరూ బ్రతికి బట్ట కట్టారు.
ఆమె దైవంతో తాదాత్మ్యం చెందినప్పుడు, ఆమె మాట్లాడే మాటలు మత విరుద్ధంగా ఉన్నాయని బెలూచీ సైనికులు ఆమెను సజీవ సమాధి చేశారు.
అయితే కొంత కాలం తరువాత ఆ సైనికులు ఆమెను పూనాలో గుర్తించారు. వారే మొదటగా బాబా జాన్ కు శరణాగతి చెందిన వారు.
ఆమె పూనాలో ఒక వేప చెట్టు క్రిందే ఉండేది. అక్కడే ఆమె అనేక లీలలు, మహత్తులు చూపింది.
ఒకనికి గుర్రం ఉంది. గుర్రాన్ని పోగొట్టుకున్న వ్యక్తి, ఆమెను గుర్రపు జాడ అడిగారు. “నేరుగా గుర్రం కనిపించేంత వరకు పో” అంది. అతడు అలాగే చేశాడు. గుర్రం దొరికింది.
ఒక రోజు అర్ధరాత్రి సమయంలో ఆమె “మంటలు, తలుపులు వేసి ఉన్నాయి. జనులు తగలబడి పోతున్నారు” అంటూ ఉద్రేకంగా కేకలు వేయసాగింది. ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు.
పూనాకు దగ్గరలో ఉన్న తాలేగాం అనే ఊరిలో ఒక సినిమాకు ఎందరో జనం వచ్చారు. ఆ తాకిడికి తట్టుకోలేక యజమానులు హాలుకు తాళాలు వేశారు.
అనుకోకుండా హాలు అగ్ని ప్రమాదానికి గురైంది. లోపల జనం భయంతో గగ్గోలు పెడుతున్నారు. ఉన్నట్లుండి హాలు తలుపులు తెరుచుకున్నాయి.
ఎందరో బయటకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంతకూ, ఆ ప్రాణాదాత బాబా జాన్ అని తరువాత తెలిసింది అందరకూ.
ఆమె ఎంతటి వారినైనా నా బిడ్డ అని చెప్పుకునేది. ఆమె మహిళ అగుటచే ‘అమ్మా’ అని సంబోధించే వారు భక్తులు, సందర్శకులు. ఆమె తనకన్న మిన్న యగు వారు పురుషులలో ఎవరున్నారు. అనేది.
ఒకసారి బాబా జాన్ చేతి వ్రేలికి గాయమైంది. రక్తం, చీము కారసాగాయి.
ఎవరో నాసిక్ నుండి వచ్చిన భక్తుడు “బోరిక్ పౌడరు చల్లితే బాగుంటుంది” అని సలహా ఇచ్చాడు. “ఏమిటి, నన్ను ఫకీరుగా ఉంచరా?” అని ప్రశ్నించింది.
ఫకీరు దేనినీ పట్టించుకోడు. ఆధునిక సమాజం ఆ ఫకీరు సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తించరాదని ప్రజలకు ఆమె హెచ్చరించింది.
ఆమె సెప్టెంబర్ 21, 1931న మహాసమాధి చెందింది పూనాలో. నేడు ఆమె వర్థంతి.
ఆమెను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- బాబా …..సాయి@366 జనవరి 28….Audio
- తగిన బిడ్డలు…..సాయి@366 సెప్టెంబర్ 21…Audio
- దర్బార్ సాయి మందిరం …. మహనీయులు – 2020… జూలై 6
- బుద్ధునకు షరతులా!? …. మహనీయులు – 2020… సెప్టెంబరు 2
- బోధనలే మతం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 28
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments