శ్రీ దత్త శరణం మమ…. మహనీయులు – 2020… సెప్టెంబరు 27



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


బ్రహ్మానంద సరస్వతి పూర్వ నామం గోవిందరాజు రామప్ప. ఈయన సెప్టెంబర్ 27న 1863లో జన్మించారు.

దత్త సంప్రదాయం, ఆంధ్ర దేశంలో వ్యాప్తి చెందటానికి కృషి చేసిన మహనీయుడు.

సాయి సచ్చరిత్రలో రాజమహేంద్రవరంలో వాసుదేవానంద సరస్వతి దాసగణు ద్వారా ఒక టెంకాయను పంపుట, లిఖించబడింది.

బ్రహ్మానంద సరస్వతి అప్పుడప్పుడు నర్సోబావాడి పోయి వాసుదేవానందుల వారిని కలిసెడి వాడు.

వాసుదేవానందుల వారిని బ్రహ్మానందస్వామి రాజమహేంద్రవరమున కలిసి “ఈ రోజు పరమేశ్వరుని అనుగ్రహము వలన మీ దర్శనం లచించినది.

ఇచట గల శంకరాచార్యుల వారి మఠములో మీ చేత దత్త మూర్తి పాదుకలను ప్రతిష్టింప చేయవలయునని నా అభిలాష. మీరు నా ప్రార్ధనను మన్నింతురని ఆశించుచున్నాను” అని వేడుకున్నారు.

మహారాజ్ (వాసుదేవానందస్వామి) అంగీకరించారు. ఆ మఠములో మాఘ పొర్ణమి దినమున దత్తమూర్తిని మహారాజ్ ప్రతిష్టించారు.

అంతవరకు ఏక ముఖముగా దత్తుని ప్రతిష్టించిన మహారాజ్, బ్రహ్మానందుల కోర్కెతో మూడు ముఖములు గల దత్తుని ప్రతిష్టించెను. దత్తాత్రేయస్వామి నామము “భక్తవత్సలుడు”.

ఇక వాసుదేవానందులు, రెండు రోజులకు సమాధి చెందుతారనగా, బ్రహ్మానంద సరస్వతులు, గాండా మహారాజుకు స్వప్నమున కనపడి వెంటనే తాను గరుడేశ్వర్ వస్తున్నానని, తరువాత కార్యక్రమమును నిర్వహిస్తానని చెప్పారు.

అటులనే బ్రహ్మానందులు విద్యానంద తీర్థులను గరుడేశ్వర్ కు రమ్మని చెప్పినారు.

అక్కడ వాసుదేవానందులను వారు నర్మదా జలాలలో సమాధి చేశారు.

వాసుదేవానందుల ఆజ్ఞచే తన కీయబడిన వేలకువేల బంగారు నవరసలు, వెండి నాణెములను తీసుకుని, వాటిని సద్వినియోగం ఎలా చేయాలో చెప్పారు బ్రహ్మానందులు.

ఒకసారి తాము ప్రయాణము చేయుచున్న రైలుబండి ఆగిపోగా, ఇంజను డ్రైవరు ఎంత ప్రయత్నించినను కదలలేదు.

అప్పుడు బ్రహ్మానందస్వామి తన దండముతో ఇంజనులో ఒక భాగముపై కొత్తగా, ఇంజను పనిచేయుట ప్రారంభించింది.

ఈ విషయాన్ని చెప్పటానికి, డ్రైవరు గార్డు పెట్టెలోనికి వెళ్లగా, గార్డు స్థానంలో బ్రహ్మానంద సరస్వతి ధ్యానంలో ఉన్నారు. ఈ వింతకు అందరూ ఆశ్చర్యపోయారు.

మరొకసారి బొంబాయిలో ఒకేసారి బ్రహ్మానందులను ఎనిమిది మంది భిక్షకు ఆహ్వానించారు.

బ్రహ్మానందులు అందరకు రేపు పదకొండు గంటలకు వస్తామన్నారు. అయితే బ్రహ్మానందులు ఎవరింటికి వెళ్తారు? అనేది ప్రశ్న.

ఎవరి అభ్యర్థనను అయన అంగీకరించినట్లు? మరునాడు 11 గంటలకు అందరిండ్లకు భిక్షకు వెళ్ళారు బ్రహ్మానందులు.

సాయి ఒకేసారి ద్వారకామాయిలోనూ, డేంగ్లే పొలంలోను కనబడ్డారు.

బ్రహ్మానందులు అనేక ఇతర రచనలతోపాటు “శ్రీ దత్త శరణం మమ” అనే శీర్షికతో 108 శ్లోకాలను సంస్కృతంలో రచించారు.

నేడు సెప్టెంబర్ 27 బ్రహ్మానందుల జయంతి. బ్రహ్మానందులను స్మరించెదము గాక!

“శ్రీ దత్త శరణం మమ…”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles