Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మన మనసులో ఏముందో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఖచ్చితంగా బాబాకి తెలుస్తుంది.
మనం మనసులో అనుకొన్న చిన్న చిన్న కోరికలను సైతం బాబా నేరవేరుస్తాడు. నేను ఏ బాబా గుడికి వెళ్ళినా అక్కడ హారతి సమయానికి కనుక అక్కడ ఉంటే, హారతి నేను పాడాలి అనుకుంటాను.
చాలా గుళ్ళల్లో అలా నేను హారతి పాడటం జరిగింది. అలాగే ఒక సాయంత్రం పూట ఇంట్లో అందరమూ ‘దేశముఖ్“సాయి బృందావనంకి వెడదాం అనుకున్నాం.
ఎక్కడైనా హారతి పాట పాడటం కుదురుతుందేమో కాని దేశముఖ్ సాయి మందిరంలో మాత్రం అవదు, ఎందుకంటే అక్కడ పూజారులు ఉంటారు, మరియు ఆశ్రమంలో వుండే వృద్దులు ఉంటారు,
వారిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా అక్కడ ఉండేవారే హారతి పాట పాడతారు. అలాంటప్పుడు మనకు అవకాశం రాదు.
సరే వెళ్ళాము. అప్పుడే సాయంత్రం హారతి అయింది, నామం జరుగుతోంది, అక్కడ నామంలో కూర్చున్నాము. భోజనాలు చేశాము.
శేజ్ హారతి సమయం అయింది,బాబా ముందు నిలబడ్డాము,ఎవరూ రాలేదు, అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది.
పూజరిగారు బయటికి పనిమీద వెళ్ళారట. వృద్దులు కూడా ఎవరూ లేరు. అందుకే నాకు అవకాశం ఇచ్చాడు బాబా. మనసారా హారతి పాడాను.
ఆ మధ్య నేను నిజాంపేట్ లో పనికోసం వెడుతూ ఉండేవాడిని, అక్కడ మా అత్త కూతురు ఉంది.
వాళ్ళ ఇంటికి వెడుతూ ఉండేవాడిని, వెళ్ళినప్పుడల్లా ఇక్కడ దగ్గరలో “బాబా గుడి లేదా అని అడుగుతుండేవాడిని.
ఒక రోజు హడావిడిగా అఫీస్ పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు, వదినని ఒకసారి చూసి వద్దామని వెళ్లాను.
కాసేపు కూర్చుని బయలుదేరి వచ్చేసేటప్పుడు చెప్పింది, ‘“ఒరేయ్ ప్రమోద్ నువ్వు ఎప్పుడూ ఇక్కడ “బాబా” గుడి లేదా అని అడుగుతూండే వాడివిగా మొన్ననే నాలుగురోజుల క్రితం ఇక్కడే ఒక బాబా విగ్రహం ప్రతిష్ట చేశారు’ అని చెప్పింది.
అంతే బ్యాగ్ అక్కడ పడేసి ఎక్కడో కనుక్కొని ఆ గుడికి వెళ్ళాను. సినీ యాక్టర్ శ్రీ చిట్టిబాబు గారు కట్టించిన గుడి అది.
నేను వెళ్ళే సమయానికి మధ్యాహ్న హారతి మొదలవబోతోంది. నేను నా ధోరణిలో హారతి పాడాను. జనం ఎవరూ పెద్దగా లేరు.
నేను హారతి పాడటం ఒక కమిటి మెంబెర్ గమనించింది. నేను మరల సాయంత్రం హారతికి కూడా వెళ్ళాను.
మద్యాహ్నం నన్ను గమనించిన ఆ కమిటి మెంబెర్ నన్ను పిలిచింది, మైకు నా ముందు పెట్టి నువ్వు పాడు బాబూ అంది. నాకు చాలా ఆశ్చర్యమూ, ఆనందమూ రెండూ కలిగాయి.
నేను ఎప్పుడు నిజాంపేట్ కి వెళ్ళినా ఆ గుడికి వెళ్తూంటాను. వాళ్ళు నన్ను గుర్తు పట్టి నా చేత హారతి పాట పాడించుకుంటారు.
ఓక ఏడాది జనవరి ఒకటోతారీఖున నేను కాకడా హారతి పాడాలనుకొని గుడికి వెళ్ళాను. ఆ రోజు పూజారి వేరే పూజలో ఉండటం మూలాన ఉదయం కాకడా హారతి ఆయన చేయలేక నాకు అప్పజెప్పారు.
నాకు ఆశ్చర్యమూ, ఆనందమూ రెండూ కలిగాయి. ఇలా నేను ఎక్కడ హారతి పాడాలనుకుంటే అక్కడ నాచేత హారతి పాడిస్తున్నాడు బాబా.
ఇంక నా కోరిక ఒక్కటే, అత్యాసే అయినా ఒక్కసారి ‘శిరిడి’ లో కొలువున్న “శ్రీ సాయి’ ఎదురుగా హారతి పాట పాడాలి అని కోరిక, మరి బాబా దయ ఎలావుందో!
సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్చణ మస్తు
శుభం భవతు
Latest Miracles:
- ఆరతి తప్పుగా పాడినందుకు భాదపడుతున్న భక్తునికి, చేసిన తప్పును తెలియజేసిన బాబా వారు.
- వైద్యుని రూపంలో వెళ్ళి, భక్తుని తండ్రి నడుము నొప్పిని తగ్గించిన బాబా వారు.
- నాలుగు హారతులు చూడాలనుకున్నా భక్తురాలి కోరికను తీర్చిన బాబా వారు….
- భక్తురాలు అయిష్టముగా వెళ్లిన తీర్థయాత్రలో, బాబా వారు కలలో కనిపించి “నేను నీ కూడానే ఉన్నాను” అని అభయం ఇచ్చుట.
- నిజ దర్శన ప్రాప్తి … కోవా అడిగిన బాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments