బాబా వారి అనుమతి లేకుండా చేసిన పనిలో నష్టాల పాలైన భక్తుడు…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: Mrs. Jeevani


మా పెద్ద అబ్బాయి ఒడుగు చేయాలని అనుకొని హైదరాబాద్‌ వనస్థలిపురంలో చాలా పేరు మోసిన పురోహితుడిని కలసి ముహూర్తం పెట్టించాను.

ఆ ముహూర్తం పెట్టించిన దగ్గరనుండి ఏదో అశాంతి వెంటాడుతోంది. రోజురోజుకూ ఒడుగు పనులు ఏ ఒక్కటీ కూడా సరిగా జరగటం లేదు,

శుభలేఖలు వేయించాము, కానీ ఏదో అశాంతి అసహనం వెంటాడుతుంది ఆ తరువాత ఎందుకిలా జరుగుతోంది అనుకుంటూ కాకినాడలో మాకు తెలిసిన పూజారిగారికి ఫోన్‌ చేసి నక్షత్రం, అంతకు ముందు హైదరాబాద్‌ లో పెట్టిన ముహూర్తం ఆయనకు చెప్పాను.

శుభలేఖలు వేయించినట్లుగా కూడా ఆయనకు తెలియపరచాను. ఆయన కానీయండి, శుభలేఖలు కూడా వేసేసారుగా, ఇంకా ఎలాగో మీకు ఆఖరి కార్యం కానీయండి అన్నాడు.

అదేమిటి అలా అంటున్నారు? ఎంటో చెప్పండి అని గట్టిగా అడిగితే ఇప్పుడు పెట్టిన ముహూర్తం అసలు ముహూర్తమే కాదు.

ఆ ముహూర్తంలో కనుక ఇటువంటి శుభ కార్యం చేస్తే ఆ పిల్లవాడి తండ్రి వుండడు, పైగా అంతా నష్టం వస్తుంది అని చెప్పాడు.

నేను అవునా! చాలా మంచి సిద్దాంతి అని పేరు వుంది. ఆయన దగ్గరకి చాలా మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు అన్నాను.

సరేలెండి! ఇప్పుడు మీరు మాకు తగిన ముహూర్తం మార్చి పెట్టండి అని చెప్పాను. ఆయన నాకు ఫోన్‌ లోనే ముహూర్తం మార్చి పెట్టారు.

ఆయన చెప్పిన ముహూర్తం నేను పేపర్‌ మీద రాసుకొని హుండీలో డబ్బులు చూసుకుంటే 1600 రూపాయలు న్నాయి,అవి పట్టుకొని శిరిడికి వెళ్ళిపోయాను.

‘శిరిడికి చేరి తిన్నగా బాబా దర్శనానికి వెళ్లి, ఆయనకీ విషయం అంతా చెప్పి “బాబా ఇలా బాబుకి ఒడుగు చేస్తున్నాము. నువ్వ తప్పక బాబుని ఆశీర్వాదించాలి” అని చెప్పి,

ఆ ముహూర్తం అక్కడి పూజారికి కూడా చెప్తే పూజారి గారు మంచిది నువ్వు ముందు నిర్ణయించి న ముహూర్తం కే ఈ శుభకార్యం కానీయండి,

శుభలేఖలు కూడా వేయించారు కాబట్టి అదే ముహూర్తానికి చేసేయండి బాబా ఉన్నాడుగా ఆయనే చూసుకుంటాడు. అని జండా ఒకటి చేతి కి ఇచ్చారు.

ఈ జండాను తీసుకు వెళ్లి మీ ఇంట్లో ఒడుగు రోజు కర్ర కి కట్టి పెట్టండి అని చెప్పాడు.

నేను ఆ జండా తీసుకు వచ్చి మా ఇంట్లో ఒడుగు రోజు ఒక కర్రకి జండాని కట్టాను. ఒడుగు చాలా బాగా జరిగింది. అంతా బాబా ఆశీర్వాదం.

మాకు ఎవరు ఏ గిఫ్ట్‌ ఇచ్చినా అది తప్పకుండా బాబాది అయివుంటుంది. అందరూ వీళ్ళకి బాబా అంటే ఇష్టం అనేవాళ్ళు.

ఒకసారి 5 రూపాయలతో ఒక లాటరీలో బాబా పోస్టర్‌ వచ్చింది. దాన్ని మేము ఫ్రేం కట్టించి మా ఇంటి హాల్లో పెట్టుకున్నాము.

నేను మా ఆవిడతో పెళ్ళయి ఇన్నేళ్ళు అయినా మీ వాళ్ళు నాకేదీ ఇవ్వలేదు అంటుంటే ఉండండి నేను ఒక గిఫ్ట్‌ ఇస్తాను అని తను అప్పుడప్పుడు దాచిన డబ్బుతోటి నాకో సాయిబాబా ఉంగరం చేయించింది.

నాకెందుకో బాబాకి పూజలో 9 పూలు పెట్టి గాని నేను ఏ పనిమీదా బయటికి వెళ్ళను. నేను పూలు పెట్టకుండా వెళ్ళితే నాకు ఆ పని జరగదు.

ఏదో రకంగా మనస్తాపం జరుగుతుంది. అదే విధంగా సాయి చాలీసా కూడా రోజూ చదువుతుంటాను.

సనత్‌ నగర్‌ లో AG ఆఫీస్‌ వాళ్ళది వర్క్‌ వుందని నాకు తెలిసింది. నేను ఎలక్ట్రిక్‌ వర్క్‌ చేస్తాను. ఆ వర్క్‌ తీసుకుని నేను వర్కర్లను పెట్టి పని చేయిస్తాను.

వర్క్‌ కి వెళ్ళే ముందు బాబా ని అడిగాను (అడగటం అంటే బాబా ముందు ఈ పని చేయాలా, వద్దా అంటూ చిట్టీలు వేయటం).

బాబాను పర్మిషన్‌ కోరుతూ చిట్టీలు వేసాను. ‘వద్దు అని వచ్చింది. బాబా “వద్దు అన్నాడని ఊరుకున్నాను.

కాని ఊరుకొన్నవాళ్ళని ఊరుకోనీరుగా జనాలు మా ఫ్రెండ్స్ మాకు తెలిసినవాళ్లు కొందరు “నీ దగ్గర మంచి పనితనం వుంది, పని చెసే వర్కర్స్‌ కూడా వున్నారు, అటువంటి పని మళ్ళీ దొరకదు ఇలాంటి కాంట్రాక్ట్‌ వదిలేసుకోవటం ఎందుకు?

ఇలాంటివి చేస్తేనే లక్షలు వస్తాయి, మీకు ముందు చాలా మంది ఇలాంటివి చేసి కుబేరులయిపోయారు, నీకు వచ్చిన అవకాశం అమాయకత్వంతో, అవివేకంతో వదులుకుంటున్నావు అది ఏమంత మంచి పని కాదు” అంటూ నన్ను బాగా రెచ్చగొట్టారు.

అది నేను సవాలుగా తీసుకున్నాను.’బాబా’ వద్దంటే ఏంటి? నేను పని బాగా చేసుకుంటే ఈ డబ్బు ఎక్కడికి పోతుంది అనుకొని పని మొదలు పెట్టాను.

ఎవరైతే పని ఇచ్చారో, వాళ్ళు అనుకున్నట్లుగా నేను పని చేయలేక పోయాను. పనివాళ్ళు కూడా నాకు చాలా టోకరా ఇచ్చి నన్ను అన్నివిధాలుగా అంటే లక్ష రూపాయలు ఖర్చు పెడితే డెబ్బై వేలు వచ్చేటట్లు అయింది.

‘బాబా’ వద్దు అన్న పని నేను సవాల్‌ గా అనుకొని చేసినందుకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది.

అప్పటినుండి ఎంత లాభం వస్తుందని ఎంత మంది అన్నా ఎవరన్నాకానీ, బాబా వద్ధంటే ఎలాంటిదైనా ఎంత ఎక్కువ ఆఫర్‌ ఇచ్చినా నేను వెళ్ళను.

అలా నేను 22 ఏళ్ళగా బాబా ను నమ్మినందుకు నాకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచి పోతోంది.

The above miracle has been typed By:  Sreenivas Murthy Muppalla

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles