Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: Mrs. Jeevani
నా జాతకం నా చిన్నప్పుడెప్పుడో మావాళ్ళు వ్రాయించారు, అందులో 2004 సంవత్సరం వరకూ వ్రాసి ఆ తర్వాత ఒక రెడ్ మార్క్ పెట్టి వదిలేసారు.
నేను కాటరింగ్ కూడా చేసాను. కొన్ని కంపెనీలకు, కొన్ని ఆఫీసులకి లంచ్ బాక్స్ లు ఇచ్చేవాళ్ళం. కొన్ని పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్ కు కూడా వంటలు చేసేవాళ్ళం.
అలాగే ఒకసారి ఒకరి ఇంట్లో వంట చేస్తున్నాను. వంటలు చేసే సమయంలో నేను ఏది కనిపిస్తే అది తినేయటం, అన్నీరుచులు చూసేయటం కాఫీలు, టీలు పెట్టుకు తాగేయటం లాంటివిచేయను, నాకు శ్రద్ధా నియమాలు ఎక్కువ.
ఆ రోజు బాగా దాహం వేస్తోంది, ఎన్నిసార్లు నీళ్ళు తాగినా దాహం తీరటంలేదు. ఒక నిమ్మ చెక్క దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెం రసం చుక్కలుగా నాలుకపైన పిండుకుంటున్నాను.
అలా నేను చేయటం ఒక ముసలాయన చూసాడు. నన్ను పిలిచి నా కళ్ళు, చేతి వెళ్ళు పరిశీలించి, నీకు ‘జాండీస్’ వుంది వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకో అని చెప్పారు.
ఆయన అన్నది నేనేమంత సీరియస్ గా తీసుకోలేదు. అందుకే వెంటనే వెళ్ళలేదు.
పది రోజుల నుండి నాకు తీవ్రంగా జ్వరం వస్తుండటం వలన అప్పుడు గవర్నమెంట్ హాస్పటల్ కి వెళ్లాను. కోణార్క్ డయాగ్నస్టిక్ సెంటర్ లో రక్తం టెస్ట్ కి ఇచ్చి వచ్చాను.
మా వాళ్ళు సాయంత్రం రిపోర్ట్ కోసం వెడితే ఎందుకు అనవసరంగా 200 రూపాయలు రిపోర్ట్స్ కోసం దండగ ఈ పాటికి ఈ మనిషి పోయి ఉంటాడు. మీరు వెళ్ళిపొండి అని చెప్పారుట.
ఆ రిపోర్ట్స్ గవర్నమెంట్ హాస్పటల్ లో చూపించారు. ఆ రిపోర్ట్ చూసాక గవర్నమెంట్ హాస్పటల్ వాళ్ళు వేరే హాస్పటల్ లో చూపించుకోమన్నారు.
అప్పుడు ఈ హాస్పటల్ నుండి వేరే హాస్పటల్ కి వెడుతూ “సాయిబాబా గుడి’ గుమ్మం లోంచి మా ఆవిడ ‘బాబా’ కి దండం పెట్టుకుంటూ “బాబా నేను మళ్ళీ ఈయనతో పాటు నీ దర్శనానికి వచ్చేటట్టు చూడు బాబా” అని అనుకుంది.
అప్పటికి పద్రి రోజులనుండి 32 సలైన్ బాటల్స్ పెట్టారు, దాని మూలాన నాకు షుగర్ ఎటాక్ అయింది.
‘నిఖిల్’ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. మా ఆవిడ చేతిలో 5000 రూపాయలు మాత్రమే ఉన్నాయి.
నేను యధాలాపంగానే ఆసుపత్రికి వచ్చే డాక్టర్స్ లిస్టు చూసాను. ఆ లిస్టు లో డాక్టర్ రోజానంద్ అనివుంది.
ఆ డాక్టర్ గారు నాకు బాగా తెలుసు. ఆయన ఇప్పుడు తిరుపతికి వెళ్లారు అని నేను చెప్పాను.
ఎందుకంటే అంతకు ముందు నాలుగు రోజుల క్రితమే వాళ్ళింట్లో కొంచెం పని వుంది రమ్మనమని పోన్ చేసి, నాలుగు రోజులు మేము వుండటం లేదు “తిరుపతి! వేడుతున్నాము, మేము వచ్చాక నీకు పోన్ చేస్తాము, వచ్చి ఆ పని చేసి పెట్టు అంటూ పిలిచారు.
అందుకే నాకా సంగతి తెలిసింది. నేను మాకు ఆరోజానందు గారు తెలుసు అనగానే నన్ను హాస్పటల్ లో చేర్పించుకున్నారు.
అక్కడి డాక్టర్స్ కూడా బాగా చూసారు. ఒక డాక్టర్ వచ్చి పరీక్ష చేసి మీకు ఇంతకు ముందు సుగర్ ఉందా అని అడిగాడు. నేను లేదు కానీ, సెలైన్ బాటిల్స్ ఏకంగా 32 పెట్టారు అందువల్లనే షుగర్ వచ్చేసింది అన్నాను.
అవునా అంటూ ఆయన బయటకి వెళ్లి ఎదో ఇంజక్షన్ తీసుకువచ్చి నాకు చేసారు.
ఇక్కడ కొంచెం కష్టం అమ్మా! నిమ్స్ కి తీసుకెళ్ళు అంటూ ఆయన మా ఆవిడకి చెప్పాడు. మా ఆవిడ ఏడుస్తూనే ఉంది. జాండీస్ బాగా ముదిరి పోయింది,షుగర్ కూడా వచ్చింది.
నిమ్స్ హాస్పిటల్ కి వచ్చేసరికి అదే రోజు ఎవరో మినిస్టర్, జాండీస్ ముదిరి చనిపోయాడు అంటున్నారు. మా ఆవిడ రాగం పెద్దది చేసింది, బిత్తర చూపులు చూస్తోంది.
ఏ క్షణంలో ఎలాంటి కబురు. వినవలసి వస్తూందో, అనుకుంటున్నారు నా గురుంచి.
అక్కడ కొన్ని రోజులు ట్రీట్మెంట్ అయ్యింది. అక్కడ మా చుట్టాలావిడ, ఎటువంటి. అనవసరపు టెస్ట్ లు చేయించకుండా మేనేజ్ చేసింది.
టెస్ట్ లు అక్కడ చేయిస్తే డబ్బులు అవుతాయి. అటువంటిది, మాకు ఏమీ ఖర్చు కాకుండా చూసింది.
ఆవిడ పేరు డాక్టర్ సంధ్యారాణి. ఆవిడ చాలా రోజులు మా ఇంటికి కూడా వచ్చి ట్రీట్మెంట్ చేసింది. హాస్పటల్ లో కొన్ని రోజులున్నాక ఇంటికి వచ్చాము.
ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ “బాబా గుడికి” వెళ్లి మరీ ఇంటికి వచ్చాము. మా ఆవిడ ‘బాబా’తో ముందు అన్నది కదా మేమిద్దరమూ మరల వచ్చి నీకు నమస్కారం చేసుకోవాలి బాబా అని,
అలాగే తిరిగి నాకు ఆయుషు పోసి మళ్ళీ ఇంటికి పంపించాడు బాబా. నాకు తిరిగి పునర్జన్మ ప్రసాదించాడు బాబా. లేకపోతె జాండీస్ తో నేను పోవాల్సింది. జాతకంలో నేను 2005 చూడలేను అనివుంది.
జాండీస్ టెస్ట్ కి రక్తం పంపితే, ఈ రక్తం తాలూకు మనిషి ఈ పాటికి పోయి వుండాలి అన్నారు అక్కడ.
అందుచేత నా జీవితం బాబా పెట్టిన బిక్ష ఉండాలి ఎప్పుడూ ఆయన రక్ష!
సర్వం శీ సాయినాథ చరణారవిందార్ప్చణ మస్తు
శుభం భవతు
Latest Miracles:
- బాబా వారు చేసిన లీలల ద్వారా బాబా మీద నమ్మకం లేని భక్తుని కుటుంబ సభ్యులందరినీ తన భక్తులుగా మార్చుకున్న సాయి మహారాజ్….
- తన మందిర (దిల్ సుఖ్ నగర్ బాబా గుడి) నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించిన బాబా వారు
- సాయి బాబా వారు ఒక భక్తుని కోరిక ఇంకొక భక్తుని ద్వారా తీర్చుట.–Audio
- భక్తురాలి బాధను విజమర సేవ ద్వారా తొలగించిన బాబా వారు
- దిల్ సుఖ్ నగర్ బాబా గుడి విగ్రహ ప్రతిష్ట కు ఉన్న అడ్డంకులను తొలగించిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments