పరీక్షలు రాయను ఫెయిల్ అవుతాను అన్న కుమారునికి, శేవడే కు బాబా చేసిన లీల గుర్తు చేసిన తల్లి…..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను బాబాకి ‘సచ్చరిత్ర పారాయణం చేస్తానని చెప్పానుగా మరి స్థలం ఇప్పించాడుగా నేను చదవాలి,

సరే! ఒక గురువారం నాడు మొదలు పెడదామనుకొని తెల్లవారుఝామున లేచి నైవేద్యానికి తయారుచేసి పెట్టుకొని ‘బాబా పటం పెట్టుకొని దీపం పెట్టి చదవాటానికి కూర్చున్నాను.

వారం రోజులూ కూడా ఒంటి పూట భోజనం, కిందనే పడక అయింది. ఆఖరు రోజున బుధవారం నాడు ఎవరైనా ఒకర్ని పిలిచి వారిని బాబాగా భావించి భోజనం పెట్టమని పుస్తకంలో వుంది,

నేను బాబా మాకు ఈ ఊరు కొత్త ఎవరితోనూ పరిచయాలు లేవు నేనైతే వంట చేస్తాను, ఎవర్నిరప్పించుకుంటావో నీదే భారం అనుకుంటు పారాయణ పూర్తి చేసి వంట కూడా రెడీ చేసాను.

మా ఇంటి ఎదురుకుండా ఒకావిడ వుంది ఆవిడని ఏమండీ! నేను ఇలా బాబా పారాయణం చేసాను, అందులో ఇలా భోజనం పెట్టమని వుంది, నేను వంట చేసేసాను మీరు భోజనానికి వస్తారా అని అడిగాను,

అప్పుడు ఆవిడ “మీరు ఏమీ అనుకోకండి మీరు రమ్మనమన్నారని ఈ రోజు మీ ఇంటికి వస్తే రేపు నన్ను మరో ఆమె పిలుస్తుంది. ఎళ్ళుండి మరో ఆమె రమ్మనమంటుంది. అందుకని నేను ఎవరింటికి రాను, మీరు ఏమి అనుకోకండి అంది.

నేను లోపలికి వచ్చి “బాబా ఆవిడ రానంది, ఎవర్ని పంపుకుంటావో”అని కళ్ళ నీళ్ళతో దండం పెట్టుకున్నాను.

ఈ లోపు మా ఇంటికీ బట్టలు ఉతికే చాకలి వచ్చింది, ఏమమ్మా అలా వున్నారు, అంది ఏంలేదు చాకలీ ఈ రోజు పారాయణం పూర్తి అయింది ఒకళ్ళకి భోజనం పెట్టాలి ఎవరూ రాలేదు అన్నాను.

అమ్మా నాకు ఆకలి వేస్తోంది అన్నం పెడతారా అని అడిగింది సరేనని విస్తరివేసి ఆ చాకలికి అన్నంపెట్టాను, తననే ‘బాబా’గా భావించి, దక్షిణ తాంబూలం ఇచ్చి పాద నమస్కారం కూడా చేసాను,

తను నేనలా చేస్తుంటే చాలా ఖంగారు పడింది. వద్దమ్మా మీరు నాకు అలా నమస్కారం పెట్టకూడదమ్మా అంటూ గిలగిల కొట్టుకు పోయింది.

నీలో నేను ఆ “బాబాను చూసుకున్నాను అని చెప్పాను. అలా పారాయణం పూర్తి చేసాను.

మా పెద్దబ్బాయి పేరు వేణు, వాడు అంత తెలివయిన వాడు కాడు, చదువంటే పెద్దగా ఇష్టంలేదు,

మార్కులు కూడా అంతగా రావు. ఎలాగో 10th  క్లాస్‌ దాకా వచ్చాడు పరీక్షలు దగ్గర కొస్తున్నాయి. ఏదో చదువుతున్నాడు. వాడికీ ‘బాబా’ అంటే ఇష్టమే, నమ్మకం కూడా వుంది.  “బాబా” గుడికీ వెడతాడు.

 “శ్రీ సాయి సచ్చరిత్ర” పారాయణం కూడా చేస్తాడు, కలలో వాడి పరీక్ష సెంటర్‌ కనపడిందిట తెల్ల బట్టలేసుకున్న నర్సు కనపడిందిట. నేను అలా కనపడింది బాబానే అని చెప్పాను, వాడు అవునా అమ్మ అన్నాడు అమాయకంగా,

హాల్‌ టికెట్స్‌ వచ్చాయి వాడికి. సెంటర్‌ వాడికి కలలో కనిపించిన స్కూల్లోనే వేసారు, పరీక్ష తేదీ రానే వచ్చింది.

నేను స్కూల్లో పని చేస్తానుగా నేను వాడికి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి మా వారిని తీసుకు వెళ్ళమని చెప్పి నేను స్కూల్‌ కి వెళ్ళి పోయాను. మావారు, వేణు పరీక్ష వ్రాయటానికి 1 గంట ముందే సెంటర్‌ కి వెళ్ళి పోయారు,

మా వాడు హల్లోకి వెళ్ళబోతుండగా మా వాడి స్కూల్‌ హెడ్‌ మాస్టరు వీడికి కనపడి “ఏరా వేణు నువ్వూ పరీక్ష వ్రాయటానికి వచ్చావా?,

ఏమిటి పరీక్ష రాసి పాసయి పోదామనే! పరీక్ష నువ్వేమి రాస్తావు? పాసవుతావా? పాడా! ఎందుకు అనవసరం నువ్వు పరీక్షలు వ్రాయటమే దండగ” అని చాలా హేళనగా మాట్లాడాడుట.

మా వేణు బయటకి వచ్చేసాడుట, మా వారు కంగారుగా ఏరా హాల్‌ టికెట్‌ తీసుకెళ్ళ లేదా? పెన్స్‌ మర్చి పోయావా? ఆకలి వెస్తోందా? ఏమయినా తాగుతావా అంటూ అడిగారుట.

మా వాడు “అదేం కాదు నాన్న నేను పరీక్ష రాయను మా హెడ్‌ మాస్టారు గారు కనపడి నువ్వూ పరీక్ష రాసేవాడివా పాసయి పోదామనే”అంటూ ఎగతాళి చేసాడు.

“నేను రాయను ఇంటికి వెళ్ళి పోదాం పద నాన్నా” అన్నాడు అది కాదు “నువ్వు రాయి రాయకుండా పాసా ఫెయిలా అని ఎలా నిర్ణయిస్తాం వెళ్ళరా వేణు సమయం అయిపోతోంది” అన్నారు మా వారు.

“లేదు నాన్నా నేను రాయను రాసినా ఫెయిల్‌ అవుతా అందుకని రాయకుండా వుంటే మేలు కదా నాన్నా”అన్నాడు.

ఇంక టైం అయిపోతోంది, మా వారు నాకు విషయం చెప్పి నాచేత వాడికి చెప్పిద్దామని నాకు ఫోన్‌ చేసారు,

నేను క్లాస్‌ లో వున్నాను, సెల్‌ ఆఫ్‌ చేసాను, ఇంక మా వారు మాహెడ్‌ మిస్సేస్స్‌ కి కాల్‌ చేసి అర్జంటుగా మీనాక్షి తోటి మాట్లాడాలి, మా వాడు పరీక్ష రాయనంటున్నాడు, ఆవిడకి ఫోన్‌ ఒక సారి ఇవ్వండి అన్నారుట.

కంగారుగా ఆవిడ పాపం నా దగ్గరకి పరుగెత్తుకు వచ్చి “మీనాక్షి మీవారు ఫోన్‌, మీ వాడు పరీక్ష రాయనంటున్నాడుట ఇదిగో మాట్లాడు. ఆయన లైన్‌ లో వున్నారు”, అంటూ నాకు ఫోన్‌ ఇచ్చింది.

నేను “ఏంటండీ!” అన్నాను కంగారుగా ఫోన్‌ తీసుకొని, మా వారు “మనవాడు పరీక్షలో తప్పుతాను; అందుకు నేను ఇప్పడు పరీక్ష రాయటం అవసరమా అంటూ మొండి కేస్తున్నాడు, టైం కూడా అయిపోతోంది, వాడికి నువ్వయినా నచ్చచెబుతావని నీకు చేసాను” అన్నారు,

ఏది వాడికివ్వండి ఫోన్‌ అన్నాన్నేను ఆదుర్దాగా, “నేనురాయనమ్మా” అన్నాడు వాడు.

“ఎందుకురా ఎందుకు రాయవు”అన్నా నేను, “నేను తప్పుతాను అలాంటప్పుడు రాసి ప్రయోజనం ఏమిటి” అన్నాడు వాడు. అందుకే రాయనంటున్నాను అన్నాడు.

“అది నువ్వెలా నిర్ణయిస్తావు, మనకి బాబా వున్నారు ఆయన్ని నువ్వు నమ్ముతావు కదా పరీక్షల్లో చదవక పోయినా పాసయిన కధలు నువ్వు సచ్చరిత్రలో  చదివావు విన్నావు అందుచేత ఏమాత్రం సంకోచం లేకుండా బాబాను తలుచుకొని పరీక్ష హల్లోకి అడుగుపెట్టి ధైర్యంగా నీకు వచ్చింది నువ్వురాయి అసలు ఏమీ రాయకపోయినా ఫరవాలేదు పేపరు మీద “సాయిరాం” అని రాసిరా చాలు అంతా ఆయనే చూసుకుంటారు”అన్నాన్నేను.

వాడు తిన్నగా పరీక్ష హాలు లోకి వెళ్ళాడు అప్పడే అందరూ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ సీట్‌ లలో కూర్చున్నారు. వీడు వెళ్ళి కూర్చున్నాడు.

ఇంతలో ఒకాయన వీడి దగ్గరగా వచ్చి “బాబూ నువ్వు నెహ్రుగారబ్బాయివా అని అడిగాడుట. అవునన్నాడుట వీడు.

“ఏమిటి మరి ఏమయినా రాస్తావా” అని అడిగాడుట పెదవి విరచి ‘నాకేంరావు’ అని అన్నాడుట. ఇంతలో తెల్ల బట్టలతో ఒకావిడ వచ్చి ‘నువ్వు మీనాక్షి కొడుకువా” అని అడిగిందిట.

వాళ్ళని మావాడు ఎప్పడూ చూడ లేదు, అవునన్నాడుట వీడు,

మరేంటి ఏమయినా రాయగలవా అని అడిగిందిట తల అడ్డంగా  వూపాడుట మా వాడి ముందు సీట్లో ఉన్న విద్యార్ది చాలా తెలివయిన విద్యార్థి వీళ్ళిద్దరూ అతనికి చెప్పారుట.

‘ఇతనికి కొంచెం చూపించు బాబూ పాపం ఏమీ రాయ లేడు నువ్వు పేపర్‌ చూపించా వంటే ఇతనూ పాస్‌ అవుతాడు కొంచెం అన్ని పరీక్షలు అతనికి కూడా చూపించి రాసుకునేటట్లుగా చూడు అని చెప్పి వెళ్ళి పోయారుట.

మా వాడికి ఆ అబ్బాయి అన్నిఎగ్జామ్స్‌ చూపించాడు. అతను రాస్తే ఇతనూ రాసాడు.

కొంతరాసాక మా వాడు ఇంక చాల్లే నాకు పాస్ మార్కులు 35 వచ్చేస్తాయి ఈ సమాధానాలకి అనేవాడుట మా వాడు అతనితో, అలా కాదు మొత్తం రాసుకోమని చూపించాడుట అతను,

పరీక్షల దగ్గర నుండి రిజల్ట్‌ వచ్చేదాకా మా వాడు రోజూ బాబా గుడికి వెళ్ళి వస్తూనేవున్నాడు. అలా మా వాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు.

The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles