కష్టాలలో ఉన్న భక్తుని ఆధ్యాత్మిక మార్గంలోనికి తీసుకొని వచ్చిన అవధూతల దర్శనం…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: Mrs. Jeevani


నా పేరు రాజేశ్వర రావు.  మాది వరంగల్,  నేను సామాన్యమైన సాయి భక్తుడను. ఎల్‌.ఐ.సి ఎజెంటును.

1998 లో చిట్టిలు నడిపి బాగా నష్టపోయాను. ఆ బాధలో వున్న నన్ను నా స్నేహితుడు ఆంజనేయ స్వామి ఉపాసకుడి దగ్గరికి తీసుకు వెళ్ళాడు.

ఆయన నాకొక వేరు ఇచ్చి రోజు కొంచెం కొంచెంగా చప్పరించ మన్నారు.

ఆంజనేయస్వామికి నియమ నిష్టలు ప్రధానం కాబట్టి మాంసం మానేయమన్నారు.

కొన్ని రోజులు అయ్యాక నాకు ఆంజనేయ స్వామి మాల వేసుకోవాలనిపించింది. నలభై రోజులు వేసుకున్నాను.

మాల వేసుకున్నాను కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడిని. అక్కడికి బాబా గుడిలో పూజారి గారు వచ్చారు.

ఆయన నన్ను చూసి బాబా గుడికి రమ్మన్నారు. ఆయన పిలవగానే ఆయన వెనుక నేను బాబా గుడిలో అడుగుపెట్టాను. అదే మొదటిసారి నేను బాబా ను చూడడం.

అది మొదలు తరచూ నేను బాబా గుడికి వెళుతుంటాను. కొంతమంది కలిసి కొత్తవాడ వెళ్లి అక్కడ వారం రోజులు గురు చరిత్ర పారాయణం చేసాము.

అప్పటినుండి నేను తరచూ బాబా గుడికి వెడుతూ ఉండేవాడిని. వ్యాపారం దెబ్బతినడం వలన పని లేక, రోజు సాయంత్రం బాబా గుడిలో భజనలు చేస్తూ గడిపేవాడిని.

నాందేడు బాబా నేను గాణుగాపురం వెళ్లాం. అక్కడ మాకు ఒక భార్యాభర్తలు కలిసారు.

వారు మమ్మల్నిఔదుంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నారు. వారూ ప్రదక్షిణలు చేసారు. శివ పూజ కూడా చేసారు.

మీకు ఏమి తెలియదుగా అందుకే మేము మీకు అన్ని చెబుతున్నాం మేము చేస్తున్నట్లు గానే మీరు చెయ్యండి అని, వారు చేస్తూ మా చేత కూడా చేయించారు.

అక్కడ ఒక కన్నం లోంచి లోపలికి చూడమన్నారు… మేము చూసాము. తిరిగి మేము ఇవతలికి చూసేసరికి మాకా దంపతులు కనబడలేదు. వాళ్ళని బాబానే పంపించాడు అని అనుకున్నాం.

మళ్ళీ పౌర్ణమి నాటికి వెళ్లి సంగమేశ్వర్‌ లో స్నానం చేసి బాబా ఫోటో, అవధూతలందరు కలసి వున్న ఫోటో ఒకటి పెట్టి భజన చేస్తున్నాం.

నరసింహ సరస్వతి స్వామి సశరీరంతో వున్నప్పుడు ఒక అవధూత కి ఇలా కాశి పట్టణం చూపించాడు.

మేము భజన చేస్తూ వుంటే అలాంటి అవధూత మమ్మల్ని పొదలలోంచి చూస్తున్నాడు. నేను ఆయన్ని గమనించాను, భజన అయ్యాక ఆయనతో మాట్లాడదామని చూస్తే ఆయన కనబడలేదు.

మూడవ సారి గాణుగాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ‘అమ్మ'(అవధూత) ఒక పాడుబడిన ఇంట్లో కూర్చొని వుంది. ఆమె ఎవరు ఏమి ఇచ్చిన తీసుకోదు, అందుకని ఏమీ తీసుకువెళ్ళక్కరలేదు అన్నారు.

ఎవరితో మాట్లాడదు అని కూడా చెప్పారు. నేను ఇవేమీ పట్టించుకోకుండా ఒక వాటర్‌ బాటిల్‌ పెట్టాను.

ఆవిడా ఏమనుకుందో గానీ నేనిచ్చిన బాటిల్‌ తీసుకుంది. నేను మౌనంగా తిరిగి వచ్చేసాను ఇలా అవధూతల దర్శనభాగ్యంతో మొదలైయింది, నా ఆధ్యాత్మిక ప్రయాణం.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles