Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శారద అన్న ఆమె ఉదయాన్నే కాకడా హారతి చేసి పడుకుంది. ఆమెకు ఒక ప్రేతం వచ్చి తన మీద కూర్చుంది. ఆమెకి విషయం స్పష్టంగా తెలుస్తోంది,
గొంతుమీద కూర్చుందిట, ఆమెకి మాటలు రావటం లేదు, నా ప్రాణాలు ఈ ప్రేతం కాస్త తీసుకుపోతోంది. నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అని అనుకుంటోందిట.
“సాయిరాం సాయిరాం” అని అనుకుంది, అప్పుడు సాయిబాబా నా రూపంలో ఆమె రూమ్ లో దర్శనం ఇచ్చాడు, అప్పుడు ప్రేతం అదృశ్యం అయ్యింది.
ఆమె వాళ్ళ అమ్మాయి పెళ్ళికి చాలా తిప్పలు పడింది. ఆమె భర్తది పాన్ షాప్. బాబా శక్తితో ౩ లక్షలు చిట్టి వేసింది.
నేను సత్చరిత్ర పారాయణం చేయమన్నాను, ఆమె అలాగే చేసింది, వాళ్ళ అమ్మాయికి ఒక సంబందం వస్తే నేను వద్దన్నాను.
ఆ సంబంధం వాళ్ళ భర్తకి నచ్చింది, పెళ్ళి చేసేస్తానన్నాడాయన. ఆమె మాత్రం వద్దన్నది. మొత్తానికి ఆ సంబంధం కుదరలేదు. చాలా సంబంధాలుకుదరలేదు.
ఆ పెళ్ళికూతురు బాబాకి మొక్కుకుంది. “బాబా చిన్నప్పటి నుంచి నిన్నేకొలుస్తున్నాము నాకు పెళ్ళి కుదరకపాతే అమ్మ నాన్న బాధపడుతున్నారు. ఏదోకటి కుదిరించు బాబా” అని అనుకుందట.
బాబా ఆమెకి కలలో కనపడి “నీకు గురువారం నాడే సంబంధం వస్తుంది, అదే గురువారం రోజు నీకు పెళ్ళిచూపులవుతాయి, పెళ్ళి అవుతంది. ఆ పెళ్ళి అయ్యే తారీకు, సమయం కూడా బాబా ఆమెకి చెప్పాడుట. అన్ని బాబా చెప్పినట్లే ఏది జరిగినా ఆమెకి గురువారమే జరిగింది.
ఆ శారదకి నాకు ఒక విషయంలో మాట పట్టింపు వచ్చి నేను ఆమె కూతురు పెళ్ళికి వెళ్ళలేదు.
మా ఇంటి దగ్గర ఉంటున్నతనికి అక్షింతలు ఇచ్చి పంపించాను. కాని నేను పెళ్ళికి వెళ్ళినట్లుగా, నన్ను అక్కడ చూసినట్లుగా చాలా మంది చెప్పారు.
అసలు జరిగింది ఏమిటంటే నన్ను ఆడపడుచులందరూ అన్నయ్యా! అని, రాజన్నా అని పిలుస్తారు. నన్ను అలాగే చూస్తారు.
నేను పెళ్ళికి వెళ్ళకపోయేటప్పటికి పంతంగా రాను అన్నానని ఆమె బాబాకి చెప్పుకుందిట. ఆమెకి ప్రతీది బాబాకి చెప్పుకోవటం అలవాటు కాబట్టి ఇదీ చెప్పింది.
రాజన్న పెళ్ళికి రానంటున్నాడు బాబా అని చెప్పిందట. అందుకని ఆమె బాధ పడకుందా పెళ్ళిలో నేను కనపడాలి అని బాబాయే వచ్చాడన్నమాట. పెళ్ళిలో నా రూపంలో బాబాయే తిరిగాడన్నమాట.
ఒకసారి నా స్నేహితుడు మనోహర్ గారి తల్లి వేరే బృందంతో యాత్రలకి కాశీ వెళ్లిందిట. కాశీతో పాటు ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చూడాలి అనుకున్నారుట.
ఒకచోట బయటికి పోవటానికి అందరూ తయారయ్యరట. వున్నట్టుండి ఈవిడకు విరోచనాలు పట్టుకున్నాయట.
అందరితో పాటు వెడితే వాళ్ళకి ఇబ్బంది, తనకూ ఇబ్బంది అని ఆవిడ నేను రాను అని రూం లో వుండిపోయి మనోహర్ కి ఫోన్ చేసి, నాకు విరోచనాల వలన రూమ్ లో ఒక్క దానిని వున్నాను అని చెప్పిందట.
అతను నాదగ్గరకి వచ్చి రాజన్న ఎదో ఒకటి చెయ్యి, అమ్మకు విరేచనాలు అవుతున్నాయట, పైగా ఒక్కత్తే ఉందట, ఏమన్నా అయితే ఏం కాను అంటూ ఏడ్చాడు.
నేను బాబాని ప్రార్ధించి ధ్యానం లోనే నేను వెళ్లి ఆమెకి బాబా ఊధీ బొట్టు పెట్టాను. అంతే ఆవిడకి విరోచనాలు ఆగిపోయాయి. తాను కులాసాగా వున్నట్లు మనోహర్ కి ఫోన్ చేసి చెప్పింది.
చాల రోజులు మా ఆవిడ బాబా ని వదిలి తనతో వుండమని గొడవ పడింది. ఆమె జాకెట్లు బాగా కుడుతుంది.
నెలకు రెండు వేలు ఆదాయం వస్తుంది. నేను పాలసీలు చేయిస్తే ఎప్పుడో ఒకసారి కొంత వచ్చేది.
నా ఆదాయం సరిగా లేనందున బాబా ఆమెకే ఆదాయం చూపించాడు. ఒకసారి మా మరదలికి అనుకోకుండా అబార్షన్ అయింది.
డాక్టర్స్ ఆమెకి సరిగా క్లీన్ చేయలేదు. పని మీద నేను మా అత్తగారింటికి వెళ్ళాను, లోపల అడుగు పెట్ట కుండానే నాకు శవం వాసన వచ్చింది.
మరదలికి కడుపు నొప్పి వస్తే మా అత్తగారు హాస్పటల్ కి తీసుకు వెళ్లారు.
నేను ఒక్కడినే ఇంట్లో ఉన్నాను,నేను బాబా తో “బాబా ఆమెకి ఏమి కాకూడదు నువ్వే కాపాడాలి అని ప్రార్థించాను”.
అర్ధరాత్రి డాక్టర్స్ సాధారణంగా ఆపరేషన్ చేసే ప్రసక్తి లేదు. అలాంటిది ఆ సమయంలో ఆపరేషన్ చేసి గర్భసంచి లో వున్న ముక్కలు తీసేశారు.
ఆమె ఇంటికి వచ్చాక నేను బాబాని ప్రార్ధించాను అని చెప్పాను. దానికి మా మరదలు “అందుకేనా బావా! అర్ధరాత్రి అయినా ఆసమయం లో ఆపరేషన్ చేసారు, అంటే అంతా బాబా చలువేనన్న మాట” అని అప్పటి నుండి తాను కూడా బాబాను నమ్మి, బాబా పారాయణం చేస్తుంది.
Latest Miracles:
- భక్తురాలు అయిష్టముగా వెళ్లిన తీర్థయాత్రలో, బాబా వారు కలలో కనిపించి “నేను నీ కూడానే ఉన్నాను” అని అభయం ఇచ్చుట.
- బాబా నా కలలో కనపడి, మూడు సంవత్సరాలు పట్టింది, నీ వియ్యపురాలిని పెళ్ళికి వప్పించడానికి, పెళ్లి చేయించినందుకు నాకేమిస్తావు ”? అని అడిగాడు.
- బిడ్డ మారకం(మరణం) తప్పించితిని, నీ కేమి భయం లేదు అని అభయం ఇచ్చిన బాబా వారు
- బాబా ఆమె ప్రక్కనే తన చేతితో లాంతరు పట్టుకుని నిలబడ్డారు–Audio
- సాయి భక్తుడైన అన్నను తిట్టినా చెల్లికి, బాబా కలలో కనిపించి మందలించిన వైనం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments