అల్లాను సాయి లో చూసుకొన్న ముస్లిం భక్తురాలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు జమీలా బేగం. నా పేరును బట్టి మీకు ఈపాటికే మేము ఎవరమో తెలిసే వుంటుంది. అవును మేము ముస్లిమ్స్‌.

మేము అల్లానే తప్ప వేరే దేవుడిని తలవము. అలాంటిది ఆ సాయే మా అల్లా అయినాడు.

ప్రస్తుతం మేము బేగంపేటలో వుంటున్నాము. అంతకముందు హైదరాబాద్‌, వనస్థలిపురం వైదేహినగర్లో వుండే వాళ్ళం. అక్కడ మాకు సొంత ఇల్లు వుంది.

మేమున్న దగ్గరే పద్మావతి, మల్లిఖార్జునరావు గారని వున్నారు, వారింట గత 22, 23 సంవత్సరాలుగా ‘సాయినామ ఏకాహం’, ‘శ్రీ సాయినామ సప్తాహం, ‘సాయినామ సప్త సప్తాహాలు’ కూడా జరుగుతున్నాయి.

మా వారు, మల్లిఖార్జునరావుగారు ఒకే ఆఫీస్‌ లో పక్క పక్క సీట్లలో పనిచేసేవారు.

వారింట్లో “శ్రీ సాయినామం” ఏకాహం జరుగుతునప్పుడు వాళ్ళు వాళ్ళ మతం కాని వాళ్ళం అయినా, మమ్మల్ని కూడా రమ్మనమని పిలిచేవారు.

అలా చాలా సార్లు చెబుతూంటే, ఒకే ఆఫీస్‌ లో పనిచేస్తున్నారు కాబట్టి బాగుండదని వెళుతుందేవారం. మా వారు ఒక గంటసేపు ఉండి వెళ్ళిపోతుండేవారు.

‘పద్మావతిగారు’ నాకు మంచి స్నేహితురాలు. ఆవిడ ఒక్కత్తీ పని చేసుకుంటుంటే,  నేను కూడా ఉంటూ ఆ పని, ఈ పని అందుకుంటూందేదాన్ని

వారింట్లో భజన జరుగుతునప్పుడు వారు, వాళ్ళింటికి వచ్చిన “బాబా భక్తులు తన్మయత్వంలో ఉగిపోతుంటే, “ఏమిటో ఈ హిందువులు ప్రతి రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టకి, మొక్కుతారు”అని నేను నవ్వుకునేదాన్ని”.

“అలా ప్రతి నెలా నామం జరిగేటప్పుడు వెడుతున్న నాకు ఎలా కలిగిందో తెలియదు కానీ, బాబా మీద ప్రేమ, భక్తి భావం ఏర్పడ్డాయి”.

ఎవరో చిన్న బాబా ఫోటో ఇచ్చారు. అది మా కెందుకు? హిందువులకి యిస్తే పూజలో పెట్టుకుంటారు అనుకున్నాం.

బాబా మీద ప్రేమ కలగంగానే నేను లోపల ఎక్కడో పెట్టిన “సాయిబాబా ఫోటో” బయటికి తీసి టేబుల్‌ పై ఉంచి అప్పుడప్పుడు ఆయన ముందు ఒక పువ్వు, ఒక పండు ఉంచడం, అగరువత్తులు వెలిగించటం మొదలు పెట్టాను.

ఆ సమయంలో కొంత మంది ‘సాయి భక్తులు’ (20 నుంచి 25 మంది) కలిసి శిరిడీ వెళుతూ నన్ను రమ్మన్నారు.

‘శిరిడి దేముడు’ మాట ఎలా ఉన్నా అంతమంది కలిసి సరదాగా గడపచ్చు కదా అని బయలుదేరాను. అందరం కలిసి బస్సు మాట్లాడుకొని బయలుదేరాము.

‘శిరిడి’ దగ్గర పడే కొద్ది నాలో తెలియని “ఉద్వేగం”, ఒక “పారవశ్యం” కలిగాయి.అందరం శిరిడి’లో దిగాము,

తయారయి ‘సమాధి మందిరానికి’ దర్శనానికి వెళ్ళాం. ఆ జనం మధ్య నుండి లోపలికి వెళ్లి “నిండైన పాలరాయి విగ్రహాన్ని” చూసేసరికి నాకెందుకొ ఒళ్ళంతా పులకించి పోయింది.

ఆయన రూపం చూస్తున్న కొద్దీ చుడాలనిపించింది. ఆయన కళ్ళు నన్ను “జమీలా వచ్చావా” ? అని పలకరించాయి. నా కళ్ళ వెంట నీళ్ళు, నాకు తెలియకుండానే కారుతున్నాయి.

అది బాదో, ఆనందమో తెలియని ఒక ఆనందకరమైన అనుభూతి కలిగింది. ఆ అనుభూతిని వర్ణిచడం నాతరం కాదు,

తిరిగి హైదరాబాద్‌ వచ్చేశాక మా పెద్దలకి చేసే ‘ఫాతేహి’, నేను ‘బాబాకి’ చేయడం మొదులు పెట్టాను [‘ఫాతేహి’ అంటే పళ్ళు స్వీట్స్‌ అన్నీ అలావుంచి మా మతానికి సంబందించిన మంత్రాలు (ఖురాన్‌) చదివి మత పెద్దలకి, మా పెద్దలకి సమర్పిస్తాము].

నేను మా స్నేహితులతో ‘శిరిడి’ యాత్రకి వెళ్ళినట్లే కొంతమంది మగవారు ‘శిరిడి వెళుతుంటే, మా వారిని మల్లికార్జున రావు గారు రమ్మంటే వెళ్లారు.

ఆయనకు బాబాను దర్శనం చేసుకున్న తరువాత ఏమనిపించింది అని నేను అడగలేదు. ఆయన బాబాని నమ్ముతారు కాని, మద్యలో సైతాన్‌ అద్దుపడుతుంటాడు అనుకుంట.

ఒకసారి మా కుటుంబం అంతా శిరిడి” వెళ్ళాం, మా మతాచారం ప్రకారం ఆడవాళ్ళు ఘోషాలోనే వుండాలి, బురఖా ధరించి వుండాలి.

‘శిరిడి’ వెళితే అలా నేను బురఖా వేసుకునేదాన్ని కాదు. అందుకని మావారికి అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు అని అంటూ నన్ను చూసుకోవడమే సరిపోయేది, ఎంతో చిరాకుతో వుండేవారు.

ఒక భగవంతుడి దర్శనానికి వచ్చినట్లుగా పాపం అనుకునేవారు కారు. ‘శిరిడిలో మూడు రోజులు వుంటే, ఆ మూడు రోజులు కూడా మావారిది అదే ధోరణి, నన్ను తిడుతూండడమే ఆయన పని.

కొన్ని రోజుల తర్వాత మావారి పాదంపై మచ్చలా వచ్చి, అది రూపాంతరాలు చెంది పుండు లాగా మారింది.

డాక్టర్స్‌ కి చూపించి అన్ని టెస్ట్‌ లు చేయిస్తే అది ‘కేన్సర్ అని చెప్పారు. అక్కడికి ఇక్కడికి చాలా చొట్లకి వైద్యం కోసం తిరిగాము, అది తగ్గటం మాట అటుంచి, బాగా పెరిగి కాలంతా వ్యాపించింది.

ఆ పుండుతో ఆయన ఏడు సంవత్సరాలు భాద పడ్డారు. రాను రాను కూర్చోవడానికి కూడా అవస్థ పడేవారు. రెండు సంవత్సరముల క్రితం చనిపోయారు.

నేను ఇప్పుడు పూర్తిగా బాబాను నమ్ముతాను. ‘సాయి సచ్చరిత్ర పారాయణ కూడా చేస్తాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బాబాను బాగా నమ్ముతాడు.

మా వారు వున్నప్పుడు వాడికి పెళ్లి చేయాలనుకున్నాము. సంబంధాలు వస్తున్నాయి, కానీ ఏ సంబందమూ కుదరటం లేదు,

ఈ సంబందం కుదిరిపోతుందిలే అనుకునే లోపు ఎదో ఒక అవాంతరంతో ఆ సంబందం తప్పి పోతూండేవి.

ఇంతలో ఒక సంబందం వచ్చింది అబ్బాయి అమ్మాయి ఒకళ్ళనోకళ్ళు చూసుకోవటం, నచ్చటం జరిగింది.

మావారికి ఈ సంబందం బాగా నచ్చింది, ఎందుకంటే వాళ్ళు కట్నం బాగా దండీగా ఇస్తాం అన్నారు. నాకెందుకో ఈ సంబందం వద్దు అనిపిస్తోంది.

మావారు చేసేయ్యాలని పట్టుపట్టారు, మా ఇద్దరికి వాదన అయింది. ఇంక ఇలా లాభం లేదని నేను ‘బాబా’ ముందు చిట్టీలు వేద్దామన్నాను, సరేనన్నారు,

ఇద్దరం ‘బాబా’ ముందు నిలబడి “చేయి, వద్దు” అని రెండు చిట్టీలు రాసి “బాబా” ముందు ఉంచాం (‘ఏదైనా తేల్చుకోలేని సమస్య మనకి ఎదురైతే ‘బాబా’ ముందు చిట్టిలు వేయడం అన్నది బాబా భక్తులందరికీ సుపరిచితమే. కానీ, మనకు నచ్చిన సమాధానం వచ్చేవరకు చిట్టీలు తీయకూడదు. ఒక్కసారే తీయాలి. అదే ఖచ్చితంగా బాబా మనకు ఇచ్చిన సమాధానం అనుకోవాలి. మనకు అనుకూలంగా లేదని, మనకి నష్టం వస్తుందని ఆలోచించకూడదు.)

ఈ సంబంధం చేయవద్దు అని సమాధానం వచ్చింది. “చూడండి ‘బాబా’ కూడా వద్దు అంటున్నారు” అన్నాన్నేను, దానికి “మా వారు ఏం కాదు ఈ పెళ్లి చేసేద్దాం ఈ సంబంధం బాగుంది, నువ్వు నీదేవుడూనూ” అని పట్టుబట్టారు.

“బాబా”ముందు చీట్లు వేశామని, ‘వద్దు’ అని వచ్చిందని ఇంక ఎక్కడైనా చెప్పావంటే చూడు నిన్నేంచేస్తానో అని, ఎవరికీ చెప్పద్దు అని బెదిరించారు.

నేను చేసేందుకు ఏమీ లేక బాబాకి దండం పెట్టి “బాబా నువ్వే ఈ గండం నుండి, సమస్య నుండి బయట పడెయ్యి” అనుకున్నాను.

ఆడ పెళ్లి వాళ్ళకి ఎమైదో ఏమో కానీ మాకు ఈ సంబంధం వద్దు అని, ఇప్పట్లో మా అమ్మయికి పెళ్లి చేయమని, మాకు అప్పులున్నాయని చెప్పి వాళ్ళే విరమించుకున్నారు.

ఆ తరువాత మా అబ్బాయికి పెళ్లి యోగం వున్నదా, లేదా అని కనుక్కొవడానికి ఒక ఫకీర్‌ ను కలవడానికి వెడుతూ, ఒక సాయి భక్తురాలు ఇంటి మీదుగా వెళుతున్నాను.

ఆవిడ నాకు పరిచయముంది, ఆవిడ నన్నుచూసి పలకరించి, విషయం తెలుసుకొని అది విని ఆవిడ అనవసరంగా ఎక్కడికో వెళ్ళడం దేనికి ‘బాబా’ని అడుగుదాము రండి అంటూ వాళ్ళింటికి తీసుకు వెళ్ళింది,

మా ఇంట్లో “మన ప్రశ్నలకి బాబా జవాబులు” అన్న పుస్తకం వుంది. “అందులో మనం సమస్య అనుకొని పుస్తకం తెరిస్తే మన సమస్యకి జవాబు ఆ పేజీ లో దొరుకుతుంది”. అని పుస్తకం తీసుకువచ్చి నాకు ఇచ్చింది.

నేను సమస్యని మనసులో అనుకొని బాబాకి దండం పెట్టుకొని పుస్తకం తెరిచాను. అందులో ఇలా ఉంది

“ఏది జరిగిందో, అది మన మంచికే జరిగింది, నా మాట వినకుండా మీరు అనవసర ప్రయాస పడుతున్నారు, ఇది జరుగుతుందా లేదా అని మీరు అనవసరంగా దొంగ బాబాలని నమ్మి డబ్బును, సమయాన్ని వృధా చేసుకోవద్దు, మీకు జరిగిందంతా మీ మేలు కోసమే అని గుర్తించండి” అని వచ్చింది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles