రెండు కుటుంబాల మధ్య ఉన్న పెండ్లి అడ్డంకులు, సచ్చరిత్ర పారాయణతో తొలగిపోవుట.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సాయినాథాయ నమః

జమీలా బేగం గారి అనుభవములు రెండవ భాగం

మర్నాడు నేను పద్మావతి గారింటికి వెళ్లి, ఆవిడతో ఆమాటా, ఈమాటా మాట్లాడుతుంటే, మా అబ్బాయి పెళ్ళి విషయం ఆవిడ అడిగారు,

నేను, నాకేం చేయాలో తోచట్లేదు అని భాద పడుతూంటే, “అయ్యో ఎందుకండీ అనవసరంగా భాదపడతారు, ఇదిగో చూడండి ఇది ‘బాబా’ గారి ‘సచ్చరిత్ర’.  ఇది మీరు పారాయణ! చేయండి, మీ అబ్బాయికి తప్పకుండా వివాహం కుదురుతుంది” అని చెప్పారు.

నేను ఆ పుస్తకం తీసుకు వచ్చి ఒక గురువారం నాడు గ్రంధపఠనం మొదలు పెట్టాను. బుధవారం నాడు చదవడం పూర్తి చేసాను,

ఆరోజు ‘బాబా’  గారు మా అబ్బాయి కలలో కనబడి “మీ అమ్మ, నాన్నలను ఒకసారి శిరిడి రమ్మని చెప్పు”అని చెప్పారట,

ఉదయం ఆఫీస్‌ కి వెళ్లేహడావుడిలో చెప్పటంమరచిపోయాడు, దిల్‌సుఖ్‌నగర్‌ దాకా వెళ్ళాక గుర్తు వచ్చి, మాకు ఫోన్‌ చేసి,

“అమ్మా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను,నాకు రాత్రి కలలో ‘“బాబా కనపడి అమ్మని, నాన్నని ఒకసారి శిరిడికి రమ్మన్నమని చెప్పారమ్మా, నేను దిల్‌సుఖ్‌నగర్‌ లో ఉన్నాను, రేపటికి టికెట్స్‌ బుక్‌ చేస్తున్నాను, మీరు వేడతారుగా” అని అడిగాడు.

నేను సంతోషంగా సరే అన్నాను. మరునాడు బయలుదేరి “శిరిడి” వెళ్ళాం. దర్శనానికి పూలు, పండ్లు తీసుకు వెళదామని అనుకుని కుడా, జనం ఎక్కువగా వుండటాన అవి తీసుకోకుండానే లైన్‌ లోకి వెళ్ళాము.

లైన్లోకి వెళ్ళాక పూలు, పండ్లు తీసుకురాలేదని గుర్తొచ్చి మరల దర్శనానికి వచ్చినప్పుడు తీసుకుందామని అనుకున్నాం. ఇలా అనుకున్నామో లేదో ఒకాయన మా దగ్గరికి వచ్చి పూలు, ప్రసాదాలుమాకు ఇవ్వచూపాడు.

అంత జనంలో ఆయన లోపల అమ్ముకోవడానికి సంస్థానం వారు ఎలా అనుమతించారో. అసలు సెక్యూరిటీ వాళ్ళు అంత దూరంలోనే అమ్మేవారిని ఆపేస్తారు. కాని ఈ మనిషి వాళ్ళని తప్పించుకొని ఎలా లోపలికి వచ్చాడో తెలియదు.

మేము ఈయన దగ్గర ఎందుకులే బయట కొనవచ్చు అనుకున్నాం. “మీరు మళ్ళీ దర్శనానికి లోపలికి రాలేరు, ఇంకా జనం పెరుగుతారు, నా మాట వినండి అంటూ వెంటబడ్డాడు”. మమ్మల్ని అవి తీసుకోమని ముందు నిర్భందించాడు, తర్వాత బ్రతిమాలాడు,

ఆ తర్వాత కోపంగా “నేనసలు పూలు అమ్ముకునే వాడినే కాదు, ఎదో మీరు కావాలి అనుకుంటున్నారు కాబట్టి నేను మీ దగ్గరికి తీసుకువచ్చాను” అన్నాడు.

ఇంక చేసేది ఏమీ లేక కొంత డబ్బు ఇచ్చి మేము పూలు, ప్రసాదాలు తీసుకున్నాము.

‘సాయికి’ అవి సమర్పించాము. బయటికి వచ్చాము అంతే, ఇంక మేము లోపలికి ఎంత ప్రయత్నం చేసిన వెళ్ళలేక పొయాము.తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా పెళ్ళి వాళ్ళ నుండి ఫోన్‌ వచ్చింది, పెళ్ళి సంబంధం మాట్లాడుకోవటానికి వాళ్ళు హైదరాబాద్‌ వచ్చారు.

అంతకుముందే పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక సంబంధం నలుగుతోంది. మేము వెళ్లి అమ్మాయిని చూసి వచ్చాము, పిల్ల మాకు నచ్చింది. పిల్లవాడు వాళ్ళకి నచ్చాడు,

ఈ లోపల ‘బాబా’ నుండి పిలుపురావటం, మేము శిరిడి వెళ్ళటం జరిగింది. వాళ్ళిప్పుడు పెళ్లి మాటలకు వచ్చారు.మేము వచ్చేటప్పటికి మీరు లేరు, ఎదో ఊరు వెళ్ళారని మీ పక్కింటి వాళ్ళు చెప్పారు.

ఇంతకీ ఏ ఊరు వెళ్లారు అని అడిగారు. వేము బొంబాయి వెళ్ళాము అని చెప్పాను. శిరిడి అని చెప్పవచ్చు, కాని వాళ్ళు మమ్మలను ఎగతాళి చేసి సంబంధం ఎక్కడ వదిలి వెళ్ళిపోతారో అని మేము నిజం చెప్పలేదు.

అక్కడ చుట్టాలెవరూ లేరు ఊరు చూడటానికి వెళ్ళాము అని చెప్పాము. నిజం చెపితే వీళ్ళు హిందూ దేవుళ్ళని కొలుస్తున్నారని, మత భ్రష్టం చేస్తున్నారని, గొడవ చేసి, నానా యాగీ చేస్తారు.

మాటలు అయ్యాయి అన్నికుదిరాయి. ఏ హడావిడులు, ఆర్భాటాలు లేకుండా సాఫీగా వివాహం జరిగిపోయింది.

“ఆ తర్వాత తెలిసిందేమంటే ఆ పెళ్ళి కూతురు కూడా ‘సాయి భక్తురాలు’ ఆ అమ్మాయి కూడా వాళ్ళ స్నేహితుల ప్రోద్బలంతో ‘శ్రీ సాయి సచ్చరిత్ర’ పారాయణం చేసిందట”. వాళ్ళకి మా సంబంధం వచ్చింది.

అప్పటి నుండి మేము తరచూ ‘శిరిడి’ వెళ్తుండటం అలవాటయ్యింది. మేము ‘శిరిడి’ వెళ్ళిన ప్రతి సారీ ఎవరో తెలియని ఒక వ్యక్తి మాకు ఎదురు వచ్చి మేము ఉండటానికి రూమ్‌ చూపిస్తాడు. అది మాకెంతో బాగుంటుంది.

మారాక కోసం “బాబా ఎదురు చూస్తునట్లుగా అనిపిస్తుంది.  ఇప్పుడంటే ‘ఆన్‌ లైన్‌’ బుకింగ్‌ లు అవుతున్నాయి, కాని అప్పట్లో అలా వుండేది కాదు కదా? ఆరూమ్‌ చూపించే వ్యక్తి  ‘బాబా’ లాగా అనిపిస్తాడు.

ఒకసారి ఇలాగే ‘శిరిడి’ వెళ్లి వస్తున్నాము. ఇంకా ఇల్లు చేరుకోవటానికి గంట ప్రయాణం వుంది. ఈ లోపల రోడ్‌ పైనా ట్రాఫిక్‌ జాం అయి ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దానికి తోడు విపరీతమైన వాన కుడా కురుస్తోంది.

ఆ సమయంలో నాకు అర్జెంటుగా బాత్రూంకి పోవలిసిన పరిస్థితి. దిగుదామా అంటే వాన, ఎటైన విళ్ళిపోదామా అంటే చుట్టూ జనం ఎటు చూసినా ట్రాఫిక్‌ జాం, ఎటూ పోలేని పరిస్థితి, ఆపుకోలేని ఇబ్బంది, ఒంట్లోంచి భయంకరమైన భాధ నాకేంచేయాలో తోచటంలేదు,

ఆ సమయంలో ఇంక ‘సాయియే’ దిక్కుగా అనిపించి ‘బాబాని’ వేడుకున్నాను, “బాబా నా పరిస్థితి నీకు తెలుసు బాబా నన్ను ఈ మార్గం నుండి బయట పడేసే మార్గం చూపు తండ్రీ” అని ప్రార్థించాను.

నేను కళ్ళు తెరిచేప్పటికి మా కారు ముందు ఒక వ్యాన్‌ ఉంది, దాని ముందు ఒక కార్‌ ఉంది, అందులో నుండి ఒకాయన మా కార్‌ దగ్గరికి వచ్చి అటు నుండి దారి వుంది అటుగా వెళ్లి పోదాం పదండి అన్నాడు.

అసలు అటు పక్క రోడ్‌ మాకేమి కనిపించటం లేదు. మేము తారు రోడ్‌ మీద ఉన్నాము, అటు పక్క కొంచెంగా అంటే ఒక సైకిల్‌ పట్టేటట్టుగా వున్న మట్టి రోడ్‌ వుంది.

ఆయన అటుగా పోదాము అంటున్నాడు, మేమేమో పోలేము అని అంటున్నాము, లేదు లేదు పోవచ్చు మీరు బయపడకండి, సందేహించకండి, నన్ను నమ్మండి అంటున్నాడు.

అంతగా అయితే నేను ముందు వెళతాను, మీరు నా వెనకే వచ్చేయండి, అంటూ ముందుకు వెళ్లి తన కారు ఎక్కి కారు వెనక్కి తీసి తను చెప్పినట్లు కార్‌ పోనిచ్చాడు.

“రోడ్‌ లేని దారిన సైకిల్‌ కు మాత్రమే చోటు వున్న మార్గం లో కార్‌ వెళ్ళింది”, ఆయన్ని అనుసరించి మేము ట్రాఫిక్‌ లోంచి బయటకు వచ్చాం. ఆయన ‘శిరిడి’లో రూమ్‌ చూపించిన వ్యక్తి లాగా వున్నాడు.

మేము త్వరగా ఇల్లు చేరాము. ఆ తరువాత స్నానాలు అవీ చేసి, తీరిగ్గా టిఫిన్‌ తింటూ, టి.వి. అన్‌ చేసే సరికి ఇంకా కిలో మీటర్ల పొడవుగా ట్రాఫిక్‌ జాం అయిందని వేస్తున్నాడు. మమ్మల్ని ‘బాబా” ఎలా ఇంటికి చేర్చారో! ఇంకా ఆశ్చర్యంగానే వుంది.

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles