Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 10వ. అధ్యాయం
గర్భవతిగా ఉన్న నామితృని కుమార్తెకు మతిస్థిమితం లేదు. ఆమె ఎప్పుడు అరుస్తూ వస్తువులన్నిటినీ కిటికీ గుండా విసిరివేస్తూ ఉండేది.
ఆమెకు ప్రసవించే సమయం దగ్గర పడింది. కాని ప్రసవం చాలా కష్టమవచ్చని డాక్టర్స్ చెప్పారు.
దానితో అందరూ చాలా ఆందోళన పడ్డారు. ఆమెను ఎల్లవేళలా కనిపెట్టుకుని వుండేలాగ ఒక మంచి నర్స్ ని నియమించారు. కాని శ్రీసాయిబాబా వారి ఆశీర్వాదంతో ఆమె సమస్యలన్ని తీరిపోయాయి.
ఒకరోజు ఉదయాన్నే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. డాక్టర్ ని తీసుకురావడానికి ఒక మనిషిని పంపించారు.
యింకొకతను ఆమె అక్కగారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆమె అక్కగారు వెంటనే వచ్చింది. అక్కగారు ఆమె దగ్గరకు వచ్చిన వెంటనే, ఆవిడ చెల్లెలికి ఎటువంటి కష్టం లేకుండానే మగపిల్లవాడు జన్మించాడు.
వెంకటరావు దక్షిణ కెనరాలోని ముల్కీ గ్రామ వాస్తవ్యుడు.
1916 వ. సంవత్సరంలో అతనికి క్రిస్మస్ రోజున బాబా ఫొటో ఉదీ వచ్చాయి. అతని అల్లుడు హై కోర్టులో లాయరు. అతను కనపడకుండాపోయాడు. అతను మరణించి వుండవచ్చనె వదంతులు కూడా వచ్చాయి.
వెంకటరావుని అతని స్నేహితుడు షిరిడీ వెళ్ళి బాబావారిని దర్శించుకోమని ఆయన సహాయం చేస్తారని చెప్పాడు. కాని వెంకటరావుకు ఆసమయం లో షిరిడీ వెళ్ళడానికి సాధ్యపడలేదు.
ఒకసారి వెంకటరావు బొంబాయిలో ఉన్నప్పుడు, అయన వద్ద అప్పటికే బాబా ఫొటో ఊదీ ఉండటం వల్ల, మేము ఆరతి ఇచ్చి ఆయన నుదిటి మీద ఊదీ పెట్టాము. ఇది బొంబాయిలో జరిగింది.
అదే సమయంలో ముల్కీలో ఉన్న ఆయన కుమార్తెకు ఒక స్వప్నం వచ్చింది.
ఆయనకు బాబా ఫొటొ వచ్చిందా అనీ ఒకవేళ వస్తే ఫలానా తారీకున, ఫలానా సమయంలో ఆరతి ఇచ్చారా అని ఆమె తన తండ్రికి ఉత్తరం వ్రాసింది. ఉత్తరం చదవగానే,
తాను బాబాకి ఆరతి ఇచ్చిన తేదీ సమయం , తన కుమార్తెకు వచ్చిన స్వప్నంలో కనిపించిన తేదీ సమయం రెండూ కూడా సరిగ్గ సరిపోవడంతో వెంకటరావు చాలా ఆశ్చర్యపోయాడు.
ఈ సంఘటన వెంకటరావుకు బాబాపై భక్తిని మరింతగా పెంచింది. అతని అల్లుడిని గురించిన ఎటువంటి ఆధారాలు అతనికి లభించలేదు.
కానీ బాబాపై అతని భక్తి ఏమాత్రం చెక్కు చెదరలేదు. బాబా మీద ఎంతో భక్తితో అతను ఊదీ సేవించగానే ఎన్నో వ్యాధులు నయమయాయి. ఒకసారి అతనికి గుండె నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు.
ఆస్థితిలో అతనికి బాబా దర్శనమయింది. బాబాతో కూడా ఆయన యిద్దరు సేవకులు కనిపించారు. అతను ఎంత వద్దని వారించినా వారిద్దరూ అతని పాదాలను రుద్దసాగారు.
కొంత సేపయిన తరువాత ముగ్గురూ అదృశ్యులయ్యారు.
ఆతరువాత 1918 లో యీస్టర్ సెలవులకు వెంకటరావు షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొన్నాడు.
తనకు వచ్చిన దివ్యదర్శనంలో కనిపించిన బాబా యిద్దరు సేవకులు బాబావద్ద కూర్చుని ఉండటం కనిపించి ఆశ్చర్యపోయాడు.
వెంకటరావు పెద్దకొడుకు ఒక నాస్తికుడు.
అతడు తన తండ్రి భక్తిని, నమ్మకాలను చూసి ఎగతాళి చేస్తూ ఉండేవాడు.
కాని, ఈసంఘటనలన్న్నీ చూసిన తరువాత అతనికి కూడా బాబాపై విశ్వాసం కుదిరి మంచి బాబా భక్తుడయ్యాడు. తనకెపుడే సమస్య వచ్చినా వెంటనే బాబా రక్షణకోసం షిరిడీకి ఉత్తరం వ్రాసేవాడు.
గోవిందరావు మొక్కు
గోవిందరావు గధ్ధే నాగపూర్ నివాసి.
ఒకసారి అతని చెల్లెలు కుమారునికి ప్రమాదకరమయిన జబ్బు చేసింది.
మందులెన్ని వాడినా ప్రయోజనం లేకపోయింది.
ఆస్థితిలో గోవిందరావు, పిల్లవాడికి బాగయితే షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడు. ఆమరుసటిరోజు నుండి పిల్లవాడి ఆరోగ్యం మెరుగవడం మొదలై కొద్ది రోజుల్లో పూర్తిగా స్వస్థత చేకూరింది.
తరువాత గోవిందరావు తన మొక్కు సంగతి మరిచిపోయాడు.
ఆమొక్కు తీరకుండా అలాగే ఉండిపోయింది.
అతనికి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయి ఎన్ని మందులువాడినా తగ్గలేదు. ఇలా ఉండగా ఒక గురువారమునాడు భజన చేసే సమయంలో అతనికి తన మొక్కు సంగతి గుర్తుకు వచ్చింది.
తనకు పూర్తి ఆరోగ్యం చేకూరితే కనక తన మేనల్లునితో కలిసి బాబా దర్శనం చేసుకుంటానని మరలా ప్రార్ధించాడు. రెండు రోజులలోనే అతను పూర్తి ఆరోగ్యవంతుడయాడు. బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాడు
(ఆఖరి భాగం రేపు)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 5వ. అధ్యాయము–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 11వ. అధ్యాయము….Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 8వ. అధ్యాయము–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 4వ. అధ్యాయము–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 9వ. అధ్యాయము–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments