సాయి అనుగ్రహం: కొబ్బరికాయ లో దొరికిన ముక్కుపుడక–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by : Mrs Lakshmi Prasanna



సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

“ముక్కుపుడక”:-

 సాయి లీలలు అమోఘం అగ్రాహ్యం అనంతం. ఈలీల చాలా ఆలోచింపచేసేది.

సంతానం  కోసం, పూనే నుండి ఒక దంపతులు షిర్డీ బయలుదేరారు. కోపర్గాం దగ్గరకు వచ్చేసరికి, ఆమె “ముక్కుపుడక” ఎక్కడో పడిపోయింది.

ఇంక చెప్పేదేముంది? మన లక్షణాలు తెలసినవే కదా! చిన్నదికానీ పెద్దదికానీ ఏదయినా ఒక వస్తువు పోయినా, కనిపించకపోయినా తెగవెతుకుతాం.

కనిపించిన దాకా నిద్దురపట్టదు. ఇదంతా మానవ నైజం. ఇక ఆభార్యభర్తకు ఒకటే ఏడుపు. ప్రపంచం తలకిందులయినంత బాధ. అలాగే ఆఏడుపుతోనే, బాబా దగ్గరకు వచ్చారు.  

బాబా తో ఏంచెప్పలేదు వారు ఇద్దరూ నమస్కారం చేసుకున్నారు.

బాబా ఒక టెంకాయ వారిద్దరి చేతిలోపెట్టి, ఇది ఇద్దరూ తినండి అని ఊదియిచ్చి, “మీరు అనుకున్నది నెరవేరుతుంది” అని ఆశీర్వాదం చేసారు.

ఇద్దరూ బాబా యిచ్చారు కదా అని టెంకాయ పగలకొట్టారు. ఆశ్చర్యం – “టెంకాయమధ్యవున్న  కొద్దిపాటి నీటిమధ్యలో, కోపర్గాం లో పోగొట్టుకున్న,”  “ముక్కుపుడక” వుంది.

అంతే ఆనందంతో తబ్బిబ్బు అయిపోయి, “ముక్కుపుడక” తీసుకుని టెంకాయచిప్పలు అక్కడే పడేసి వెళ్లారు. ఖర్మ కాకపోతే ఏంటి చెప్పండి.

అసలు వారు వచ్చినది ఎందుకు? ఏమహానుభావుడి అనుగ్రహం  కోసం వచ్చారో కూడా మరిచిపోయే దుస్థితి.

వెంటనే  బాబా వాడాలోవున్న మనిషిని పంపి, వారిద్దరినీ వెనుకకు పిలిచి, మీకు నేనేమి చెప్పాను? మీరేంచేస్తున్నారు? నేనుచెప్పేది మీకోసమే కదా! అని ఆరెండు చిప్పలు చేతుల్లో పెడతారు.

అసలు ఆయనకేంపని చెప్పండి. వాళ్ళు వచ్చింది ఎందుకనే విషయం ఆయన గుర్తు పెట్టుకొని ప్రసాదం యిచ్చి పంపటం ఏంటసలు?

ఆయన ప్రేమతత్వం మనం ఎప్పుడు, ఎప్పటికి అర్దం చేసుకుంటాము? ఎంతటి కరుణాసముద్రుడాయన. తనని నమ్ముకున్నవారు ద్వారకామాయిలో అడుగు పెడితే చాలు వట్టి చేతులతో పంపడని చెప్పటానికి ఈలీల చాలదూ!

అందరి ధ్యాస దేని చుట్టూ తిరుగుతుందో అని గమనించాలి. అందుకనే వెంకయ్య స్వామి అంటారు….. “నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకునే సరికి నువ్విక్కడ వుండవుగదయ్యా” అంటారు.

ఎంత సత్యం మనసు నిరంతరం “డబ్బు” చుట్టూ తిరుగుతుంది. ఇది గమనించుకోవాలి. సచ్చరిత్ర లో వున్నమాట మనకు వెంటనే గుర్తుకురావాలి.

“ఒక్క లోభం వుందా…. ఎన్నిసత్సంగాలు చేసినా తీర్థయాత్రలు, ఎంత సాధన చేసినా ఏంప్రయోజనం లేదు. డబ్బే పరమార్థం కాకూడదు.

బోలో సాయి నాధ మహారాజ్ కి జై 🙏

ఇందిరా వాణి….. నెల్లూరు

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles