Sai Baba…Sai Baba…Quiz- 23-03-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : G.Annapoorna

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 280

1 / 9

ఎన్ని దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి యయిదవనాడు నిస్సంకోచముగ దానిని తామే తీసివేసిరి?

2 / 9

బాబాను పరీక్షించుటకు తర్ఖడు కెట్టి ద్రాక్షలు దొరికెనని యడిగెను. గింజలతోనున్నవి దొరికెనని తర్ఖడ్ చెప్పెను. ........... ఆశ్చర్యపడెను.?

3 / 9

మన స్నేహితులుగాని, బంధువులుగాని మనతో లేకున్నచో, మంచి పిండివంటలు కూడ రుచింపవు. కాని వారు మనతో నున్నచో ఆ పిండివంటలు మరింత రుచికరములగును. ............. కూడ అట్టిదే. దీనిని మన మొంటరిగా తినలేము, స్నేహితులు, బంధువులు కలసినచో చాల బాగుగా నుండును.?

4 / 9

అట్లనుచు ............... తిరుగు ప్రయాణమునకు సిద్థమయ్యెను. తక్కిన తోటి  ప్రయాణీకులు అతనిని తన ప్రయత్నమును మాని శిరిడీ లోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా యా జండాలను కాని తక్కిన వస్తువులనుగాని ఆడంబరములనుగాని కీర్తినిగాని లక్ష్యపెట్టనివారని చెప్పిరి. అవన్నియు నలంకరించినవారు బాబా భక్తులేగాని ఆయనకేమి యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి ప్రేమలకొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి శిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు జేసిరి?

5 / 9

ఈ సంగతి విని కుర్రవాని మామయగు ..........  ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోను మన్ మాడ్ లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగ చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున నతడు శిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలిబాగులో గడుపవలెననుకొనెను?

6 / 9

శిరిడీలో రామ్ గీర్ బువ యను సన్యాసి యుండెను. .............. అతనిని బాపుగీర్ బువ యనువారు. అతని స్వగ్రామము ఖాందేషులో నుండెను. అత డచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను.?

7 / 9

 నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్ళకు మూడడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని, నోటితో గాని నీళ్ళను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. ……… , ……… గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలోనుంచి బయటికి దీసి, యెట్లుంటివని యడిగిరి. "ఆనందములో మునిగియుంటిని. నేను పొందిన యానందమును నావంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు" అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారివద్ద నుంచుకొనిరి.?

8 / 9

ఈ ప్రకారముగ బాబా అనేక పుస్తకములు శ్యామావద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబా కిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా ఎవరికి ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది యాతనికి మేలు చేయుననిరి.?

9 / 9

దీని తరువాత 15 దినములు గడచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నా కిచ్చెను. నా శరణు వేడెను. అతడిట్లనియెను. "నేను పిచ్చియెత్తి యిట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై బెట్టితిని. దయచేసి క్షమించుము." ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయమొనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన ……….ని చూచుట కెంతో గాఢమైన కోరిక కలిగినది.?

Your score is

0%


” ప్రాపంచిక విషయములనన్నింటిని మరచి, నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను, చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచవిషయములం దెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండి బయటకు లాగెదను. ”   (శ్రీ సాయిసచ్చరిత్రము 3వ అధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles