ప్రమాదం అంతా మానసికమైన అవిటితనంతోనే! దాన్ని ఎవరికి వారే తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే సుఖసంతోషాలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘మిరికర్‌కి ఏదయినా చెప్పదలచుకున్నారా?’’ బాబాని అడిగాడు శ్యామా.‘‘చెప్పడానికి ఏముంది? ఏమీ లేదు.

శరీర పరమైన అవిటితనం ఈరోజు కాకపోతే రేపు నయం అవుతుంది. ఎవరో ఒకరు తొలగిస్తారు. దాంతో ప్రమాదం లేదు. ప్రమాదం అంతా మానసికమైన అవిటితనంతోనే! దాన్ని ఎవరికి వారే తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే సుఖసంతోషాలు.’’ అన్నారు బాబా.‘‘వెళ్ళిరా’’ అన్నారు. బయల్దేరాడు శ్యామా.

హఠాత్తుగా అహ్మద్‌నగర్‌కి వెళ్ళి రమ్మనడం, మానసిక అవిటితనాన్ని తొలగించుకోమని బాబా చెప్పడం శ్యామాకి అంతు చిక్కలేదు. అహ్మద్‌నగర్‌ చేరుకున్నాడతను. అక్కడి పని చక్కబెట్టుకున్నాడు.

మధ్యాహ్నానికి మిరికర్‌ ఇంట అడుగుపెట్టాడు. శ్యామాని చూస్తూనే బాబాని చూసినంతగా పొంగిపోయాడు మిరికర్‌. గట్టిగా కౌగిలించుకున్నాడతన్ని.‘‘నిన్ను చూస్తోంటే బాబాని చూస్తున్నట్టుగా ఉంది. చాలా ఆనందగా ఉంది శ్యామా’’ అన్నాడు మిరికర్‌.

‘‘చెప్పు, ఊరకరారు మహానుభావులని. ఏంటిలా వచ్చావు. నువ్వు రావాలని రాలేదులే! బాబా నిన్ను పంపించి ఉంటారు. అవునా?’’ అడిగాడు మిరికర్‌. ‘అవును’ అన్నట్టుగా సన్నగా నవ్వాడు శ్యామా.

‘‘నాకేదయినా ఆజ్ఞాపించారా? ఏం చెప్పారు నీకు?’’‘‘చెప్పడానికి ఏముంది? ఏమీ లేదు.

శరీర పరమైన అవిటితనం ఈరోజు కాకపోతే రేపు నయం అవుతుంది. ఎవరో ఒకరు తొలగిస్తారు. దాంతో ప్రమాదం లేదు. ప్రమాదం అంతా మానసికమైన అవిటితనంతోనే! దాన్ని ఎవరికి వారే తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే సుఖసంతోషాలు అన్నారు బాబా.’’ చెప్పాడు శ్యామా.

బాబా తనతో అన్న మాటల్ని అక్షరం తేడా లేకుండా చెప్పాడు. అప్పుడే అక్కడికి చేరుకున్నాడు దీక్షిత్‌. ఆ మాటలు తనని ఉద్దేశించేనని అర్థం చేసుకున్నాడతను. కళ్ళు చెమర్చుకున్నాడు.

‘‘శారీరకమయిన అవిటితనం, మానసికమయిన అవిటితనం…ఏంటిదంతా? ఎవరి గురించి?’’ ఆలోచించసాగాడు మిరికర్‌.

‘‘నా గురించే. నా గురించే బాబా ఆ మాటలన్నారు.’’ అన్నాడు దీక్షిత్‌. మిత్రుల ముందుకొచ్చాడతను.‘‘నీ గురించా?’’ ఆశ్చర్యపోయాడు మిరికర్‌. శ్యామా కూడా అదే భావాన్ని వ్యక్తం చేశాడు.

‘‘అవును, నా గురించే బాబా ఆ మాటలన్నది. బాబానే నేను పరీక్షించాలనుకున్నాను. ముందు నా కష్టాలు గట్టెక్కితే అప్పుడు బాబాని తీరిగ్గా నమ్ముతానన్నాను.

అన్నందుకుగాను శారీరక అవిటితనాన్ని తొలగిస్తాను. కాని, నీ మానసికమయిన అవిటితనాన్ని నేను తొలగించలేను. దాన్ని నీ అంతట నువ్వే తొలగించుకోవాలన్నారు. నాకిప్పుడంతా అర్థమయింది.

బాబాని పరీక్షించేందుకు నేనెంత? నా బతుకెంత? తప్పు చేశాను. సరిదిద్దుకోవాలి. వెళ్ళి బాబా పాదాల మీద పడి పోవాలి. బాబానే నా దేవుడు. నేను బాబాని చూడాలి. షిరిడి వెళ్ళాలి.’’ అన్నాడు దీక్షిత్‌. ప్రాయశ్చిత్తంగా ఏడుస్తూనే ఉన్నాడు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles