Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
భావూ మహారాజ్ కుంభార్ మొదటి బాగం…
షిరిడి సమాధి మందిర ప్రాంగణంలో లెండి తోటకు దగ్గర కుడి ప్రక్కన అతి కొద్ది మంది ఆనాటి సాయి భక్తుల సమాధులు దర్శనమిస్తాయి. వాటిలో శ్రీ భావూ మహారాజ్ కుంభార్ గారి సమాధి ఒకటి. ఈయన గురించి పెద్దగా సాయి భక్తులకు తెలియకపోవడం కడు శోచనీయం.
బాహు మహారాజ్ గారు చిన్నతనం నుండే ఆధ్యాత్మికంగా ఎదిగారు. అతని పూర్వీకులు మహారాష్ట్రలో నీంగావ్ అనే చిన్న గ్రామంలో కుల వృత్తి చేసుకుంటూ జీవనం గడిపేవారు. వృత్తి పరంగా కుమ్మరులు. అందుకే కుంబార్ అనే వారు. వారు యుక్త వయస్సు లోనే షిర్డీకి వచ్చేసారు. షిర్డీలో శని దేవాలయం దగ్గర వీరు బస ఏర్పాటు చేసుకున్నారు.
ఒక్కోసారి రహతా వెళ్లే దారిలో భారీ మర్రిచెట్టు క్రింద ఉండేవారు. అప్పుడప్పుడు రహతా, సకోరీ, నీంగావ్ మరియు ఇతర పొరుగు గ్రామాలకు వెళ్లేవారు. ఎక్కువ శాతం షిర్డీలోనే గడిపేవారు. భిక్ష చేసుకుంటూ జీవించేవారు.
చాలా మర్యాదస్తులు. వీరంటే షిర్డీ ప్రజలకు అభిమానం మరియు గౌరవం. వీరి భుజం మీద ఎప్పుడూ ఒక గొంగళి ఉండేది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ గొంగళితోనే షిరిడీ వీధులు శుభ్రం చేసే పనిలో ఉండేవారు.
ఎప్పుడు ఎంతో శాంతంగా సాత్వికంగా ఉండేవారు. చెట్ల క్రింద పాడుకొనేవారు. ఎవరిని ఏమి అడిగేవారు కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని నేలకేసి కొట్టేవారు. కౌపీనం మాత్రమే ధరించేవారు.
ఎవరైనా బట్టలు ఇస్తే, వాటిని మొక్కలపై కప్పి, వాటితో “చలిగా ఉందా” ఇవి కప్పుకోండి. చలి తగ్గిపోతుంది” అనేవారు. “మీరు కప్పుకోండి మహారాజ్” అని ప్రేమగా దుప్పటిస్తే, దాన్ని ముక్కలు చేసి బాబా సమాధి మందిరం, మశీదు తుడవడానికి ఉపయోగించేవారు.
అతను భిక్షా చేసుకుంటూ ఆ భిక్షనే ఆహారంగా తీసుకొని జీవించేవారు. కొన్నిసార్లు అతను డబ్బు కోసం బాబాని సందర్శించడం కోసం వచ్చే భక్తుల వద్ద యచించేవారు. కానీ అతను ఆ ధనాన్ని స్వీకరించిన వెంటనే అతను పేదలకు మరియు నిరాశ్రయులకు పంపిణీ చేశావారు.
అరుదైన సందర్భాలలో అతను కొద్ది మొత్తం ఉంచుకొని దానితో కొంత తీపి పదార్ధాలు కొని పిల్లలకు ఇచ్చేవారు. కొన్ని సందర్బాలలో అతను బిడ్డలకు అవసరమైన మందులను కొనుగోలు చేసి, ఆ బిడ్డ తల్లికి ఇచ్చేవారు.
బావు మహారాజ్ ప్రతి ఒక్కరితో స్నేహపూర్వక సంబంధం కలిగి ఉండేవారు. అతను మృదువుగా, మర్యాదగా మాట్లాడేవారు. గ్రామస్తులు సందర్శకులు మరియు భక్తులు ఆయనను ఇష్టపడేవారు మరియు గౌరవించారు. కొందరు ఆకతాయిలు ఆయనతో పోరాడి ఆయన దగ్గర వున్న డబ్బు, బట్టలు తీసుకొనేవారు. అలా చేసిన అతను ఇబ్బంది పడలేదు పైగా వారిని నోరు తెరిచి ఒక మాట కూడా అనేవారు కాదు.
తనవల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నడుచుకోనేవారు. ఎవరైనా పరుషంగా మాట్లాడిన, తిరిగి ఏ సమాధానం చెప్పేవారు కాదు. పసిపిల్లలన్నా, పశువులన్న, మొక్కలన్న ఆయనకు యెనలేని ప్రేమ. ఆ నోరులేని ప్రాణులను ప్రేమించమని, తద్వారా ఎంతో మేలు జరుగుతుంది అనేవారు. ఇవన్నీ చూసి నాటి సాయి భక్తులు ఆయనను గొప్ప మహాత్మునిగా గౌరవించేవారు.
రేపు రెండవ బాగం..
source: http://saiamrithadhara.com/fivesamadhis.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భావూ మహారాజ్ కుంభార్ రెండవ బాగం…
- సాయి భక్త ముక్తారాం – మొదటి బాగం….
- దేవ్ బాబా – దభోల్కర్ యొక్క మనవడు – మొదటి బాగం….
- శ్రీ. రావ్ సాహెబ్ వి.పి.అయ్యర్ – మొదటి బాగం….
- అప్పా కులకర్ణి మొదటి బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “భావూ మహారాజ్ కుంభార్ మొదటి బాగం…”
T.V.Madhavi.BBSR
May 26, 2017 at 11:12 amchalaa baagundhi..sai..manchi collection.
Sai Suresh
May 27, 2017 at 8:06 amధన్యవాదాలు సాయి
kishore Babu
May 27, 2017 at 10:20 pmThank you mam..For your comments..Please encourage the authors by your comments so that they get energy to get write more articles.
HARI
May 26, 2017 at 12:57 pmSUPER SAI… YOU ARE DOING ULTIMATE SEVA
Sai Suresh
May 27, 2017 at 8:10 amఅంత బాబా గారి దయ సాయి. వారికీ కావలసినది వారె చేయించుకుంటారు సాయి