Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
పేరు తెలియని ఒక భక్తురాలి అనుభవం
హాయ్, కొన్ని సంవత్సరాల క్రితం నుండి నేను సాయి బాబా యొక్క భక్తురాలిని, కానీ గత సంవత్సరం లేదా రెండు సంవత్సరాల నుండి, నేను ఆయనను మరింతగా ఆరాధించడం ప్రారంభించాను. నేను మీకు చెప్పబోయే ఈ సంఘటన కొన్ని రోజుల క్రితం జరిగింది.
వాతావరణంలో మార్పు కారణంగా, నాకు తీవ్రంగా 101.6 డిగ్రీల చలి జ్వరం వచ్చింది. నాకు చాలా నీరసంగా ఉంది. అదే సమయంలో నా 5 నెలల శిశువు పై శ్రద్ధ వహించవలసి ఉంది.
సుమారు మధ్యాహ్నం ఒంటి గంటకి నా జ్వరం వెంటనే తగ్గిపోవాలని అని సాయిని ప్రార్ధించి, కొంచెం ఊధి నుదిటి మీద పెట్టుకొని, కొంచెం నోటిలో వేసుకొని, నేను 10 నిమిషాలు నిద్రపోయాను.
నేను నిద్రలేచినప్పుడు, నా శరీరం చాలా చల్లగా ఉండి చెమటలు పడుతున్నాను. నాకు నీరసంగా కూడా అనిపించట్లేదు. ఇది అంత బాబా యొక్క కృప మూలంగా జరిగింది. మరియు డాక్టర్ వద్దకు వెళ్ళకుండా 2 రోజులలో నాకు పూర్తిగా నయమైపోయింది.
ఇక్కడ మరొక సమస్య వచ్చింది. నా బిడ్డకు నా ద్వారా జలుబు వచ్చింది. పాపకు జలుబు వచ్చి తుమ్మలు మొదలు అయ్యాయి. నేను నా పాప బాధ అనుభవించటం చూడలేకపోయాను. అనవసరమైన యాంటీబయాటిక్స్ ఇస్తారని డాక్టర్ వద్దకు వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు.
నేను పాపకు నయం కావాలని బాబాని ప్రార్థించాను, మరియు నేను సాయి బాబా ఫోరంలో ఒక ప్రశ్నను అడిగాను. అక్కడ నాకు అనుకూల సమాధానం వచ్చింది.
నేను కొన్ని ఇంటి చిట్కాలు పాపకు ఉపయోగించాను దానితో నా బిడ్డ జలుబు తగ్గిపోయింది. బాబా నాపై చూపే కరుణకు ఏమి చేసి నేను కృతజ్ఞతలు చెప్పుకోగలను.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయిని ప్రార్ధించు సమస్యలు తొలగును
- నేను ఏ విధమైన కష్టం లేకుండా నా పిల్లలను నేనే చూసుకొగలుగుతున్నాను.–Audio
- నాకు మంచి ఉద్యోగం,ఆర్థికస్థితి ఇప్పించమని బాబాని వేడుకునేవాడిని.–14
- బాబాని ఆర్ద్రతతో నీ జబ్బు నయం కావాలని ప్రార్దించు ! యీ విభూధిని నోట్లో వేసుకో–Audio
- విభూదితోనే నాభార్య కష్టం దాటుకుంది.ఆ హనుమాన్ సాయిబాబా రూపములో వచ్చారు అని నాకు అనిపిస్తుంది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments